పిల్లల పెంపకంలో మెళకువలు - 1/5
పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు ఐదు సూత్రాలను తెలియజేసారు. సద్గురు అందించిన ఈ అమూల్యమైన సూత్రాలు, తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య అనుబంధాన్ని పెంపొందించి, తల్లిదండ్రులు తమ పిల్లల జీవితంలో వారి పాత్రను సరిగ్గా పోషించేందుకు దోహదపడుతాయి. ఇప్పుడు ఈ సూత్రాలను ఒకదాని తరువాత ఒకటి పరిశీలిద్దాము.
పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు ఐదు సూత్రాలను తెలియజేసారు. సద్గురు అందించిన ఈ అమూల్యమైన సూత్రాలు తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య అనుబంధాన్ని పెంపొందించి, తల్లిదండ్రులు తమ పిల్లల జీవితంలో వారి పాత్రను సరిగ్గా పోషించేందుకు దోహదపడుతాయి. ఇప్పుడు ఈ సూత్రాలను ఒకదాని తరువాత ఒకటి పరిశీలిద్దాము.
సద్గురు:తల్లిదండ్రుల పాత్ర చాలా విచిత్రమైనది. అంతకుముందు ఎవరు ఎంత బాగా నిర్వహించారో తెలియదు కాని మనం మాత్రము ఈ బాధ్యతను ఇంకా సమర్ద వంతముగా నిర్వహించాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. మీకు పన్నెండుమంది సంతానం ఉన్నారనుకుందాము. మీరు పదకొండుమందిని సరిగా పెంచియుండచ్చు. కాని, పన్నెండోవాడు మీకు తప్పకతిప్పలు తెచ్చి పెట్టగలడు.
సూత్రం -1 : అనుకూల వాతావరణాన్నికల్పించండి
పిల్లలు సరిగ్గా ఎదగడానికి అనువైన వాతావరణాన్ని సమకూర్చడం పెంపకంలోని ప్రధాన అంశం. మీ అంతరంగంలోనూ, మీ ఇంట్లోనూ ఆనందం, ప్రేమ, భద్రత, క్రమశిక్షణలతో కూడిన వాతావరణాన్ని కల్పించుకోవాలి. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి.
మీరు చేయవలసినదల్లా పిల్లల ఎదుగుదలకు కావలిసిన ప్రేమ, సహాయం అందజేయడమే. అతని తెలివితేటలు సహజంగా వికసించడానికి ప్రేమపూర్వకమైన పరిస్థితిని కల్పించడమే. మీ బిడ్డ జీవితము చాలా స్వచ్చమైనది . అతడు ఇంకా జీవితపు ఆరంభంలోనే ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా అతనితో పాటుగా మీరూ జీవితాన్ని చూడడమే. అతడు స్వఛ్చంగా, అద్బుతంగా జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నాడో, అలాగే మీరు కూడా జీవితాన్ని అనుభవించండి. మీరు మీ జీవితంలో ఏమి సాధించారో, ఏమి చేసారో, మీ బిడ్డ అదే చేయాలని ఆశించకండి. మీరు కనీసం ఆలోచించడానికి కూడా సాహసించని దాన్ని మీ బిడ్డ సాధించాలి.అప్పుడే మనతో పాటు లోకం కూడా పురోగతిని సాధిస్తుంది.
మానవులుగా మన ప్రాధమిక బాద్యత ఏమిటంటే మన తరువాత తరం నాకంటే , మీకంటే కూడా కనీసం ఒక్క అడుగైనా ముందుండాలి. వారు పక్షపాతం, భయం, ద్వేషం, విచారం, సమస్యలు లేకుండా మనకంటే సంతోషంగా ఉండాలి. మనమందరం ఈ విలక్షణ లక్ష్యసాధనకై ప్రయత్నించాలి. మన తరువాత తరానికి మీరు అందజేయ గలిగే కానుక మీకంటే కాస్తైనా మెరుగైన వ్యక్తిత్వం కల వ్యక్తిని అందజేయడమే కావాలి కానీ, ఒక నీచమానవుని ఈ లోకములో వదిలిపెట్టడం కాకూడదు.
పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన రెండవ సూత్రం ఇక్కడ చదవండి!
పిల్లల పెంపకంలో మెళుకువలు – 2/5 -మీ పిల్లల అవసరాలు తెలుసుకోండి!
పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన మూడవ సూత్రం ఇక్కడ చదవండి!
పిల్లల పెంపకంలో మెళకువలు – 3/5 - మీ పిల్లల నుండి మీరు నేర్చుకోండి!
పిల్లల పెంపకం గురించి సద్గురు అందించిన నాల్గవ సూత్రం ఇక్కడ చదవండి!
పిల్లల పెంపకంలో మెళకువలు – 4/5 - పిల్లలని స్వేచ్ఛగా, స్వతంత్రంగా పెరగనివ్వండి!