నిన్నలో కూరుకుపోకండి, ఈరోజుని అద్భుతంగా మార్చుకోండి..!!
మీరు మీ పాత రోజులని తలుచుకుంటూ పగటి కళలు కంటుంటారా?? మనం ఇక్కడ ఎల్ల కాలం ఉండిపోము. సద్గురు మనకు ఏమని గుర్తు చేస్తున్నారంటే, నిన్న కంటే కూడా ఈరోజూనే ఉత్తమమైన రోజుగా చేసుకోవాలి అని.
ప్రశ్న: సద్గురు, నేను క్రొత్త ప్రాంతానికి మారినప్పుడల్లా క్రొత్త వ్యక్తులతో కలసి పోవడం కష్టంగా ఉంటుంది. గతం గురించి అప్పుడు నేను కలసి ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను ఎమి చెయ్యాలి?
సద్గురు: కొంతమంది భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు, గతం గురించి కొంతమంది ఆలోచిస్తున్నారు, ఎవరూ ఇక్కడ లేరన్న మాట! మీరు వయసైన వారితో మాట్లాడితే - వారు, "ఓహ్, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు ...” ఇలాంటివి మీరు విన్నారా? కాని వారు స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు, వారు కూడా మీలాగానే సణుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు వారు తమ జీవితాలను ఇంత దిగాలుగా తయారు చేసుకున్నాక, తిరిగి చూసుకుంటే - వెంటనే వారికి స్కూల్ జీవితం ఎంతో అద్భుతంగా ఉండేదనిపిస్తుంది. మీరు ఎప్పుడూ గతంలోనే జీవితం బావుండేదనుకుంటే, ఇప్పుడు సరిగ్గా లేరని అర్ధం. “నిన్న” అనేది ఎప్పుడూ ఉత్తమమైన రోజు కాకూడదు. మీ జీవితంలో ఈ రోజే ఉత్తమమైన రోజుగా ఉండాలి. ఎందుకంటే, మీకు మరో రోజు అనుభవం ఉంది కదా..! కాబట్టి, మీరు మీ జీవితంలో ఉత్తమమైన రోజుగా ఈ రోజునే చేసుకోవాలి? మీ జీవితం ఎలా ఉండాలంటే, ఈ రోజే ఉత్తమమైన రోజుగా ఉండాలి.