Sadhguruమహాభారత సిరీస్  లోని ద్వితీయ భాగంలో మహాభారత ఇతిహాసం లోతుల్లోకి వెళ్ళే ముందు సరైన  పూర్వాపర సంబంధం ఏర్పరచేందుకు సద్గురు, కాలగతిలో మానవ వ్యవస్థ,  గ్రహాలు, సౌర వ్యవస్థ మధ్య ఉన్న ప్రగాఢ సంబంధం గురించి శోధించి, వివరిస్తున్నారు.

 

సద్గురు: యోగా వివరించిన ఖగోళ శాస్త్రంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగే మండలాన్ని 27 విభాగాలుగా విభజించారు. ఈ 27 విభాగాలు 27 నక్షత్రాలకు చెందినవి. ఒక్కొక్క నక్షత్రాన్ని తిరిగి నాలుగు సమాన పాదాలుగా విభజించారు. 4ని 27తో గుణిస్తే 108. ఈ 108,అంతరిక్షంలో భూమి తీసుకునే 108 దశలకు ప్రతీక. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో సగ భాగానికి ఒక్కొక్క నక్షత్రం అనువర్తిస్తుంది. మానవ శరీరంలోని వృత్తాలు వీటికి అనుగుణంగా స్పందించడం జరుగుతుంది.

1

ఆరోగ్యవంతురాలైన స్త్రీ శరీరంలో ప్రతి 27.55 రోజులకీ సంభవించు ఋతు చక్రాలు స్పష్టంగా తెలుస్తాయి. పురుష శరీరంలో ఇవి అంత స్పష్టంగా ప్రకటించబడవు, అవి ఇంకొక విధంగా ఎక్కువ వ్యవధిలో సంభవిస్తాయి. ఈ వృత్తాలు విశ్వంలో, సౌర వ్యవస్థలో అన్ని వేళలా సంభవిస్తూనే ఉంటాయి. సూక్ష్మ ప్రపంచమూ (అండము), బ్రహ్మాండమూ  ఆడే ఆట ఇదే. మరి ఎవరు ఎవరికి తగిన ఆట ఆడాలి? బ్రహ్మాండం మీ ఆట ఆడుతుందని మీరు భావిస్తే మీ జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటారు. మీరు బ్రహ్మాండపు ఆటలో పాల్గొంటే మీ జీవితం మీ అంచనాలకు మించిపోతుంది.

యుగాల ఆవృత్తాలు

విషువత్తు చలన సమయం (equinox) భూమి తన అక్ష్యమును రాశిచక్రం చుట్టూ ఒక పూర్తి వలయాకారం తిరిగే సమయం. భూమికి రాశిచక్రం చుట్టూ ఒక పూర్తి (360degrees) వలయం చుట్టడానికి 25920 సంవత్సరాలు, అందులో ఒక డిగ్రీ చుట్టడానికి 72 సంవత్సరాలు పడుతుంది. ఒక పూర్తి (360degrees ) వలయము లో సగం చుట్టు తిరగడానికి 12960 సంవత్సరాలు పట్టగా ఇది నాలుగు యుగాల సమయాన్ని పొదిగి ఉంది. సత్యయుగం 5184 సంవత్సరాలు నడవగా, త్రేతాయుగం 3888 సంవత్సరాలు, ద్వాపర యుగం 2592 సంవత్సరాలు, కలియుగం 1296 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాల మొత్తం  12960 సంవత్సరాలు.

కలియుగ ఆరంభం

మహాభారత ఇతిహాసాన్ని ఒక నిర్దిష్ట విధానంలో చూడవలసిన అవసరం ఉంది. కురుక్షేత్ర సంగ్రామం 3140 క్రీ.పూ అంతం అయ్యింది. కృష్ణుడు క్రీ.పూ. 3102 తన శరీరాన్ని విడిచాడు. ఆ తరువాత 3-4 నెలలకు కలియుగం ఆరంభమయ్యింది.  ప్రస్తుతం మనం క్రీ.శ 2012 లో ఉన్నాము, అంటే కృష్ణుని శకము 5114 సంవత్సరాలకు పూర్వము అంతం అయ్యింది. భూమి అక్షయ చలనంలో కలియుగాలు దీర్ఘ వృత్తము యొక్క అడుగు భాగంలో ఉండుటవల్ల రెండు కలియుగాలు కలిసి 2592 సంవత్సరాలు. దీనిని 5114 నుంచి తీసివేస్తే మనకి 2522 వస్తుంది. అనగా మనము ద్వాపర యుగంలో 2522 సంవత్సరాలు పూర్తి చేసి మరో 70 సంవత్సారాలలో త్రేతా యుగంలోకి అడుగుపెడతాము. త్రేతా యుగం లోకి అడుగుపెట్టే ముందు ప్రపంచం మరొక ఉపద్రవం ఎదురుకోవచ్చు, అది యుద్ధం కానవసరంలేదు, జనాభ విస్ఫోటనం కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కూడా కావచ్చు. త్రేతా యుగంలో మానవ స్పృహ, మానవ సంక్షేమం ఉన్నత దిశకు చేరుకోగలవు.

యుగాలు మానవ సచేనత్వం

2

సూర్యుడు తన చుట్టూ గ్రహాలతో కూడి సౌర వ్యవస్థగా, విశ్వంలో తిరుగుతూ ఉన్నాడు. మన సౌర వ్యవస్థకు మరో పెద్ద నక్షత్రం చుట్టూ ఒక పరివృత్తం పూర్తి చేయడానికి 25920 సంవత్సరాలు పడుతుంది. గ్రహాలపై పడుతున్న ప్రభావం, అలాగే వాతావరణంలో వచ్చే మార్పులను పరిశీలిస్తే, ఈ పెద్ద నక్షత్రం లేక పెద్ద వ్యవస్థ పరివృత్తానికి మధ్యలో కాక ఒక పక్కకి ఉందని విశ్వాసంగా చెప్పవచ్చు. ఈ పరివృత్తంలో తిరుగుతూ మన సౌర వ్యవస్థ ఈ పెద్ద వ్యవస్థకి దగ్గర్లో ఉన్నప్పుడు మన వ్యవస్థలోని జీవులందరూ అధిక సంభావనీయతకు ఎదుగుతారు. అదే మన సౌర వ్యవస్థ ఈ వ్యవస్థకు దూరంగా ఉన్న సమయంలో జీవులందరూ అతి తక్కువ సంభావనీయతను అనుభవిస్తారు.

మన సౌర వ్యవస్థ "సూపర్ సన్" కి దగ్గర్లో ఉన్నప్పుడు  సత్యయుగం ఆరంభమవుతుంది. మానవ మేధస్సు పూర్తిగా వికసించి ఉంటుంది. జీవితం గూర్చి అవగాహన చేసుకునే శక్తి, మానవ భావ వ్యక్తీకరణ, అనందంతో జీవించడం వీటన్నింటిలో మానవుడు అత్యున్నతి స్థితిలోఉంటాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రజలు వివేకులుగా ఉంటారు. ఈ భూమి మీద బాగా  జీవించడానికి కావలసింది కొద్ది మంది వివేకులు మాత్రమే.

సత్య యుగంలో ఈథర్ చాలా దగ్గరగా ఉండడంవల్ల  మానవ భావ వ్యక్తీకరణ శక్తి ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ప్రస్తుతం ఈథర్  గోళం కొంత ఎత్తులో ఉంది, ఒకప్పుడు అది ఇంకా ఎత్తులో ఉండేది ఇప్పుడు కొద్దిగా దగ్గరకు చేరింది. ఈథర్  గోళం చాలా దగ్గరగా ఉన్నప్పుడు నేను మీకు తెలియజేయ వలసినది నోటితో చెప్పనవసరంలేదు. నా కళ్ళు మూసుకొని ఉన్నా నేను చెప్పదలుచుకున్నది మీకు తెలుస్తుంది. ఈథర్ గోళం కొద్దిగా దగ్గరకి చేరినప్పుడు నా కళ్ళు మూసి ఉన్నప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ నేను కళ్ళు తెరచి మిమ్మల్ని చూసిన వెంటనే మీకు నేను చెప్పదలుచుకున్నది తెలుస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు