Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
జీవితంలో మీరు చేసే శ్రమ కష్టతరమైన పనిలా కాకుండా, ప్రేమ ఇంకా ఆనందాలతో కూడుకున్నది కావాలని ఆకాంక్షిస్తునన్నాను.
ఎవరినీ గొప్పగా చూడకండి - ఎవరినీ చిన్నచూపు చూడకండి. అందరినీ వారు ఎలా ఉన్నారో అలా చూస్తే, మీరు ఈ జీవనయానాన్ని ఫలప్రదంగా సాగించగలరు.
ఈ విశాల విశ్వంలో మీ స్థాయి ఏమిటో మీరు అర్థం చేసుకుంటే, మీరు సౌమ్యంగా జీవిస్తారు. మీరు స్పృశించే ప్రతిదీ ఓ దీవెన కానివ్వండి.
వైరాగ్యం అంటే నిమగ్నమవ్వకుండా ఉండడం కాదు. మీరు లోతుగా నిమగ్నమై ఉండి కూడా అందులో చిక్కుకుపోకుండా ఉండొచ్చు.
మరణాన్ని విస్మరించడం అనేది అన్నింటినీ మించిన అజ్ఞానం.
ప్రేమ, ఆనందం ఇంకా పారవశ్యంతో కూడిన కన్నీళ్లు మీ చెక్కిళ్ళను తడపకుంటే, మీరు ఇంకా జీవితాన్ని రుచి చూడలేదనే.
ధ్యానలింగం, దైవం యొక్క అత్యున్నత స్థాయి అభివ్యక్తీకరణ. దీని ఆవరణలోనికి వచ్చిన వారెవరైనా తమలో ముక్తి తాలూకు ఆధ్యాత్మిక బీజం నాటబడకుండా తప్పించుకోలేరు.
యోగ శాస్త్రం మీ జీవితాన్ని సృష్టించుకోవడానికి, అలాగే ఒక చైతన్యవంతమైన ప్రపంచాన్ని స్థాపించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది, తద్వారా ప్రతి వ్యక్తికీ ఇంకా భూమ్మీదున్న అన్ని జీవరాశులకు శ్రేయస్సు చేకూర్చుతుంది.
జీవితంలో సరైన నిర్ణయం అంటూ ఏదీ లేదు. మీరో నిర్ణయం తీసుకుని, దానికై మీ సర్వస్వాన్నీ ధారపోస్తే, అది అద్భుతంగా తయారవుతుంది.
ఉద్దేశం వేరు, అమలు చేయడం వేరు. మీ జీవితంలో మీరు అనుకున్నదాన్ని మీరు అమలులో పెడతారా, లేదా విషయాలు యాదృచ్చికంగా జరిగేలా చేసుకుంటారా, ఇదే పెద్ద ప్రశ్న.
ఈ ఉనికి అనేది ఒక సమగ్ర ప్రక్రియ. మీరేమీ ప్రత్యేక అస్తిత్వం కాదు.
మీ విధిని మీరే సృష్టించుకుంటారు. కాని మీరు దానిని ఎరుక లేకుండా సృష్టించుకున్నప్పుడు, అది మరేదో శక్తి నిర్ణయమనుకుంటారు.