Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం అంటే భగవంతునికి చేరువ కావడానికి ప్రయత్నించడం కాదు - మీరు భగవంతునిలో ఐఖ్యం అయ్యేందుకు చూస్తున్నారని.
మీ జీవితంలో విలువైనదేదైనా కనుగొనాలంటే, మిమ్మల్ని మీరు కోల్పోవాలి.
మీరు విజయం అనుకునేదాని కన్నా, సాధారణంగా మీరు దేన్నైతే వైఫల్యంగా చూస్తారో అదే మీ జీవితానుభూతిని మరింత ప్రగాఢం చేస్తుంది.
బాహ్యం మీలో ప్రేరణ కలిగించొచ్చు, ఇంకా మార్గనిర్దేశనం చేయొచ్చు, కానీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది ఎప్పుడూ లోపలి నుంచి రావల్సిందే.
ఈ రోజు, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం కలగడానికి అవసరమైందల్లా దాన్ని మీ జీవితంలో మొదటి ప్రాధాన్యతగా చేసుకోవడమే అని గ్రహించిన రోజు.
మనసు అనేది మీరు పోగు చేసుకున్న గతమే. మీరు మనసును ఒకసారి దాటిపోతే, ఇక గతానికి మీపై పట్టు ఉండదు.
అధికారం అనేది స్వతహాగా అవినీతి కాదు. ఆధిపత్యం కోసం వెంపర్లాడేవారికి అధికారం వస్తే, అప్పుడు అది అవినీతికి కారకం అవుతుంది.
మీకు తెలియదని మీరు నిజంగా గ్రహించినప్పుడు, మీలో పక్షపాతం కానీ, తీర్మానాలు కానీ ఉండవు. మీరు కేవలం ఒక జీవిలా ఉంటారు.
సమస్య జీవితంతో కాదు. మీ మనసుని మీ ఆధీనంలోకి తీసుకోకపోవడమే సమస్య.
మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా, దానితో నిమిత్తం లేకుండా, మీ అంతరంగంలో మీరు ఆహ్లాదంగా ఉండగలిగితే, అప్పుడు మీకు ముక్తి లభించకపోవడం అన్నది ఉండదు.
మనకేమి ఎదురైనా, దానికి మనం ఎలా స్పందిస్తాము ఇంకా దాన్ని మనం ఎలా మలచుకుంటాము అన్నది నూటికి నూరు శాతం మనమీదే ఆధారపడి ఉంటుంది.
మీరెవరన్న అంతఃపార్శ్వాన్ని మీరు అందుబాటులోకి తెచ్చుకోవాలన్నదే నా అభిమతం, దానికే నా ఆశీస్సులు. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మీతోనే ఉంటుంది.