మహాభారతంలో కర్ణుడు – నాయకుడా, ప్రతి నాయకుడా? Mahabharatham lo Karnudu
ఉదాత్తత, కుటిలత చూపుతూ, మహాభారతంలో కర్ణుడు చాలా ప్రాచుర్యం గలవాడు, అంతే కాక ఆయనది అతి సంక్లిష్టమైన పాత్రలలో ఒకటి. Know about Karnudu more in this blog.
ఈ వ్యాసంలో సద్గురు ఆయన పగకు కల కారణాలపై దృష్టి పెడుతున్నారు.
సద్గురు:: భారతదేశంలో, మహా భారతం తెలిసిన వారిలో కర్ణుడు ఒక ప్రతి నాయకుడే అనే ఉద్దేశంగల, ఒక సంప్రదాయం ఉంది. ఆతడొక కుళ్ళిన మామిడి పండు. పగకు పట్టం కట్టి, పాతాళానికి చేరిన, ఏంతో అద్భుతమైన వ్యక్తి ఆతడు. అతని పగ, ఆయన్ని ఒక దౌర్భాగ్య స్థితికి తీసుకువెళ్ళింది. ఆయన ఎంతో చిత్తశుద్ధి, దాతృత్వాలుగల వ్యక్తి. కానీ ఇవన్నీ వ్యర్థమయ్యాయి. యుద్ధంలో అతి ఘోరంగా చనిపోయాడు.
"నిమ్న జాతి" రాజు
తాను ఎవరి బిడ్డో అనేది తెలియక, బాధతో ఆయన చాలా ఉక్రోషంగా ఉండేవాడు. కానీ అతన్ని పెంచిన వారు, ఎంతో ప్రేమతో పెంచారు. ఆయన పెంపుడు తల్లి తండ్రులు రాధ, అతిరథులు, వారు అతనని ఎంతో ప్రేమతో పెంచారు. అంతేకాదు, చేతనైనంతలో చాల గొప్పగా పెంచారు. తన తల్లి తనని ఎంతగా ప్రేమించేదో ఆయన మాటి మాటికీ గుర్తుచేసుకొనే వాడు. "నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే వ్యక్తి ఆమె" అని అంటూండేవాడు. తన సామర్థ్యంతోనూ, విధి వశాత్తునా, ఆయన అంగరాజు అయ్యాడు. ఆయనికి ఒక వెద్ద పదవి, రాజభవనంలో స్థానం కూడా కల్పించారు. అనేక విధాలుగా ఆయన మహారాజుకు కుడిభుజం లాంటివాడు. దుర్యోధనుడు ఆయన్ని ఆప్తుడిగా భావించి, సలహాలు తీసుకునేవాడు. జీవితం అందించే అన్ని భోగాలూ ఆయనకు ఉన్నాయి. ఆయన జీవితాన్ని చూస్తే, ఒక రథికుని కుమారుడు రాజయ్యాడు అన్నది సత్యం. నిజానికి ఆయన ఎంతో సంతోషంగా ఉండాలి. నీళ్ల మీద తేల్తూ వచ్చిన బిడ్డ, ఒక మహారాజుగా ఎదిగాడు. ఇది ఎంతో అద్భుతమైన విషయం కాదా? కాని, ఆయన తన బాధను వదిలి వేయలేదు. ఆయన ఎప్పుడూ అసంతృప్తితోనూ, బాధతోనూ ఉండేవాడు, ఎందుకంటే ఆయనపై వేసిన ముద్రను, ఆయన తట్టుకోలేక పోయాడు. గొప్పవాడు కావాలన్న ఆయన అత్యాస వల్ల, ఎక్కడికి వెళ్లినా ఆయన్ని ప్రజలు సూతుడు లేదా "తక్కువ జాతి" వాడు అనే సంభోదించేవారు. ఆయన జీవితమంతా దీనితోనే బాధ పడేవాడు.
ఈ పగ, మహాభారతంలో అద్భుతమైన ఈ వ్యక్తిని నీచమైన, వికృతమైన పాత్రగా తయారు చేసింది. ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి, ఆయన తన ఔన్నత్యాన్ని ఆయన అనేక సమయాల్లో చూపించాడు. కానీ పగ వలన, ఎన్నో విధాలుగా ఆయనే అంతా తారుమారు చేసాడు. శకుని ఏమి చెప్పాడు, ఏమి చేసాడు అన్నది దుర్యోధనునికి పట్టదు. కర్ణుడి సలహానే చివరికి నిర్ణయించేది. అంతా చర్చించిన తర్వాత దుర్యోధనుడు "ఏమి చేద్దాం?" అన్నట్లు కర్ణుని వైపు చూసేవాడు. పూర్తి కథను కర్ణుడు సునాయాసంగా దిశ మార్చ గలిగేవాడు.
విషాదము -త్యాగము
ఆయన జీవితంలో విషాదము, త్యాగాలు, ఒకటి తరువాత ఒకటిగా నడిచాయి. ఆయన నిరంతరం తన దాతృత్వ బుద్ధిని ప్రదర్శించేవారు. కానీ దాని వల్ల ఏమీ ఫలితం లేదు. ఎందుకంటే తాను కానిది, చివరికి సమాజంలోనయినా తాను అవ్వాలని ఆయన కోరుకున్నది, ఆయన నాశనమయ్యాడు. ఆయన వాస్తవానికి అదేనేమో, కానీ సమాజం విషయానికి వస్తే, ఆయన తాను కానిది, తానుగా ఉండాలనుకున్నాడు. ఈ మానసిక స్థితి వలనే, ఆయన నిరంతరం పెద్ద పెద్ద తప్పిదాలు చేసేవాడు. ఆయన చాల బుద్ధి శాలి. దుర్యోధనుడు చేసేవి తప్పులనే గ్రహింపు ఆయనకుంది. కానీ ఆయన కేవలం చూస్తూ ఉండడమే కాకుండా, అనేక సార్లు దుర్యోధనుణ్ణి చెడ్డ పనులకు ఉరికొల్పేవాడు. తన విశ్వాసం, కృతజ్ఞతల కంటే, మేధస్సును ఉపయోగించినట్లయితే కర్ణుడు దుర్యోధనుడి ప్రాణాన్ని రక్షించగల్గే వాడు. తన మేధస్సును ఉపయోగించకుండా, తప్పులపై తప్పులు చేసుకుంటూ పోయాడు.
జీవితమంతా తప్పు దోవే
కృష్ణుడు శాంతి కోసం వచ్చినప్పుడు, కర్ణునితో "నీకు నీవు ఇలా ఎందుకు చేసుకుంటున్నావు. యదార్థం ఇది కాదు. మీ తల్లి తండ్రుల గురించి తెలుసుకో, కుంతీదేవి నీ తల్లి, సూర్యుడు నీ తండ్రి" అని చెప్పాడు. కర్ణుడు తట్టుకోలేక, ఒక్కసారిగా విలపించాడు. తానెవరు, ఎక్కడినుండి వచ్చాను అని తెలుసుకోవాలనే తపన ఉండేది. ఆ చిన్న పెట్టెలో పెట్టి, తన్ను విడిచి పెట్టింది ఎవరు అన్నది తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకునే వాడు. తనకు సహజంగా లేనప్పటికీ, అయిదుగురు పాండవుల పట్ల తాను ద్వేషం పెంచుకోవడానికి చురుగ్గా యత్నిస్తున్నట్లు, అప్పుడు ఒక్కసారిగా ఆయన గ్రహించాడు. దుర్యోధనుని పట్ల కృతజ్ఞత భావంవల్ల, ఈ అయిదుగురినీ ద్వేషించాలని ఆయనకు ఎక్కడో ఉండేది. తన హృదయంలో ద్వేష భావం లేనప్పటికీ, నిరంతరం కృషి చేసి, ఆయన అందరి కంటే చెడ్డవాడు అయ్యాడు. శకుని ఒక నీచమైన సలహా ఇస్తే, అంతకన్నా నీచమైంది తాను చెప్పేవాడు. ఇంతేకాక, అక్కడితో ఆగేవాడు కాడు, ఎందుకంటే దుర్యోధనుడు తనకు చేసిన దాని పట్ల కృతజ్ఞత, విశ్వాసాలను నిరూపించడానికి ప్రయత్నిస్తూ తాను ద్వేష భావాన్ని పెంచుకునేవాడు. తాను చేస్తున్నది తప్పని తన అంతరంగంలో తెలుసు, కానీ, తన విశ్వాసపాత్రత బలీయమైనందున ఆయన అలా చేస్తూ పోయాడు. ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి కానీ, నిరంతరం తప్పులు చేసే వాడు. మనందరి జీవితాలు అంతే - మనం ఒక తప్పు చేస్తే, దాన్నుండి కోలుకోవడానికి పది సంవత్సరాలు పడుతుంది, అవునా, కాదా? ఆయన ఎప్పుడూ కోలుకోలేదు, ఎందుకంటే ఆయన ఎన్నో తప్పుడు దారులకు తిరిగాడు.
కర్ణుడు మంచివాడా, చెడ్డవాడా?
Karna meets his end from Arjuna's arrow.
ఎవరు మంచి, ఎవరు చెడ్డ, అని అస్తిత్వం తీర్మానించదు. సామజిక పరిస్థితులే మనుషులను మంచి, చెడ్డ అని తీర్మానిస్తాయి. మనుషులే, మిమ్మల్ని మంచిగా, చెడ్డగా నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచిది, ఇంకొకటి మంచిది కాదు అని ఎక్కడ రాయలేదు కనక, అస్తిత్వం తీర్మానించదు. మీరు మంచి పనులు చేసినట్లయితే మంచి ఫలితాలే వస్తాయి. అంతే. మీరు మంచి పనులు చేయక పొతే, మీకు మంచి జరుగదు. అదే న్యాయం అని నేనంటాను. కర్ణుని అభిమానులు, ఆయన అన్ని కష్టాలు పడడం, అన్యాయమని అనుకుంటారు. అది ఖచ్చితంగా న్యాయం అని నేనంటాను. సమాజం న్యాయంగా ఉండకపోవచ్చు, కానీ అస్తిత్వం పూర్తిగా న్యాయ బద్ధమైనది. మీరు సరైన పనులు చేయకపొతే మీకు సరైనవి జరగవు. అస్తిత్వం ఇలా ఉండక పొతే, సరైన పనులు చేసే వారికీ, మానవ మేధస్సుకు విలువే ఉండదు. మనం తప్పుడు పనులు చేసినా, మనకు మంచే జరిగితే, జీవితంలోని ఏ విలువలకూ, విలువ లేదు. జీవితం ఆలా జరగదు.
Editor’s Note: Watch the Leela series, for more of Sadhguru’s talks on Krishna.