పిల్లలకు సూచనల కరదీపిక అవసరం లేదు
మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఎలా జీవించాలో దశల వారీగా కరదీపిక ఉందా? దీని గురించి సద్గురు ఏమి చెప్పారో చూడండి..
ప్రశ్న: పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ళు సూచనల కరదీపికతో పుట్టరని ఎవరో అన్నారు. ఒక మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఎలా ఉండాలో, ఊహాజనితంగా ఒక కరదీపిక రాయవలసి వస్తే, అదెలా ఉంటుంది?
మీరు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా ఆనందం లేని వ్యక్తిగా మారితే, జీవితంలోని అన్ని లక్ష్యాలూ విఫలంమే. మీరు ఏమి చేసినా దానికి అర్థం లేదు. సామాజికంగా, మీ దుఃఖపూరితమైన ముఖానికి ఇంకా ప్రపంచంలో మీరు చేసిన పనులకు మీకు ఒక అవార్డును ఇస్తారు, కానీ జీవితంలో నిజంగా దానికి ఏమీ అర్ధం లేదు.
సూచనల పట్టికలు వదిలేయండి
వేరొకరి తెలివితేటల గుండా జీవితాన్ని చూడటం మానేయండి. మీ జీవితాన్నే ఇంకొంచెం తెలివిగా చూడటం నేర్చుకోండి. ఇతర ప్రభావాలను తీసివేసినట్లయితే ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సున్నితంగా గడపడానికి అవసరమైన తెలివితేటలు కలిగి ఉంటారు. సమస్య ఏమిటంటే, మీరు గతంలో ఇంకా ప్రస్తుతంలో ఉన్న కథానాయకులచే ప్రభావితమయ్యారు. చివరికి, మీ మనస్తత్వం కేవలం ఒక అభిమాన సంఘం. అభిమాన సంఘం అనేది చాలా ప్రాధమికమైన మనస్తత్వం.
ఒక సాధారణ శిశువు పుట్టినప్పుడు ఒక పూర్తి జీవిగా పుడతాడు. మీరు కేవలం మీ పిల్లలు పూర్తి సామర్ధ్యానికి ఎదగేలాగా పోషించగలరు. మీరు వారిని ఇంకేదో విధంగా తయారు చేయలేరు. మీ ఆదర్శం ఓ కొబ్బరి చెట్టు అనుకొందాం. మీ తోటలో మామిడి చెట్టు మొలకెత్తినట్లయితే, మీరు ఏమి చేస్తారు? కొబ్బరి చెట్టులా కనిపించడం లేదు కాబట్టి, మీరు అన్ని కొమ్మలను నరికివేసి, ఒక్కదాన్ని వదిలేస్తారు. అది చాలా పేలవమైన మామిడి చెట్టు అవుతుంది. మీరు చేయగలిగిన ఒకేఒక పని ఏమిటంటే, మీ పిల్లల తెలివితేటలు పూర్తిగా ప్రవర్ధ మానం అయ్యేట్టుగా చెయ్యడం, శారీరక పరంగా ఇంకా మానసిక పరంగా. మీరు వాటిని పెంపొందించినప్పుడే అది జరుగుతుంది, పాడుచేసినప్పుడు కాదు.
అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం
పిల్లలు మీ ద్వారా వచ్చారు, మీ నుండి రాలేదు. వాళ్ళు మీ సొంతం అని ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్ళు మీ ద్వారా రావడం విశేషం. మీ పని వారికి ప్రేమపూర్వకమైన ఇంకా సహాయకమైన వాతావరణాన్ని అందించడమే. మీ ఆలోచనలు ఇంకా భావోద్వేగాలు, మీ తత్వాలు, మీ నమ్మకాలు ఇంకా అర్ధంలేని విషయాలను పిల్లలపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. పిల్లలు తమ మార్గాన్ని కనుగొనడానికి తెలివితేటలను కలిగి ఉంటారు. అతని తెలివితేటలు పూర్తిగా పెరగడానికి అవసరమైన, అనుకూలమైన వాతావరణాన్ని మీరు సృష్టిస్తే, అతను దానిని తనకు తెలిసిన విధంగా నిర్వహిస్తాడు.
మరి "అంతా సరిగ్గానే జరుగుతుందా?" అంటే, సరిగ్గా జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు - అది కాదు ఉద్దేశ్యం. కానీ తప్పు జరిగే అవకాశాలు చాలా తక్కువ. తమ స్వంత తెలివితేటలను ఉపయోగించుకుంటూ పిల్లలు పెద్దవాళ్ళైతే, ఒక తప్పు జరిగినా దానిని సరిదిద్దుకోగల తెలివితేటలు వాళ్ళకి ఉంటాయి. వారు తమ శ్రేయస్సు కోసం పని చేస్తున్నంత కాలం ఇంకా వారు తమ స్వంత జీవితానికి హాని కలిగించే విధంగా ఏదైనా ప్రతికూలంగా చేయనంత కాలం, మీరు కేవలం చూస్తూ ఉండాలి. పిల్లలకు ఇరవై ఒక్క ఏళ్లు వచ్చే వరకు, మీరు ఇంకా గర్భవతిగా ఉన్నట్లు మీరు భావించాలి, వేచి ఉండాలి. పిల్లవాడు లోపల ఉన్నప్పుడు, మీరు ఏమీ చేయలేదు, అంతే కదా? మిమ్మల్ని మీరు బాగా పోషించుకొని వేచి ఉన్నారు. అంతే - అలాంటి వాతావరణాన్ని అందించండి ఇంకా వేచి ఉండండి.