ప్రతిష్ఠీకరించబడిన స్థలాలు మన మంచికే!
మన ప్రాచీన సంస్కృతి ఎల్లప్పుడూ ప్రతిష్ఠీకరించబడిన శక్తి క్షేత్రాలు చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. ప్రతిష్ఠీకరించడం అంటే ఏమిటో. ప్రతిష్ఠీకరించబడిన స్థలాల దగ్గరలో నివసించడంలోని ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి!
మన ప్రాచీన సంస్కృతి ఎల్లప్పుడూ బలీయమైన శక్తి క్షేత్రాలు లేదా అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాల చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. ఈ సంస్కృతిలో, జీవితంలోని ప్రతి అంశమూ కూడా ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఉన్నతికి తోడ్పడాలన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా అధ్యయనం చేయబడింది. ఆలయాలు లేదా ప్రతిష్ఠీకరించబడిన స్థలాలు ఈ ప్రాచీన సమాజాల యొక్క నివాస ప్రాంతాల మధ్యలో ఉండేవి. ఒక ప్రతిష్ఠీకరించబడిన స్థలంలో నివసించడం మానవ శ్రేయస్సుని పెంపొందించి, జీవితంలోని వివిధ విషయాల్లో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
మానవ శ్రేయస్సుని సృష్టించి, జీవితంలోని వివిధ అంశాలలో ప్రయోజనాలను పొందడానికి ప్రాణ శక్తులను ఉపయోగించే ప్రక్రియనే ప్రతిష్ఠీకరించడం అంటారు. అది భౌతిక పదార్ధాన్ని అత్యంత సూక్ష్మమైన ప్రకంపనగా శక్తివంతం చేసే ఒక ప్రక్రియ. అది ఒక రాయిని, ఒక ఖాళీ ప్రదేశాన్ని, చివరకి ఒకరి స్వంత శరీరాన్ని కూడా ఒక దివ్యమైన అవకాశంగా పరివర్తనం చేయగల ఒక విజ్ఞానం.
నేటి ప్రపంచంలో కూడా శక్తిపూరిత యంత్రాల ద్వారా మీరూ, మీ కుటుంబం ప్రతిష్టీకరించబడిన ప్రదేశంలో నివసించే అవకాశం ఇంకా ఉంది. ఆత్మజ్ఞానులూ, యోగులుా అనాది నుండి ప్రజలకు వారి తక్షణ, శాశ్వత శ్రేయస్సుల కోసమై ఈ యంత్రాలను తయారుచేసి అందిస్తూ వచ్చారు. అలాగే సద్గురు కూడా ప్రాచీన శాస్త్రమైన రసవైద్యంలో చెప్పిన విధంగా ఘనీభవించిన పాదరాసాన్ని ఉపయోగించి వివిధ లింగ భైరవి రూపాలను, ముఖ్యంగా వారి గృహాలలో లేదా పని లేదా వ్యాపార స్ధానాలలో ఉంచుకోవడానికి వీలుగా లింగభైరవి యంత్రాలను సృష్టించారు. ఇవి ఐశ్వర్యారోగ్యాలను కలిగించి, పెంపొందించిడమే కాకుండా, అన్ని ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందిస్తాయి.ఈ శక్తివంతమైన యంత్రాలను సొెంతం చేసుకొని, మీరు మీ జీవితంలో విజయాన్నీ, శ్రేయస్సునీ పొందాలని మా ప్రగాఢ ఆంకాక్ష.
"మీరు మట్టిని ఆహారంగా రూపాంతరం చెందిస్తే, మనము దానిని వ్యవసాయం అంటాము. మీరు ఆహారాన్ని మాంసమూ, ఎముకలుగా మారిస్తే దానిని జీర్ణక్రియ అంటాము. మీరు మాంసాన్ని మట్టిగా మారిస్తే దానిని దహనం అంటాము. మీరు ఈ మాంసాన్ని లేదా ఒక రాయిని లేదా ఒక ఖాళీ ప్రదేశాన్ని ఒక దివ్య అవకాశంగా మార్చుకుంటే, దానిని ప్రతిష్ఠీకరించడం అంటారు" - సద్గురు
లింగ భైరవి యంత్రం సంవత్సరానికి రెండు సార్లు పౌర్ణమి లేదా అమావాస్య రాత్రి యోగి, మర్మజ్ఞుడు ఐన సద్గురు సమక్షంలో ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరం డిసంబర్ 21న ఈ కార్యక్రమం జరుగుతుంది.వారి నుండి యంత్రాన్ని ప్రత్యక్షంగా అందుకునేటప్పుడు మీరు ఒక శక్తివంతమైన ప్రక్రియలోకి ఉపదేశింపబడుతారు.
లింగ భైరవి యంత్రం గురించి మరిన్ని వివరాలకు కింది మార్గాల ద్వారా సంప్రదించండి.
ఫోన్: +91 8300030555 Email: yantra@lingabhairavi.org