Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
విశ్వం మొత్తాన్నీ పరిగణలోకి తీసుకుని చూస్తే, మీ ఆలోచనలు బొత్తిగా అర్థవిహీనమైనవి. మీరది గ్రహిస్తే, సహజంగానే మీరు మీ ఆలోచనా ప్రక్రియ నుండి దూరంగా జరుగుతారు.
మీరు ఉత్సాహంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటే, మీ వ్యాధినిరోధక శక్తి మీరు చింతిస్తున్నప్పటికన్నా బాగా పని చేస్తుంది. జీవిత సంపూర్ణత్వమే ఆరోగ్యం.
మరీ ముఖ్యంగా మీ జీవితంలో అప్రియమైన సంఘటనలు జరిగి ఉంటే, మీరు వివేకవంతులుగా అవ్వాలి, గాయపడిన వారిగా కాదు.
తెలివిగల వ్యక్తికి తానొక మూర్ఖుడనని తెలుసు, కానీ మూర్ఖుడికి తను మూర్ఖుడనని తెలియదు.
ప్రేమ ఓ లావాదేవీ కాదు, అది మీలో చెలరేగే అగ్ని. అది మీ మూలాన్ని దహించినప్పుడు, ముక్తిదాయకం అవుతుంది.
సమగ్రత అనేది చర్య గురించి కాదు, దాని వెనుకున్న ఉద్దేశ్యం గురించి. మీరు చేస్తున్నది అందరి మేలు కోసం చేస్తున్నారా లేక మీ వ్యక్తిగత ప్రయోజనం కోసం చేస్తున్నారా అన్నదే ప్రశ్న.
ఈ మనసుని శ్రేయస్సుని సృష్టించుకోటానికైనా ఉపయోగించుకోవచ్చు లేదా బాధని సృష్టించుకోటానికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ఎంపిక ప్రతి ఒక్కరికి ఉంది.
మనిషి చైతన్యవంతుడైతే అప్పుడిక ఆధిపత్యం, సంఘర్షణల అవసరం సమసి పోతుంది.
మీ బుర్రలో మీరు తయారు చేసుకునే చెత్తపై కన్నా సృష్టికర్త చేసిన సృష్టి పట్ల శ్రద్ధ పెట్టడమే ముఖ్యం.
మార్మికత అంటే అద్భుతాలు ప్రదర్శించడం కాదు. అది పంచేంద్రియాలకు గోచరించని, జీవం తాలూకు అద్భుత అంశాలని లోతుగా అన్వేషించడం.
జీవితాన్ని ఒక అవకాశంగా చూస్తుంటే, మీకు ప్రతిచోటా అవకాశాలు కనిపిస్తాయి. జీవితాన్ని ఒక సమస్యగా చూస్తుంటే, ప్రతిచోటా సమస్యలే కనిపిస్తాయి.
సృష్టి మూలమే మీలో ఉన్నది కాబట్టి, పరిష్కారాలన్నీ కూడా మీలోనే ఉంటాయి.