జూలై 2023లో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో, సద్గురు మానవ శరీరానికి ఎంతో మేలు చేసే రకరకాల ఆహారాల గురించి లోతైన మరియు విలక్షణమైన అంతర్దృష్టిని అందించారు, అలాగే మనం ఏమి తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా ఎందుకు ముఖ్యమో వివరించారు. ఆయన మన ఆహార వ్యవస్థలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళను గురించి వివరించారు: అదుపులేని వాణిజ్యీకరణ మరియు ప్రపంచవ్యాప్తంగా నేల యొక్క వేగవంతమైన క్షీణత. అలాగే ఈ కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి ఆహార నియంత్రణ సంస్థలు ఎందుకు ముందుకు రావాలో కూడా ఆయన వివరించారు.