Sadhguruఅసలు రంగు అంటే ఏమిటి? ఏ వస్తువుకైనా రంగు అది ఏమిటి అనేదాని నుంచి రాదు, అది దేన్ని తిరస్కరిస్తుందో, దేన్ని తిరిగి ఇచ్చేస్తుందో, ప్రతిబింబిస్తుందో అదే అవుతుంది. ఏదైనా ఎరుపుగా ఎందుకు కనిపిస్తుందంటే అది తెల్లని ప్రకశం నుంచి అన్నిటినీ ఉంచుకుని కేవలం ఎరుపును మాత్రమే ప్రతిబింబిస్తోంది. ఎరుపు అంటే అది ఎర్రగా ఉందని కాదు. ఎరుపు అంటే అది ఎరుపు కానిదని అర్ధం! ఈ ప్రపంచంలో కూడా మీరు దేన్ని ప్రతిబింబిస్తే అదే మీ గుణం అవుతుంది. దేవి ఎరుపుని ప్రతిబింబిస్తోంది కనుక ఆమె రంగు ఎరుపు.

మీరు ఒక అడివిలో నడుస్తూ ఉంటే అంతా పచ్చగా ఉంటుంది కానీ ఎక్కడో ఒక చుక్క ఎరుపు ఉంటుంది – ఎక్కడో ఒక ఎర్రటి పువ్వు పూస్తుంది – అది మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే మీ అవగాహనలో ఎరుపు అన్నిటికంటే ఆకట్టుకునేదిగా ఉంటుంది. మిగతా రంగులు అన్నీ కూడా అందంగానే ఉండచ్చు కానీ ఎరుపు ఎక్కువ ఆకట్టుకుంటుంది.

ఏది ఉత్తెజభరితంగా ఉన్నా అది ఎరుపనే అర్ధం.

మీకు ముఖ్యమైనవాటిలో చాలా వరకు ఎర్రగానే ఉంటాయి. మీ రక్తం ఎర్రగా ఉంటుంది. ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉంటాడు. మానవ చేతనంలో మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు అనేది రంగుల వల్ల ఎక్కువ ప్రభావితం అవుతుంది, దానిలో ఎరుపు ఎక్కువ ఉత్తెజభరితంగా ఉంటుంది. దేవి ఆ ఉత్తెజానికి సంకేతం. ఆమె శక్తి పరిపూర్ణంగా ఉత్తెజభరితమైనది, అతిశయమైనది. ఏది ఉత్తెజభరితంగా ఉన్నా అది ఎరుపనే అర్ధం. మీరు “పెయింటింగ్ ధ టౌన్ రెడ్!” అని అనటం వినే ఉంటారు. మీరు సృష్టించే దేవుళ్ళు అందరిలో స్త్రీ రూపాలు ఎక్కువ అతిశయమైనవి ఉంటాయి. అందువల్లే దేవి రంగు ఎరుపు – ఆమె ఎర్రగా ఉండటం వల్ల కాదు, ఆమె ఎరుపు కాకపోవటం వల్లే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

Photo Courtesy: Shivani Agarwal