“మనం మనకు అందింపబడ్డ ఆధ్యాత్మిక సంపదకు, ఆధ్యాత్మిక బాటలో జీవనం సాగించిన ఋషులు, జ్ఞానులు, గురువులు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులకు మాత్రమే కాక వారికి పోషణనిచ్చి సహాయపడిన సమాజానికి కూడా ఎంతో ఋణపడి ఉంటాము. మన సంస్కృతిలో ఆధ్యాత్మిక సాధకులను, సన్యాసులను సేవించటం చాలా గొప్పగా భావిస్తారు. నిజానికి, ఎంతోమందికి ఇలా సేవలో తరించటమే వారు ఎంచుకున్న ఆధ్యాత్మికత బాట. ఇలా సేవించటంలో అత్యంత అధ్బుతమైన మార్గం అన్నదానం, ఆహార సమర్పణ.”- సద్గురు