Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
జీవితంలోని అనిశ్చితుల మీద నాట్యమాడగలిగినప్పుడే, మీరు ఉత్సాహభరితమైన జీవితాన్ని గడపగలుగుతారు.
మీరు గొప్ప అనుకుంటే, మీరు అల్పులు అవుతారు. మీరు ఏమీ కాదని మీరు గ్రహిస్తే, మీరు అపారమౌతారు. మానవునిగా ఉండడంలోని అందం అదే.
జీవితం అనేది చైతన్యం గురించి - కానీ ఆందోళనలు, నిర్బంధతలు, లేదా గొడవల గురించి కాదు. రాబోయే నెలలు మీకు మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేసి, ఆనందమయ జీవితానికి బాటలు వేయాలని ఆశిస్తున్నాను. ప్రేమాశీస్సులతో,
మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం, కానీ దాన్ని ఎరుకతో చేయండి. మనిషిగా ఉండటం అంటే అదే.
సద్గుణం అంటే నీతి నియమాలను పాటించడం కాదు. సకల జీవులను అక్కున చేర్చుకోవడమే అత్యున్నత సద్గుణం.
అద్భుతమైన వ్యక్తిని కలవాలని ఆకాంక్షించకండి. ఇతరులు ఎలా ఉంటే బావుండని మీరు కోరుకుంటారో అలాంటి అద్భుతమైన వ్యక్తి మీరే అవ్వాలని ఆకాంక్షించండి.
గతం, భవిష్యత్తు కేవలం మీ జ్ఞాపకాలలో, ఊహలలో మాత్రమే ఉంటాయి. మీరు అనుభూతి చెందేది మాత్రం ప్రస్తుతం ఉన్నదాన్నే.
ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే జీవితం నుంచి వేరుపడడం కాదు. అది జీవితంతో విడదీయరాని ప్రేమ వ్యవహారం.
ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారో దానితోనే సంతృప్తి పడిపోతే, మీరు కృషి చేస్తే మీరు ఏమి కాగలరో మీకు తెలియదన్నమాట.
జ్ఞానోదయం నిశ్శబ్దంగా జరుగుతుంది, పువ్వు వికసించినట్లుగా.
చతురత సామాజికంగానే విలువైనది. మేధస్సే ప్రకృతి తీరు.
మీరు మీ కుటుంబానికి, మీ పిల్లలకు, సమాజానికి, ఇంకా మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి చేయగలిగిన అత్యుత్తమైన పని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమే.