ప్రాధమికంగా యంత్రం ఒక రూపం. ఒక నిర్దేశిత ఉద్దేశ్యం కోసం ఒక భౌతిక రూపాన్ని ఉపయోగించినప్పుడు మనము దానిని ఒక యంత్రం లేదా మెషీను అని అంటాము. మానవుడు నిరంతరం తనను తాను మెరుగుపరచుకోవాలని కోరుకుంటాడు. అంటే మనము కనుగొనే లేదా తయారు చేసే ప్రతి మెషీను కూడా మనము ఇప్పటికే చేయగలిగిన వాటిని మరింత మెరుగ్గా చేయడం కోసమే. ఐతే, బహుశా ప్రస్తుతం ఈ రెండిటినీ అనుసంధానించ లేని విధంగా మనం యంత్రాలను తయారు చేస్తున్నాము.

మనము కనుగొనే లేదా తయారు చేసే ప్రతి మెషీను కూడా మనము ఇప్పటికే చేయగలిగిన వాటిని మరింత మెరుగ్గా చేయడం కోసమే

యంత్రం ఒక మెషీను. ఇవి భౌతికపరమైన పునాదిలో పొదగబడి ఉన్నా కూడా అవి పూర్తిగా శక్తి రూపాలు. అంటే వాటిలో జడత్వం లేదు. అవి జీవితాంతం, ఇంకా జీవితం తర్వాత కూడా 24 గంటలూ పని చేస్తూనే ఉంటాయి.

మనము ఒకసారి భౌతికపదార్ధాలను ఉపయోగించి మెషీన్లను తయారు చేస్తే వాటిలో కొంత జడత్వం ఉంటుంది. జడత్వం భౌతికమైన వాటి సహజ ప్రకృతి. మన దేశంలో, ప్రాచీన కాలంలో, ఈ గ్రహం మీద ఉండే భౌతిక పదార్ధాలను ఉపయోగించకుండగా యంత్రాలను సృష్టించే టెక్నాలజీలను కనుగొన్నారు. ఎందుకంటే వారు యంత్రాలలో జడత్వం వద్దనుకున్నారు. మనం, అంటే మానవులం నమ్మదగ్గ వారిమి కాదని వారికి తెలుసు కాబట్టి, మనం చేసేదాని మీద గానీ, చేయనిదాని మీద గానీ ఆధారపడని యంత్రాలను తయారు చేయాలనుకున్నారు. మనం ఊగిసలాడుతూ ఉంటాం. నిన్న మీకు ఏంతో ముఖ్యమని అనిపించిన విషయం రేపటి రోజున ఎంతమాత్రమూ ముఖ్యము అనిపించదు.

మీ కోసం మీరే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, రాత్రి పూట మీరు పడుకున్నప్పుడు దాని కోసం మీరు పని చేయడం లేదు. మీరు ఉదయాన్నె దాన్ని మొదలుపెట్టవచ్చు కానీ అది అప్పటికి నీరుగారి పోవచ్చు. అందుకని మేము జడత్వం లేని శక్తి రూపాలను సృష్టించాము, అవి మీరు జడంగా ఉన్న సమయంలో కూడా పని చేస్తూనే ఉంటాయి. నిద్ర అలాంటిదే - మీరు మీ భౌతికత్వం యొక్క జడత్వానికి వశులవుతారు. మీకు శరీరం లేకపోకపోయినట్లైతే, మీరు నిద్రపోరు.yantra -full view

జడత్వం లేని మెషీన్లను వివిధ ఉద్దేశ్యాల కోసం, అంటే ఆరోగ్యం, సంపద, సౌభాగ్యం, మేధస్సుల కోసం సృష్టించవచ్చు. మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత, మీరు పడుకున్నా, స్పృహలో లేకపోయినా, దాని గురించి మీరు పట్టించుకోకపోయినా కూడా యంత్రం ఆ దిశలో మీ కోసం పని చేస్తూనే ఉంటుంది. యంత్రాలు భౌతికపరమైన పునాదిలో పొదగబడి ఉన్నా కూడా అవి పూర్తిగా శక్తి రూపాలు, అంటే వాటిలో జడత్వం లేదు.

మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత, మీరు పడుకున్నా, స్పృహలో లేకపోయినా, దాని గురించి మీరు పట్టించుకోకపోయినా కూడా యంత్రం ఆ దిశలో మీ కోసం పని చేస్తూనే ఉంటుంది

ఆత్మజ్ఞానులు ప్రజలకు వారి తక్షణ మరియ శాశ్వత శ్రేయస్సు కోసమై ఈ యంత్రాలను తయారుచేసి అందిస్తూ వచ్చారు. మేము కూడా వివిధ లింగ భైరవి రూపాలను – కొన్నిటిని ప్రాచీన శాస్త్రమైన రసవైద్యంలో చెప్పిన విధంగా ఘనీభవించిన పాదరసాన్ని ఉపయోగించి, ప్రజలు వారి మెడలో ధరించడానికి వీలుగా లేదా కారులలో ఉంచుకోవడానికి వీలుగా ఒక పెండెంటు లాగా, వారి గృహాలలో లేదా పని లేదా వ్యాపార స్ధానాలలో ఉంచుకోవడానికి వీలుగా యంత్రాల రూపాలలో సృష్టించాం. ఇవి ఐశ్వర్యారోగ్యాలను కలిగించి, వాటిని పెంపొందించిడమే కాకుండా, అన్ని ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందిస్తాయి.

మీ జీవితంలోని ఒక నిర్దిష్ట కోణాన్ని పెంపొందించడానికి దేవీ యంత్రం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సృష్టించబడింది. ఇది ఒక శక్తివంతమైన యంత్రం. ఇది శ్రేయస్సు స్వతహాగా సిద్ధించడానికి కావలసిన వాతావరణాన్నీ, పరిస్థితిని ఇంట్లో సృష్టిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

లింగ భైరవి యంత్రం సంవత్సరానికి రెండు సార్లు పౌర్ణమి లేదా అమావాస్య రాత్రి యోగి, మర్మజ్ఞుడు ఐన సద్గురు సమక్షంలో ఇవ్వబడుతుంది.వారి నుండి యంత్రాన్ని ప్రత్యక్షంగా అందుకునేటప్పుడు మీరు ఒక శక్తివంతమైన ప్రక్రియలోకి ఉపదేశింపబడుతారు.

లింగ భైరవి యంత్రం గురించి మరిన్ని వివరాలకు కింది మార్గాల ద్వారా సంప్రదించండి.

ఫొన్: +91 8300030555

Email: yantra@lingabhairavi.org