Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మీ మానవత్వం పొంగి పొరలుతుంటే, దివ్యత్వం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
సత్యం దాక్కొని లేదు – మీరే దాని నుండి దాక్కొంటున్నారు.
మరణాన్ని విస్మరించడం అనేది అన్నింటినీ మించిన అజ్ఞానం.
ప్రేమ, ఆనందం ఇంకా పారవశ్యంతో కూడిన కన్నీళ్లు మీ చెక్కిళ్ళను తడపకుంటే, మీరు ఇంకా జీవితాన్ని రుచి చూడలేదనే.
ప్రత్యేకంగా ఉండాలనే కోరికతో, మిమ్మల్ని మీరు మిగతా సృష్టి నుండి వేరు చేసుకుంటున్నారు. ఆపై ఒంటరినై పోయానని ఫిర్యాదు చేస్తున్నారు.
మీ సంబంధం సజావుగా కొనసాగాలని మీకుంటే, అవతలి వ్యక్తి మీకన్నా మరింత ముఖ్యమని నిత్యం మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి.
జీవితంలో సరైన నిర్ణయం అంటూ ఏదీ లేదు. మీరో నిర్ణయం తీసుకుని, దానికై మీ సర్వస్వాన్నీ ధారపోస్తే, అది అద్భుతంగా తయారవుతుంది.
ఉద్దేశం వేరు, అమలు చేయడం వేరు. మీ జీవితంలో మీరు అనుకున్నదాన్ని మీరు అమలులో పెడతారా, లేదా విషయాలు యాదృచ్చికంగా జరిగేలా చేసుకుంటారా, ఇదే పెద్ద ప్రశ్న.
మీరు మీ జీవితానికి విలువనిస్తే, మరి మీరు ఆ జీవిత మూలాన్ని శోధించాలా వద్దా.
జీవితంలో మీరు చేసే శ్రమ కష్టతరమైన పనిలా కాకుండా, ప్రేమ ఇంకా ఆనందాలతో కూడుకున్నది కావాలని ఆకాంక్షిస్తునన్నాను.
ఎవరినీ గొప్పగా చూడకండి - ఎవరినీ చిన్నచూపు చూడకండి. అందరినీ వారు ఎలా ఉన్నారో అలా చూస్తే, మీరు ఈ జీవనయానాన్ని ఫలప్రదంగా సాగించగలరు.
ఈ విశాల విశ్వంలో మీ స్థాయి ఏమిటో మీరు అర్థం చేసుకుంటే, మీరు సౌమ్యంగా జీవిస్తారు. మీరు స్పృశించే ప్రతిదీ ఓ దీవెన కానివ్వండి.