సేలంలో దేవి ఆవిర్భవించింది ...!!!!
సేలంలో లింగభైరవి జనవరి 4, 2015న ఆవిర్భవించింది. ప్రాణప్రతిష్టఅనే అద్భుతాన్ని చూడటానికి సుమారు 4,000 మంది భక్తులు విచ్చేశారు. సేలం ఇప్పుడు ఈ బ్రహ్మాండమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికీ, దేవిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను స్వీకరించడానికీ సంసిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా, ఈ వారపు సద్గురు లేఖలో(స్పాట్లో) సద్గురు భక్తి గురించి, అలాగే దేవి మహిమ గురించి వివరించారు.
సేలంలో లింగభైరవి జనవరి 4, 2015న ఆవిర్భవించింది. ప్రాణప్రతిష్టఅనే అద్భుతాన్ని చూడటానికి సుమారు 4,000 మంది భక్తులు విచ్చేశారు. సేలం ఇప్పుడు ఈ బ్రహ్మాండమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికీ, దేవిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను తీసుకోవడానికీ సంసిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా, ఈ వారపు సద్గురు లేఖలో(స్పాట్లో) సద్గురు భక్తి గురించి, అలాగే దేవి మహిమ గురించి వివరించారు.
దేవిని దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు – మీ మనుగడ నుంచి మీ కుటుంబం, కార్యాకలాపాల వరకు. వీటన్నిటినీ మించి, భక్తితో మనలో ఒక ఆహ్లాదకరమైన స్థితిని ఏర్పరుచుకోవచ్చు. మనల్ని మనం ఒక మధురమైన, ఆహ్లాదకరమైన స్థితిలో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అందుకు దేవి ఒక అద్భుతమైన సాధనం, ఆమె పేరు తలచుకుంటే చాలు, మనలో ఒక ఆహ్లాదకరమైన స్థితి ఏర్పడుతుంది. ఆమె మనల్ని ముక్తి వరకు కూడా తీసుకువెళ్లగలిగే అవకాశం ఉంది.
మీరు ఈ ప్రబల శక్తిరూపాన్ని కనుక అమితంగా ప్రేమిస్తే మీ జీవితంలో కొంత కమ్మదనం ఉంటుంది. మీకు ఏమి జరిగినా సరే, ఈ భక్తిభావం మీలో ఎల్లపుడూ ఆహ్లాదాన్నే సృష్టిస్తుంది. మీరు ధ్యాసపెట్టి కొద్ది నిముషాలు ఒక పాఠ్య పుస్తకం చదవాలి అనుకుంటే, మీ మనస్సు ఎక్కడెక్కడో విహరిస్తుంది. కానీ మీరు మీ పొరిగింటి వారితో ప్రేమలో పడితే మీ మనస్సు ఎప్పుడూ అక్కడే ఉంటుంది – అది కూడా ఎటువంటి ప్రయత్నం లేకుండానే. భక్తీ అనేది అలాంటిదే. భక్తి అంటే అప్రయత్నంగా మీరు ఒక ప్రబల శక్తిరూపంతో గాఢంగా ప్రేమలో పడడం. అప్పుడు మీరు కేవలం ఒక మనిషిగా కాదు, ఒక దివ్యపురుషునిగా జీవిస్తారు.
ఆమె ఉద్భవించింది. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటే మీకంటే, నాకంటే కూడా చాలా ఎక్కువ కాలం సజీవంగా ఉంటుంది. ఒక వెయ్యి సంవత్సరాలకు పైనే జీవిస్తుంది. ఇది కేవలం మీకే కాదు, వచ్చే తరాల వారికి కూడా ఒక గొప్ప వరంగా మారుతుంది.