పర్వతాల మార్మికుడు
మనలాంటి వాళ్లమంతా అడవుల్లో పూర్తిగా దారి తప్పి పోయే ఈ కాలంలో, సద్గురు ఒక చిన్నపిల్లవాడిగానూ, ఇప్పుడు ఒక మార్మికుడుగానూ, ప్రకృతితో ఎప్పుడు సంవాదం జరుపుతూనే ఉన్నారు.
సద్గురు: చాలా చిన్నతనం నుంచి నా కళ్ళ(ఆలోచనలో)లో కొన్ని పర్వతాలు ఉండేవి. నాకు పదహారేళ్ళ వయసులో నా స్నేహితులతో దీని గురించి చర్చించాను, ‘వాళ్ళు నీకేమైనా పిచ్చి పట్టిందా? పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?’ అన్నారు. నాకు అప్పుడే అర్థమైంది, నాకు తప్ప వేరే ఎవరికీ, కళ్ళల్లో పర్వతాలు లేవని. కొంతకాలం పాటు ఆ పర్వతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఆ తరువాత ఆ ఆలోచనను విరమించుకున్నాను. మీ కళ్ళద్దాలు మీద ఏదైనా ఒక మరక ఉంటే, కొంతకాలం తర్వాత మీరు దానికి అలవాటు పడిపోతారు. ఇది కూడా అటువంటిదే. ఆ తర్వాత కాలంలో, నాలో జ్ఞాపకాల వెల్లువ తిరిగి వచ్చినప్పుడు, నేను ఈ ధ్యాన లింగం నెలకొల్పాలి అనుకున్నప్పుడు, నా కళ్ళలోని ఈ పర్వత శిఖరాలను కోసం వెతకటం మొదలు పెట్టాను.
నేను అనేక చోట్ల ప్రయాణం చేశాను. నేను నా మోటర్ సైకిల్ మీద కన్యాకుమారి నుంచి గోవా వరకు ముందుకు, వెనక్కి కనీసం నాలుగు సార్లు ప్రయాణం చేశాను. ఎందుకో అవి నాకు పశ్చిమ కనుమల్లోనే ఉన్నాయి అనిపించింది. ఉత్తర కర్ణాటకలోని కార్వార్ నుంచి కర్ణాటకలోని కేరళ సరిహద్దుల దాకా బహుశా నేను వేలాది కిలోమీటర్లు తిరిగి ఉంటాను.
అప్పుడు ఏదో ఒక ఛాన్స్ గా కోయంబత్తూరు పరిసరాల్లోని ఒక గ్రామానికి వచ్చాను. నేను ఒక ఒంపు తీసుకుని మోటార్ సైకిల్ మీద వెళుతున్నప్పుడు వెల్లంగిరి పర్వతాల్లోని ‘సెవెంత్ హిల్’ చూశాను. అదే పర్వతం నా కళ్ళల్లో చిన్నప్పటినుంచి కనబడుతున్నది. ఆ పర్వతాన్ని అలా చూసిన మరుక్షణం నా కళ్ళలోని పర్వతం అదృశ్యం అయింది.
మీరు నన్ను ఈ ప్రపంచంలో అతి గొప్ప పర్వతం ఏది అని అడిగితే, నేను ఖచ్చితంగా వెల్లంగిరి పర్వతాలే అంటాను. ఎందుకంటే అవి నాకు కేవలం పర్వతాలే కాదు. నేను ఈ నా కళ్ళల్లో ఈ పర్వతాలు గుర్తుతో పుట్టాను. అప్పటి నుంచి అవి నన్ను వెంబడిస్తూ, నాతోనే ఒక జిపియస్ సిస్టంగా బతికాయి. అవి నన్ను నడిపించాయి. ఈ పర్వతాలు నాకు ఏదో రాళ్లగుట్ట కాదు, నేను ధ్యానలింగ నెలకొల్పటానికి కావలసిన జ్ఞాన భాండాగారాలు.