కైలాస మానస సరోవరం - మాటలకందని అనుభవం
కైలాస మానస సరోవరం తీర్థ యాత్ర జీవితంలోని ఒక పరమార్థంగా చాలా మంది భావిస్తారు. విశ్వానికే ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణిస్తూ ఐదు వేరు వేరు మతాలవారు ఈ పరిసరాలను పూజిస్తారు. ఈ స్థలం అంతులేని ఇతిహాసాలకు ఆధారమైంది .
‘నేను’ అనే భావనని తగ్గించడమే తీర్థయాత్ర యొక్క మౌలిక ఉద్దేశ్యం. నడుస్తూ, అధిరోహిస్తూ, ప్రకృతి యొక్క కఠినమైన ప్రక్రియలకు మిమ్మల్ని మీరు గురిచేసుకుంటూ శూన్యంగా మారే ప్రక్రియే తీర్థయాత్ర. పూర్వం అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే ఒక వ్యక్తి ఎన్నో భౌతిక, మానసిక, ఇంకా అనేక ఇతర కష్టాలని ఎదుర్కోవాల్సి వచ్చేది. ‘నేను’ అనే భావన తగ్గాలనేదే వీటి వెనక ఉన్న ఉద్దేశ్యం. - సద్గురు
కైలాస మానస సరోవరం తీర్థ యాత్ర జీవితంలోని ఒక పరమార్థంగా చాలా మంది భావిస్తారు. విశ్వానికే ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణిస్తూ, ఐదు వేరు వేరు మతాలవారు ఈ పరిసరాలను పూజిస్తారు. ఈ స్థలం అంతులేని ఇతిహాసాలకు ఆధారమైంది.
కైలాస పర్వతం జ్ఞానానికి, అనుగ్రహానికి ప్రతీక. అంతరంగ జ్ఞానానికి సంబంధించిన విషయంలో మీ సృష్టి, అస్థిత్వము, విముక్తి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నవన్నీ ఇందులో ఉన్నాయి. మీ అవగాహనకు మీరు తగిన స్పష్టత ఇవ్వతలచుకుంటే ఈ అనంతమైన గ్రంధాలయం వైపు దృష్టి సారించవచ్చు. దీనిని శివుడి నెలవుగా భావిస్తారు, ఇతడిని యోగ సంస్కృతిలో దేవునిగా కాక ఆది యోగిగా - మొట్టమొదటి యోగిగా, మొట్టమొదటి యోగ గురువుగా భావిస్తారు.
"మానస సరోవరం" అంటే "చైతన్యంతో ఉన్న సరస్సు" అని అర్థం. ప్రపంచమంతటిలో దీనిని రోగ నిరోధక శక్తులతో కూడిన, అత్యంత పవిత్రమైన సరస్సుగా భావిస్తారు. సద్గురు, దీనిని మానవ శరీర వ్యవస్థకు లోతైన సంబంధం కలిగిన మార్మిక అద్భుతంగా వర్ణించారు. కైలాశ్ కు 20 కి.మీ దూరంలో, 15015 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మానస సరోవరంలో, కోరికలు తీర్చే దివ్య కల్పవృక్షం ఉందని నమ్ముతారు, ఇదే సంపూర్ణ సృష్టికి మూలంగా భావిస్తారు.
కైలాస మానస సరోవరం ఒక దిగ్భ్రమ పరిచే అనుభవంగా సద్గురు చెపుతారు. ఈ పవిత్ర ప్రదేశంతో తన సాన్నిహిత్యాన్ని ఆయన ఈ విధంగా వర్ణించారు, "నేనిప్పటి వరకు చూసిన వాటన్నిటి కంటే ఎంతో అధికమైంది"
గత ఎనిమిది సంవత్సరాలు నిరంతరంగా, "ఈశా సేక్రేడ్ వాక్స్","శివుని శరీరంపై నడుస్తూ" అని సద్గురు వర్ణించిన ఈ పదమూడు రోజుల యాత్రను భారత, నేపాల్ మరియు టిబెట్ ల మీదుగా నిర్వహిస్తున్నారు. ఈశా వేలాది మంది ప్రజలను, ప్రపంచంలోనే ఆశ్చర్యజనక ప్రదేశాల మధ్య నుండి అద్భుతమైన రీతిలో కైలాస్ యాత్రకు తీసుకువెళ్ళింది.
జాగ్రత్తతో ఖచ్చితమైన ప్రయాణ సదుపాయాలు కల్పించి ఈ యాత్రలో పాల్గొన్నవారికి ఒక అద్భుతమైన అనుభూతిని మిగల్చడానికి అన్ని ప్రయత్నాలు విజయవంతంగా సాగిస్తున్నారు.
ఇది నమ్మకానికి, విశ్వాసానికి లేక మతానికి సంబంధించిన ప్రశ్న కాదు. జ్ఞానోదయం పొందిన గురువు మార్గం చూపగా, పరమోత్తమ విముక్తి సాధనలో పూర్తిగా శరణాగతులవడానికి ఇది ఒక అద్భుత అవకాశం. వర్ణనాతీతమైన ఈ యాత్ర మనలోని దివ్యత్వంవైపు వేసే ఒక అడుగు.
కైలాస మానస సరోవర యాత్రకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. మరింత సమాచారం కోసం "ఈశా సేక్రేడ్ వాక్స్" వెబ్ సైట్ ని సందర్శించండి.
అతీత పార్శ్వంలోని ద్వారాలు మీకు తెరుచుకోవాలని నా ఆకాంక్ష.
- సద్గురు