Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
క్రమశిక్షణ అంటే నియంత్రణ కాదు, సరిగ్గా ఏది అవసరమో అది చేయగల విచక్షణ కలిగి ఉండడం.
మీరు ఇతరులతో ఎంత అందంగా సంబంధాలు ఏర్పరచుకోగలరన్నది, కేవలం మీ ఇష్టం, సర్దుకుపోగల తత్వం, ఇంకా మీ ఆనందకరమైన స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
సమయం అంటే డబ్బు కాదు, సమయమే జీవితం.
ఈ మహాశివరాత్రి, రాత్రంతా మెలకువతో నిటారుగా ఉండి ప్రకృతి అందించే శక్తి తరంగాలని అందిపుచ్చుకోండి, ఆదియోగి అనుగ్రహానికి పాత్రులై, మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి.
స్త్రీ పురుష ప్రపంచంలో ఇమడటానికి ప్రయత్నించనవసరం లేదు. ప్రపంచంలో సగభాగం ఎలాగూ ఆమెదే.
జీవానికి ఓటమి అనేది తెలీదు, నిత్యం తమను తాము ఇతరులతో పోల్చుకునే వారికే ఓటమి అనేది ఉంటుంది.
ప్రపంచం మిమ్మల్ని వింతగా చూస్తున్నా పర్వాలేదు. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి దృష్టిలో వింతగానే కనిపిస్తారు. అయితే సంతోషంగా వింతగా ఉంటారా లేక దుఃఖంగా వింతగా ఉంటారా – అది మీ ఎంపిక.
భారతదేశం, ఓ సంస్కృతిగా, ప్రతిదాన్ని ఓ ఉత్సవంగా మార్చింది. జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందంగా జరుపుకునే ఈ స్ఫూర్తి, మానవాళికంతటికీ చేరాలని ఆకాంక్షిస్తున్నాను.
మీరు ఎంత లోతుగా శ్రద్ధ చూపిస్తారో, మీ అనుభవం అంత లోతుగా ఉంటుంది. మీ శ్రద్ధ గాఢమైనది అయితే, జీవితం పట్ల మీ అనుభవం కూడా గాఢమైనదిగా ఉంటుంది.
మీ వ్యక్తిత్వంలో మొండితనం ఎంత తక్కువగా ఉంటుందో, మీ ఉనికి అంత శక్తివంతంగా ఉంటుంది.
మీరు సుముఖంగా ఉంటే, మీ తర్కానికి అందని విధాల్లో నేను మీకు అందుబాటులో ఉంటాను.
మీరిక్కడ ఉన్నది జీవితాన్ని అనుభూతి చెందడానికా లేక దాని గురించి ఆలోచించడానికా?