ప్రశ్న: వస్తువులని శక్తివంతం చెయ్యటం, ఒకచోట ప్రతిష్ఠ చెయ్యటం ఎలాగో దయచేసి మాకు చెబుతారా?. మీకు ఈ శక్తి పుట్టుకతోనే ఉందా లేక ఇది మీరు కాలక్రమంలో నేర్చుకున్న విద్యా?. ఈ విద్య నేను కూడా నేర్చుకోగలనా సద్గురు?

సద్గురు: మా కార్యక్రమాల ద్వారా మేము మీకు ఒక పద్ధతి ద్వారా మిమ్మల్ని మీరు సరిగ్గా ప్రతిష్ఠ చేసుకోవటం నేర్పుతున్నాం. ముందు మిమ్మల్ని మీరు పవిత్ర పరుచుకుని ప్రతిష్ఠ చేసుకోకపోతే, మీకు వేరే దేన్నైనా ప్రతిష్టిoచటం ఎలా సాధ్యపడుతుంది?. మీరు జీవితంలో ఏం చెయ్యాలనుకున్నా సరే, మీరు కానిది ఏదీ మీరు చెయ్యలేరు. మీరు అలా నటించవచ్చు, కానీ అది కుదరనిపని. మీరు ఒక లక్షణాన్ని ఎవరికైనా లేదా దేనికైనా పంచాలనుకున్నప్పుడు, ముందు ఆ స్వభావం మీలో ఉండాలి. మీలో జరగనిది ఏదీ, ఈ ప్రపంచంలో జరిగేలా మీరు చెయ్యలేరు. సాధన చేసేవారు కలత చెందినప్పుడు మాత్రం సాధన నించి కొంత విరమించుకోవాలని, ఆ కలత ప్రపంచానికి పాకించ కూడదనీ, చెప్పే సంస్కృతి మనది.

ముందుగా, మీరు ప్రతిష్ఠ కావాలని నేను అనుకుంటున్నాను. ఒక విధంగా చూస్తే, ఒక స్థళాన్నో లేక ఒక రూపాన్నో ప్రతిష్ఠ చెయ్యటం అంత సరైన విషయం కాదు. దానికంటే, మనుషులని పవిత్ర పరచి ప్రతిష్ఠ చెయ్యటమే సులువు. మనుషులు ప్రతి కొద్ది నిమిషాలకీ వాళ్ళ ప్రాధాన్యతలు మార్చుకోకపోతే గనుక అదే అత్యంత సులువైన విషయం అని చెప్పాలి. నిరంతరం వెళ్ళే దారులని నచ్చిన మలుపులు తిప్పే వాళ్ళకి ఎలాగో ఎటూ వెళ్ళే ఉద్దేశం ఉండదు. కానీ మీరు ఇవాళ ఇక్కడ ఈ ఈశా యోగా సెంటర్ లో ఉన్నారు కాబట్టీ, మీకు తెలియకుండానే, ఆ ఆదియోగి(ఆదియోగి ఆలయం లోని లింగాన్ని చూపిస్తూ) మీలో ఇక్కడ ఇమిడిఉంటాడు. ఇవాళ మీరు ఒక చోట ప్రతిష్ఠ చెయ్యటం గురించి అడిగారు. మీరు ఇదే ఉద్దేశాన్ని ఎంతకాలం కలిగి ఉంటారో చూద్దాం. మీరు ఏదైనా ప్రతిష్ఠ చెయ్యాలనుకుంటే, ముందుగా మీరే ఒక ఆలయంగా మారాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు