ఏంటీ, నేనా, ధ్యానమా??
చాలామంది ధ్యానం చేయడం అంటే చాలా కష్టమని అనుకుంటారు. కానీ, ఈశా క్రియ సహజంగానే మనల్ని ధ్యాన నిమగ్నులను చేయగలిగే ఒక సులభతరమైన ప్రక్రియ.
ధ్యానం అనే మాట వినగానే చాలామంది "అది నేను చేయగలిగింది కాదు!" అనుకుంటారు.
అసలు ధ్యానం గురించి ఉన్న అపోహలను కొద్దిగా తొలగిద్దాం. చాలామంది ప్రధానంగా చేసే పొరపాటు ఏమిటంటే, వాళ్ళు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు, విఫలమవుతారు, ఇక అప్పుడు ‘ధ్యానం చేయడం చాలా కష్టమని’ అంటారు. ధ్యానం అనేది నిజానికి మీరు చేయగలిగే పని కాదు.
"మీరు అనేది ఏంటి? మేము బాసిపట్టు వేసుకుని, కళ్ళు వంకరగా పెట్టి కూర్చోవాలా?" చాలు బాబోయ్, చాలు, చాలు.
మీరు ఎప్పటికీ ధ్యానం చేయలేరు, కానీ, మీరు ధ్యాన నిమజ్ఞులు కాగలరు, మీరే ధ్యానం కాగలరు. ధ్యానం అనేది ఒక లక్షణం. కావలసిన, ఒక రకమైన వాతావరణం మీరు సృష్టిస్తే ధ్యానం దానంతట అదే జరుగుతుంది. అది ఒక తోటని పెంచడం లాంటిది. మీరు మొక్కలని పెరిగేలా చేయలేరు. కానీ, మీరు మొలకలకు తగిన - మట్టి, సూర్య కాంతి, మంచి గాలి, వాతావరణం కల్పిస్తే – పువ్వులు అవే పూస్తాయి. అలాగే, మీరు మీ శరీరంలో, మెదడులో, భావనలో, శక్తిలో సరైన వాతావరణాన్ని తయారు చేసుకుంటే, ధ్యానం వికసిస్తుంది. అలా కాక ఊరికే కూర్చుని, ధ్యానం చేయాలని ప్రయత్నిస్తే --- అది ఎప్పటికీ జరగదు.
ధ్యానం చేయడం అంటే ఎక్కడికో వెళ్లడం అని కాదు. నిజానికి, మన నిజస్థితికి మనం చేరడం. అనుకూలమైన పరిస్థితులు ఏర్పరిస్తే నిజానికి అదే అన్నిటికంటే సహజమైన స్థితి.
సరే, అసలు మనం ధ్యానం ఎందుకు చేయాలి? మీరు ఈ పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండాలి అనుకుంటే, ‘మీలో స్వత: సిద్ధంగా ఉన్న అంతర్గత మేధాశక్తిని తట్టి లేపడానికి’ ఇది ఒక మార్గం. దానికి ఫలితం? మీరు ఏ విషయం అయితే తెలుసుకోవాలనుకుంటారో, దాన్ని పైపైన కాకుండా, లోతులకు వెళ్లి శోధించగలుగుతారు.
ఈశా క్రియ ఒక సులభమైన, అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. రోజు కి 12 నిమిషాలు కేటాయించ గలిగితే, ఎవరైనా చేయగలరు! ఎలాగా, ఏమిటి అని కంగారు పడకండి. ఇది చాలా సులభమైన ధ్యాన ప్రక్రియ.
ఈశా క్రియ ఎందుకు చేయాలి?
"ఈశా" అంటే ఈ విశ్వ సృష్టికి మూలాన్ని సూచిస్తుంది. "క్రియ" అంటే అర్థం అంతర్గతంగా చేసే పని, అంతర్గత చర్య. మనిషి తన ఉనికి మూలాలను స్పృశించి, తద్వారా తన ఆశలు, ఆశయాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోగలగడం, ఈశా క్రియ ముఖ్య ఉద్దేశం. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈశా క్రియ చేయటం వల్ల ఆరోగ్యం, చురుకుదనం, శాంతి ఇంకా శ్రేయస్సు చేకూరతాయి.
ఈశా క్రియ ఉచితంగా, మీ ఇంట్లోనే, సౌకర్యవంతంగా, సులభంగా చేయగలిగే ధ్యాన ప్రక్రియ. రోజుకి కేవలం కొన్ని నిమిషాలు కేటాయించగలిగితే, జీవితాన్ని పరివర్తనం చెందించగల అద్భుతమైన శక్తి గల క్రియ.
“నేను ఈశా క్రియ ధ్యాన సాధన చేశాను - సద్గురుతో పాటు చేసే ఈ ధ్యానం ఎంత శక్తివంతమైనదా అని ఆశ్చర్య పోయాను - ఆన్ లైన్ వీడియో ద్వారా చేసినా కూడా - అంతరంగంలో శాంతి, సంతులనం, అనుబంధాలతో కొంత దూరం జరగ గలగడం నాకు అనుభవంలోకి వచ్చింది.- ఓల్గా అవిలా, హాలెండ్.”