ప్రశ్న: మన భారతదేశంలో, భారత సంస్కృతిలో మనం ఎప్పుడూ ప్రశాంతత గురించి, ఆనందం గురించి మాట్లాడుతుంటాం. మరి మన దేవతలు ఇన్ని ఆయుధాలతో, పది చేతులతో, పదిరకాల ఆయుధాలతో ఎందుకు చూపించబడతారు...హింసకు చిహ్నంగా ఎందుకు ఈ విధంగా చూపించబడుతున్నారు..?

సద్గురు: వాళ్ళు ఆయుధాలకున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు కాబట్టి…! ఈ దేశంలో మనకి ఇంతకు ముందర ఉన్న రాష్ట్రపతి - రాకెట్లు, మిసైల్సుకు సంబంధించిన శాస్త్రవేత్త. ఎంతో ప్రశాంతంగా ఉండేవారు ఆయుధ తయారీలో నిమగ్నులై ఉంటారు. ఎందుకంటే మనకు ఆయుధాలు ఉన్నప్పుడే మనం దేశంలోని ప్రశాంతతను నియంత్రించగలం అన్న విషయాన్ని వీరు అర్థం చేసుకున్నారు కాబట్టి. లేదంటే ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ, మన మీదకు వచ్చేస్తారు.

మీరు దేన్నైతే దేవుడు అంటున్నారో అది జీవితంలో అత్యున్నత అంశానికి ప్రతీకగా ఉంది.  మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికే ఇదంతా.

వేరే మతాల్లో దేవుళ్ళకు ఆయుధాలు ఉండవు. కానీ, ఆ మత ప్రజలు ఆయుధాలు పట్టుకుని తిరుగుతుంటారు. అంటే, మనం మానవ చైతన్యం ఇంకా అంత పరిణతి చెందని ప్రపంచంలో నివసిస్తున్నామని అర్ధం. మనకు ఆయుధాలు అక్కరలేని స్థితికి మానవ చైతన్యం ఇంకా పరిణతి చెందలేదు. “స్వయం సంరక్షణ ఒక సమస్య కాదన్న స్థితికి మనం ఇంకా చేరుకోలేదు. ఎంతో సాధికారత, ఎంతో సాఫల్యత సాధించిన దేశాలన్నీ కూడా; సాధారణంగా, ఆయుధాలను తయారు చేయడంవల్లే మనుగడ సాగిస్తున్నాయి. మన గ్రహం మీద అత్యున్నత వ్యాపారం - ఆయుధాలు. అందుకని, మన దేవుళ్ళకు క్కూడా ఇటువంటి గ్రాహ్యత ఉంది. వీరు ఇదంతా ఒక వ్యూహం ప్రకారం చేశారు. ఎందుకంటే ప్రజలు ఎలాగైనా దేవుళ్ళ దగ్గరకు సంరక్షణ - శ్రేయస్సు కోసం వెళుతున్నారు. మరి ఆ భగవంతుడి దగ్గర ఆయుధాలు లేకపోతే - వీరు, వారిని ఉపయోగంలేని వారి క్రింద జమకడతారు కదా...? అందుకని వారు ఆయుధాలు తీసుకున్నారు. వారి దగ్గర, శాంతి చిహ్నాలు కూడా ఉంటాయి. ఇది ఒకేసారి ఒక గన్, ఒక చెట్టు కొమ్మ  రెండూ  పట్టుకోవడం లాంటిది. ఇది హింసకీ చిహ్నం కాదు, శాంతికీ చిహ్నం కాదు. మీరు దేన్నైతే దేవుడు అంటున్నారో అది జీవితంలో అత్యున్నత అంశానికి ప్రతీకగా ఉంది.  మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికే ఇదంతా...!!

జీవితం అనేది - ప్రశాంతతా కాదు, హింసా కాదు. ఇది ఎన్నో విషయాల సంక్లిష్టమైన కలయిక. ప్రశాంతత, హింస – అనే రెండూ కూడా ఇందులో ఉంటాయి. చాలామంది ప్రజలు, వారి తోటలోకి వెళ్ళితే, అక్కడ హాయిగా ఉందనుకుంటారు.  అక్కడ ప్రశాంతంగా ఉందనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. మీరు కొద్దిగా భూమిని త్రవ్వి చూస్తే, అక్కడ మనుగడ కోసం, పెద్ద ఘర్షణే సాగుతోందని మీరు తెలుసుకోగలుగుతారు. చెట్ల వేర్ల మధ్య, అక్కడ ఉన్న పురుగుల మధ్య, ఎన్నో  ప్రాణుల మధ్య ఎంతో ఘర్షణ సాగుతూ ఉంటుంది. అనుక్షణం ఎన్నో లక్షలకొద్దీ ప్రాణులు చంపబడుతూ ఉంటాయి.  ఎన్నో లక్షల కొద్దీ ప్రాణులు జన్మిస్తూ ఉంటాయి. మీ ఉద్దేశ్యంలో ప్రశాంతత అంటే – ఎవరినీ చంపకూడదు అన్నది.  ఇటువంటి ప్రశాంతత ఎంతో ప్రాధమికమైనది.

జీవితంలో అన్ని అంశాలూ ఉన్నాయి. అందుకే భగవంతుడు ఈ విధంగా అన్ని అంశాలతోనూ చిత్రీకరించబడ్డాడు

ఈ సంస్కృతిలో మనం ప్రశాంతత అనేది బయట జరుగుతున్నదానిగా భావించము. మనలో ఏమి జరుగుతోందో దానిని మనం ప్రశాంతతగా చూస్తాం. అందుకే జీవిత తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఎంతో అంతర్ముఖ శోధన జరిగింది..!! మీరు గనుక మీ తోటలోని లేదా ఒక అడవి ఉపరితలాన్ని చూసారనుకోండి, ఎక్కువమంది అడవే ప్రశాంతమైన ప్రదేశం అనుకుంటారు. కానీ, ఇది ఇంకా పరిణతి చెందని ఆలోచన. ఒక అడవి, ఎంతో హింస గలిగిన ప్రదేశం. మీరు, దీనిని గమనించారా...? ఏదైనా హింసాత్మకంగా మారినప్పుడు, మీరు దానిని “ఒక అడవిలా ఉంది” అంటారు. ఎందుకంటే అడవి అనేది ఎంతో హింసాత్మకమైన ప్రదేశం అని మీకు ఎక్కడో అనిపించింది. ప్రతీక్షణం ఎవరో ఒకరు, మరొకరిని చంపాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. చిన్నదైనా, పెద్దదైనా – ఇది, ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంది. మీరు అడవిని కనుక ప్రశాంతమైన ప్రదేశం అనుకుంటే, మీ దృష్టి లోతుగా లేదని అర్థం చేసుకోవచ్చు.

మీరు జీవితాన్ని మరికొంచెం నిశితంగా చూసినట్లైతే, మరికొంచెం లోతుగా అర్థం చేసుకున్నట్లైతే, మీకు “ప్రశాంతత” – “హింస” అన్న విషయాలే లేవు, అని అర్థం అవుతుంది. జీవన ప్రక్రియ అంటే సృష్టి – వినాశనం రెండూ కూడానూ ...! ఇవి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మీలో మీరు ప్రశాంతంగా ఉండవచ్చు లేదా ఒక రకమైన గందరగోళంలో ఉండవచ్చు. కానీ, మీ చుట్టూరా పరిస్థితుల పట్ల మీకు ఎటువంటి ఎంపికా లేదు. జీవితంలో అన్ని అంశాలూ ఉన్నాయి. అందుకే భగవంతుడు ఈ విధంగా అన్ని అంశాలతోనూ చిత్రీకరించబడ్డాడు...!!! మీరు కనుక ఆయన పది చేతులలో ఏమి ఉన్నాయో సరిగ్గా గమనిస్తే, అన్ని చేతుల్లోనూ కేవలం ఆయుధాలే లేవని మీకు తెలుస్తుంది. మనం దైవం అనేది అన్ని అంశాలలోనూ అత్యున్నతమైన దానికి ఒక ప్రతీక. అది కేవలం హింసకీ పరిమితం కాదు ... కేవలం ప్రశాంతతకీ పరిమితం కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

hindudeities.wordpress.com