యోగా చేసేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి?
సాధన సమయంలో సరైన దుస్తులను ధరించడంలోని ప్రాముఖ్యతను, ఇంకా ఆ సమయంలో, శరీరంపై లోహపు వస్తువులు ఎందుకు ధరించకూడదు అన్న విషయాలను సద్గురు వివరిస్తున్నారు.
సద్గురు:: నేను చిన్నపిల్లాడిగా హఠ యోగా చేసినప్పుడు, మేము ధరించడానికి అనుమతించబడిన ఒకే ఒక్క వస్త్రం ఏమిటంటే, ఒక చిన్న లంగోటి / గోచి. వీలైనంత తక్కువ అడ్డంకులు ఉండాలి అన్నదే ఇక్కడ ఆలోచన. భారతదేశంలో సాంప్రదాయ పరంగా ప్రజలు, కుట్టిన దుస్తులను ధరించేవారు కాదు. పురుషుల ధోతీలూ ఇంకా మహిళల చీరలు, రెండూ కూడా కుట్టబడని వస్త్రాలే. దుస్తులను కుట్టినప్పుడు, కొంతవరకూ శక్తి చలనం పరిమితం చేయబడుతుంది-సాధన చేసేటప్పుడు మీరు ఆ పరిమితిని తగ్గించాలి అని చూస్తారు. దీనర్ధం మీరు లంగోటి / గోచి ధరించడం మొదలు పెట్టాలి అని కాదు కానీ, యోగా అభ్యాసకులు, క్రీడాకారులు ధరించేటటువంటి సింథటిక్ దుస్తులను ధరించకూడదు. మీ దుస్తులు సేంద్రీయమైనవి అయితే అది చాలా మంచిది - కాటన్ లేదా ముడి పట్టు దుస్తులు ధరించడం మంచిది. సేంద్రీయ ముడి పట్టు చాలా ఖరీదైనది కనుక, అలాగే అది దొరకడం కుడా కష్టం కనుక, సేంద్రీయ కాటన్ దుస్తులు ఉత్తమమైన ఎంపిక. ఊలు కూడా మంచిదే.
మీ సాధనను ప్రారంభించే ముందు, మీరు మీ శరీరం నుండి అన్ని వస్తువులను, ముఖ్యంగా లోహపు వస్తువులను తొలగించాలి. మీరు విద్యుదయస్కాంత తరంగాల చిత్రాన్ని తీస్తే, ఒక చిన్న వస్తువు కూడా తన చుట్టూ ఒక నిర్దిష్ట ప్రసరణను సృష్టిస్తుంది. మీరు మీ శరీరంపైన ఏదైనా వస్తువును ఉంచితే, అది శక్తి యొక్క స్వేచ్ఛా చలనానికి భంగం కలిగిస్తుంది. చెవి పోగులు పెట్టుకునే చోటులాగా, శరీరంలో నిద్రాణమైన కొన్ని భాగాలలో తప్ప, ఎలాంటి లోహం అయినా సరే, దాన్ని తొలగించాలి - ముక్కు పుడకతో సహా. మీ రుద్రాక్ష ఇంకా స్నేక్ రింగ్(ఈశాలో లభించే పాము ఆకారంలో ఉన్న ఉంగరం)ను మాత్రం, మీరు ఉంచుకోవచ్చు. రుద్రాక్ష మీ సొంత శక్తి వలయాన్ని సృష్టించి, మిమ్మల్ని అనుగ్రహానికి పాత్రులు అయ్యేలా చేయడంలో మద్దతు ఇస్తుంది. స్నేక్ రింగ్ ఎందుకంటే, మీరు కొన్ని సాధనలు చేసేటప్పుడు, లక్షలో ఒక్కసారి జరిగే, అనుకోకుండా మీరు శరీరాన్ని వదిలి పెట్టేసే సంభావ్యతని, స్నేక్ రింగ్ నివారిస్తుంది. మహిళలు, మీరు మీ వెన్నెముకపై ఎలాంటి లోహపు క్లిప్పులను ఉపయోగిస్తున్నా, వాటిని తీసివేయాలి. శక్తి పరంగా, లోహం కంటే ప్లాస్టిక్ మంచిది..
ప్రాక్టీస్ లు చేసేటప్పుడు, మీరు మీ కళ్ళజోళ్ళను కూడా తొలగించాలి. సరైన యోగ సాధన ద్వారా, చాలా మంది తమ అద్దాలను వదిలించుకున్నారు. మీ దృష్టి దానంతట అది సరిపడాలంటే, మీరు కొంతకాలం అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు వాడకుండా ఉండాలి. మీరు అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు లేకుండా ఉండగలిగితే, అలా చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు తలనొప్పి వస్తే, కళ్ళు మూసుకుని ఎక్కువ సమయం గడపండి. మీరు కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తున్నట్లయితే, కనీసం మీ ఉదయం సాధన, వాటిని వాడకుండా చేయండి. ఆ విధంగా చేస్తే, తేలికపాటి దృష్టి సమస్యలు కొంత కాలానికి మెరుగుపడవచ్చు..
ప్రేమాశీస్సులతో,
సద్గురు
Editor’s Note: Isha Hatha Yoga programs are an extensive exploration of classical hatha yoga, which revive various dimensions of this ancient science that are largely absent in the world today. These programs offer an unparalleled opportunity to explore Upa-yoga, Angamardana, Surya Kriya, Surya Shakti, Yogasanas and Bhuta Shuddhi, among other potent yogic practices.