టీన్ ఏజ్ పిల్లలను పెంచేందుకు 5 చిట్కాలు
టీన్ ఏజ్ పిల్లలను పిల్లలను పెంచడం ఒక అగ్ని పరీక్ష వంటిది అని తరచూ చిత్రీకరిస్తూ ఉంటారు . టీన్ఏజ్ పిల్లల పెంపకం లో ఉన్న అపోహలను తొలగించు కోవడం కోసం, తల్లి దండ్రులకు ఇంకా పిల్లలకు మధ్య చక్కని మెరుగైన సంబంధాల కోసం ఈ 5 చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
పసితనం , బాల్యం, యుక్తవయసు, మధ్య వయసు, ముసలి వయసు, కౌమార దశ లేక టీన్ ఏజ్ అనేది ఒక అభివృద్ధి దశ మాత్రమే. మనం దీనిని భాగాలుగా విడదీయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ, ప్రధానంగా ఇది శరీరం యొక్క ప్రయాణం. కొంతమంది శిశువు దశలో సమస్యలతో బాధపడుతున్నారు, కొంతమంది టీనేజ్ సమస్యలతో, కొంతమంది మధ్యవయసు సమస్యలతో, కొంతమంది ముసలి వయసు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కోణంలో చూస్తే ,జీవితంలో ప్రతి ఒక్క దశ సమస్యలానే అనిపిస్తుంది. వీటిని ప్రజలు జీవితం లోని వివిధ కోణాలు లాగా చూడకుండా వివిధ సమస్యల్లా చూస్తున్నారు.
మీ జీవితంలో ఎన్నో రకాలైన పరిస్థితులు ఉన్నాయి - అవే ఉన్నవి - పరిస్థితులు. కొన్ని మీరు సమర్థవంతంగా నిర్వహించగలరు. కొన్ని మీరు నిర్వహించ లేరు. మీరు వేటినైతే నిర్వహించలేక పోతున్నారో వాటిని మరో పరిస్థితిలాగా చూసి దానిని నిర్వహించే సామర్ధ్యం పెంచుకోకుండా వాటిని సమస్యలని అంటున్నారు. ఒక్కసారి మీరు దేనైనా సమస్య అనుకుంటే, ఇంక ఆ తరువాత చికాకు అనేది సహజ పరిణామం అవుతుంది.
# 1 ఒక మంచి స్నేహితునిలా ఉండండి :
ఒక టీన్ ఏజ్ పిల్లవాని దృష్టి నుండి చూసినప్పుడు, తాను వేగంగా ఎదగడం వల్ల ప్రతి రోజు జీవితం చాలా మారుతుంది కానీ దానిని తన చుట్టూ ఉన్న ప్రజలు గ్రహించలేకపోతున్నారు.సాధారణంగా తాతయ్యలు ,నాన మ్మలు తల్లిదండ్రులకన్నా ప్రియంగా ఉంటారు. ఎందుకంటే వీరు అన్నిటిని కొంచం దూరం నుండి చూస్తుంటారు. ఒక టీన్ ఏజర్ గా మీరు మెల్లగా మీ హార్మోన్ల కు లో బడుతున్నారు.వృద్దాప్యం లో మీరు వాటి ప్రభావం నుండి బయిట పడు తున్నారు.అందుకే వారు అర్ధం చేసుకో గలుగుతారు .మధ్య వయసు లో ఉన్నవారికి ఏమీ అర్ధం కా దు. చారిత్రాత్మకంగా చూస్తే కూడా మధ్య వయసు గందరగోళానికి ప్రతిక.
టీన్ ఏజ్ దశ లో చాలా కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ బుద్ధి మీ హార్మోన్ల ప్రభావానికి లోనైయింది . అకస్మాత్తుగా మోత్తం ప్రపంచం భిన్నంగా కనబడుతుంది. అప్పటిదాకా మనుషులుగా కనిపించిన వారు, ఉన్నట్టుండి పురుషులు, స్త్రీలు గా కనిపిస్తు న్నారు. ఆశ్చర్యం..!! మీరు ప్రపంచంలోని ఒక సగం వారి పట్ల మాత్రమే ఆసక్తి కనబరుస్తారు. అది ఒక పెద్ద మార్పు. వారు దానిని అర్థం చేసుకోవడాకి ప్రయత్నిస్తున్నారని ఇంకా వారికి అది కొత్త అని మనం అర్థం చేసుకోవాలి.
మీరు ఒక మంచి స్నేహితుడయ్యి ఉంటే వారికి సమస్యలు ఉన్న్నప్పుడు వారు మీతో మాట్లాడతారు. చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలకు గొప్ప స్నేహితులు కాదు కాబట్టి, పిల్లలు ఇతరులతోతో స్నేహం చేస్తారు. ఆ స్నేహితులు , వారి సొంత అసంబద్దమైన సలహాలను మీ పిల్లలకు ఇస్తారు, ఎందుకంటే వారు కూడా అదే స్థితిలో ఉన్నారు. మీ పిల్లలకి ఎదైనా సమస్య ఉన్నప్పుడు, వారు మీ దగ్గరికి రావడం ఉత్తమం. కానీ మీరు వారికి బాస్ లా ఉంటే, వారు మీ దగ్గరికి రారు. వారి జీవితానికి మీరు హక్కు దారులు అనుకుంటే వారు మీ దగ్గరికి రారు. మీరు ఘో రమైన అమ్మా నాన్నలయి తే వారు మీ వద్దకు రారు.
మీరు వాళ్లకి ఒక మంచి స్నేహితుడిగా ఉంటే, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వారికీ సమస్యలు ఉన్నాయి. వారు స్నేహితులని ఆశ్రయించడం సహజం. అందుకే చిన్న వయసు నుండే వారికీ 18 నుండి 20 ఏండ్లు వచ్చేదాకా వారికి ఆప్తమిత్రుడు మీరై ఉండేలా చూసుకోండి. మీరు ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి. అది మీరు వారిని కన్నందుకు వచ్చేది కా దు.మీరు వారిని కన్నందుకు వారికి మీరు తల్లి దండ్రులయ్యారు, కానీ ఒక స్నేహితుడు మాత్రం కాలేరు. ఆ స్థానాన్ని మీరు రోజూ బాధ్యతాయుతంగా మెలగడం ద్వారా సంపాదించుకోవాలి.
#2 వారిని బాధ్యులని చెయ్యండి :
టీనేజ్ వారితో వ్యవహరించాలని ప్రయత్నించ కండి. వారికి మీరు అందుబాటులో ఉండండి. వారిని అన్నింటికి బాధ్యుల్నిచెయ్యండి. ధైర్యంగా ఒక నెల వారికి మీ నెలసరి జీతం ఇచ్చి ఇంటిని నడపమని బాధ్యత అప్పగించండి. మీరు అనూహ్యమైన మార్పులు చూస్తారు. మీరు నిజంగా మీ పిల్లలతో ఏ మైనా చెయ్యాలి అని అనుకుంటే, మీరు వారిని వికసించేలా చెయ్యాలి. ఎందుకంటే వారు అదే కోరు కుంటున్నారు. వారి శరీరం మాత్రమే కాదు ఎదుగుతున్నది - వారి మనవ సామర్ధ్యం కూడా పెరుగుతోం ది. మీరు వారిని పరిమితం చేయడానికి చూడకుండా వికసించడానికి అనుమతించాలి.
పిల్లలని వారొక రకమైన అమాయకులుగా 15 ఏండ్లు వచ్చేదాకా పాలు తాగే పిల్లల్లా పెంచకండి. పిల్లలను ఈ మధ్య అలానే పెంచుతున్నారు. వాళ్ళు 12,13,14 ఏండ్లు వచ్చాక కూడా చిన్న పాపల్లాగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇంతకు ముందు ఈ దేశంలో ఈ విధంగా ఉండేది కాదు. ప్రజలు ఉమ్మడి కుటుంబాలలో పెరిగినప్పుడు ఇలా ఉండేది కాదు. వాళ్ళకి 6,7 ఏండ్లు వచ్చేసరికి బాగుండేవారు. ఇప్పుడు వాళ్ళు నిస్సహాయులుగా ఇంకా భావోద్వేగాపరంగా గందరగోళంలో ఉంటున్నారు. ఈ పిల్లలని పెంచడం పెద్ద సమస్య అనే అభిప్రాయం పోవాలి. ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఒక టీనేజర్ ఉన్నారంటే మనం వారికి ఇంట్లో పెద్ద సమస్య ఉన్నట్టు అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇది సరి కాదు.
మా అమ్మాయి కూడా ఒక టీనేజర్ గా ఉండేది - “ మీకు ఏమీ సమస్య లేదా?” అని ప్రజలు నన్ను అడుగుతూ ఉండేవారు. సమస్య ఏముంటుంది? ఆమె బాంబా ఏమైనా? ఆమె బానే ఉంది ఎందుకంటే నేను ఆమెని చిన్న పిల్లలా చూడను. నేను తనని నాతో సమానంగా చూసే వాడిని. తనకు నాలుగు, ఐదు ఏండ్లు ఉన్నప్పుడు నేను తనని తన అభిప్రాయం అడిగేవాడిని, “మనం ఇది చేస్తున్నాం. దీని గురించి ఏమనుకుంటుంన్నావు ?” అని. చాలా సార్లు ఆమె పెద్ద వాళ్ళు ఎవరూ ఎప్పుడూ ఆలోచించలేని, నమ్మశక్యం కాని పరిష్కారాలు ఇచ్చేది. దీని అర్థం ఆ పిల్ల ఒక రకమైన మేధావి అని కాదు. మీరు అనుమతిస్తే ప్రతి పిల్లవాడు ఒక మేధావే. మీరు వారిని ఒక పనికిరాని యంత్రం గా మారుస్తున్నారు ఎందుకంటే మీరు వారిని ఒక కచ్చితమైన మూస లో ఉంచుదామని అనుకుంటున్నారు. మీరు అలా ఒక కచ్చితమైన మూస లో ఉంచాలని చూడకపోతే ప్రతి పిల్లవాడికీ ఇలాంటి సామర్ధ్యం ఉందని మీరు గ్రహిస్తారు.
మీరు మీ పిల్లలకి పరిమితులు పెట్టాలని ప్రయత్నిస్తే, మీకు వాళ్ళు పెద్ద సమస్య అవుతారు. మీకు అబ్బాయిలు ఉంటే ఒకరకమైన సమస్యలు ఉంటాయి. మీకు అమ్మాయిలు ఉంటే ఇంకో రకమైన సమస్యలు ఉంటాయి. జీవితాన్ని నియంత్రించడానికి పరిమితులలో ఉంచడం మంచి దారి అని మీరు ఆలోచించకండి, బాధ్యత వారిని సరైన దారిలో పెడుతుంది. నేను ఇందాక చెప్పినట్టు, ఈ నెల వారికి మీ జీతం ఇచ్చి వారిని ఇల్లు నడిపించమని చెప్పండి - మీరు సెలవులో ఉండొచ్చు. వాళ్ళు వెళ్లి డబ్బంతా దుబారా చేస్తారన్న భయం మీకు ఉంటే - వారు అలా చేస్తే మీకు జరిగేదే, వాళ్ళకీ జరుగుతుంది. వాళ్ళని కూడా ఒక నెల ఆ పర్యవసానాలు అనుభవించనివ్వండి. మీరు కొంత డబ్బు నిలవ వేరేగా ఉంచుకోవచ్చు కానీ వారికి డబ్బులు దుబారా చేస్తే రేపు ప్రొద్దున్న తిండి ఉండదని అర్థం అవ్వాలి. బైట వీధీలో నేర్చుకోవడం కన్నా, మీ దగ్గర సురక్షిత వాతావరణంలో వారు నేర్చుకోవడం మంచిది.
#3 నిస్సహాయతను గొప్పదిగా చూడడం ఆపండి:
మీ పిల్లలు పెరిగి టీనేజర్స్ గా మారుతున్నారు. ఇది ఆనందకరమైన సంఘటనగా ఉండాలి. కానీ మీకు వారు ఎదగడం బాధను కలిగిస్తోంది. దురదృష్టవశాత్తు మనం శిశు దశను, బాల్యాన్ని - ఏవైతే నిస్స్సహాయ స్థితులో వాటిని గొప్పవిగా చేసాము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు నిస్సహాయులు ఇంకా అన్నిటికీ మీ సహాయం కోసం చూస్తారు. మీరు మీ పిల్లలు నిస్సహాయులుగా ఉంటే అద్భుతంగా ఉన్నారని అనుకుంటారు. వారు గనుక మీ నుండి వచ్చి, నిలబడి “హాయ్?మీరు ఎవరు?” అని ఉంటే మీకు ఆ పిల్లలు నచ్చారు. కానీ వాళ్ళకు ఆ ప్రశ్న అడగడానికి 14 కానీ 15 ఏండ్లు పట్టింది. నిజం చెప్పాలంటే వారు, ఇప్పుడు వాళ్ళు అదే ప్రశ్న అడుగుతున్నారు “సరే, అసలు మీరు ఎవరు?” అని.
మీరు కనుక నిస్సహాయంగా ఉండే బాల్యమును – అంటే ఏ స్థితిలో ఐతే వేరేవారి సహాయం లేకుండా ఉండలేమో దానిని మీరు గొప్పగా చూస్తే, ఈ నిస్సహాయ స్థితిలోనే మీరు కలకాలం ఉండిపోతారు. పిల్లలు నిస్సహాయులుగా ఉండడం తల్లిదండ్రులకు అలవాటు ఐపోతుంది కాబట్టి వాళ్ళు టీనేజ్ కి వచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే, జనాలకి నచ్చదు.
మీరు ఆ కొత్త జీవానికి ప్రత్యేకామైన మనిషిగా ఉండాలనుకుంటే, (మానసికంగా/వ్యక్తిత్వపరంగా) ఒక నిర్దిష్టమైన హద్దులు లేని వారిగా మీరు ఉండాలి. పిల్లవాడు పసి పాపలా ఉన్నప్పుడు తను ప్రాకాడు, మీరూ వారితో ప్రాకారు. ఇప్పుడు వారు టీనేజర్ అయ్యి ఊగుదాం అనుకుంటున్నారు, మీరు వారితో ఊగగలగాలి. మీరు ఇంకా ప్రాకాలని అనుకుంటే వారికి ఆసక్తి ఉండదు. కౌమార దశలో చురుకుగా ఉన్న పిల్లల దృష్టిలో పిల్లలు ఇంకా ప్రాకుతూ తమతోనే ఉండాలి అని ఆలోచించే తల్లిదండ్రులు వింతగా కనబడతారు.
#4 వారిని “సొంతం” చేసుకోకండి, వారిని కలుపుకోండి
పిల్లలు మీ సొంతం అనే భావనను తీసెయ్యండి. మీరు అలా కానీ అనుకుంటే వారు టీనేజ్ కి వచ్చాక వారి సొంత పధ్ధతిలో మీకు “నేను మీ సొంతం కాదు ” అని చెప్తారు. వాళ్ళు అదే చెప్తున్నారు - అది మీరు ఒప్పుకోలేకపోతున్నారు. మరో జీవం మీ సొంతం కాదు. మరో జీవం మీతో ఉండడాన్ని ఎంచుకుంటే మీరు దానిని ఆదరించండి. అది అద్భుతమైనది. అది మీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ - వారు మీ ద్వారా రావడానికి లేదా మీతో ఉండడాన్ని ఎంచుకున్నందుకు విలువ ఇవ్వండి. వారు ఏ విధంగా కూడా మీ సొంతం కాదు. మీరు ఇది ఇప్పుడు తెలుసుకోకపోతే మీరు మరణించినప్పుడు గాని లేదా వారు మరణించినప్పుడు గాని ఇది తెలుసుకుంటారు. మీకు వారు సొంతం కాదు కాని మీరు ఖచ్చితంగా వారిని అక్కున చేర్చుకోవాలి.
#5 మీ కోసం మీరు ఏదైనా చెయ్యండి
మీరు మీ పిల్లలని నిజంగా బాగా పెంచాలి అని అనుకుంటే, ముందు మనం మనతో ఏమైనా చేసుకోగలమేమో చూడాలి. తల్లిదండ్రులు అవ్వాలనుకునే కోరిక ఉన్న ప్రతి ఒక్కరు ఒక సులువైన ప్రయోగం చెయ్యాలి. మీరు కూర్చొని మీ జీవితంలో ఏది సరిగ్గా లేదో ఇంకా ఏది మీ జీవితానికి మంచిదో అది మీరు చెయ్యాలి - బైట ప్రపంచానికి మంచి గురించి కాదు ఎందుకంటే దానికి వేరే వారి సహకారం అవసరం. తదుపరి 3 నెలల్లో మీరు అనుకున్నది చెయ్యగలరేమో చుడండి.
ఏదైనా మీ గురించి మీరు - మీ సొంత ప్రవర్తన, మాట తీరు, పని చేసే తీరు మరియు అలవాట్లు - మీరు వాటిని ఒక మూడు నెలల్లో మార్చుకోగలిగితే అప్పుడు మీ అమ్మాయి లేక అబ్బాయితో కూడా మీరు జ్ఞానంతో వ్యవహరించగలరు. లేకపోతే మీరు వేరే వాళ్ళ సలహా మేరకు నడుచుకుంటారు. సలహాలు ఏమి ఉండవు. ఒక వ్యక్తితో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడానికి పిల్లవాడిని పరిశీలించడం అవసరం. మీరు ప్రతి బిడ్డతో ఒకే విధంగా నడుచుకోలేరు, ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకంగా ఉంటారు.