Video transcript:
ఆయుష్మాన్ ఖురానా: నమస్కారం సద్గురు, నేను ఆయుష్మాన్ ఖురానా. నాకు రాజకీయం గురించి అవగాహన ఉంది. మనదేశంలో రాజకీయ పరిస్థితి అధ్వానంగా ఉంది. మనకి ఎన్నో సంస్కృతులు ఎన్నో ప్రాంతాలు, కుల, మత, జాతి ఇలా ఎన్నో. నేననుకునేదేంటంటే.. రైట్ వింగ్ అయినా, లెఫ్ట్ వింగ్ అయినా రెండు ప్రమాదకరమైనవే. ఈ రెండిటికీ మధ్యన నడవాలని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశంలో ఏది సరైనది ?
సద్గురు: ఆయుష్మాన్ అంటే దీర్ఘకాలం జీవించేవాడు. మీరు ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచాలి అనుకుంటే మీరు ఏ పక్షాన నిలబడరు. ఇది మీరు ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచాలి అనుకుంటే. అమెరికాలో ఇది ఎంతో బలంగా నాటుకుపోయింది - ఈ రెండూ రెండు మతాలుగా తయారయ్యాయి - మీరు డెమోక్రాట్ల లేదా మీరు రిపబ్లికన్ల అన్నది. మా తాతగారు రిపబ్లికన్, మా నాన్నగారు రిపబ్లికనే అందుకని నేను కూడా రిపబ్లికన్ నే. ఇదంతా ముందరే నిర్ణయం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలనుకుంటే మనం పక్షపాతం చూపకూడదు. ఇది మనం మరిచిపోయాం. భారతదేశం కూడా ఆ దిశగానే నడుస్తోంది ….మీరు ఎటువైపు ఇటా లేక ఆటా? వచ్చేఎన్నికలో ఏం చేయాలి అన్నది నేను ఇంకా నిర్ణయించుకోలేదు. చూద్దాం..ఎవరు ఎలా పనిచేస్తున్నారో. ఎవరు సరిగ్గా ఆలోచిస్తున్నారో..
నేను రైటా, లెఫ్ట, సెంటరా అంటే..…. లేదు, మీరు ఇలా అనుకోగానే మీరు ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్లే. ఇది ఫ్యూడలిజం అయిపోతుంది. నేను ఈ జాతి వాడినైతే వీరికి ఓటు వేస్తాను, ఆ జాతి వాడినైతే వారికి ఓటు వేస్తాను అంటే, ఇంక ప్రజాస్వామ్యం ముగిసినట్లే. ఇలా అయితే ప్రజాస్వామ్యంఎక్కడ ఉంటుంది. అమెరికాలో నాయకులని నిర్ణయించేది కేవలం 4 నుంచి 5 శాతం మంది మాత్రమే. మిగతా వారందరూ ముందుగానే నిర్ణయించేసుకుని ఉంటారు. భారతదేశంలో ఇది 10 నుంచి 12% కావచ్చు.. బహుశా 15శాతం ఏమో…. కానీ ఈ ఎన్నికల తర్వాత మనం కూడా అమెరికాలానే తయారవుతాం అనుకుంటా… ఎందుకంటే ప్రతివారు కూడా.. ఏదో ఒక పక్షం తీసుకోవాలనుకుంటున్నారు.
మీరు ఏ పక్షానికీ చెందినవారై ఉండకూడదు. ఎవరిని ఎన్నుకున్నా సరే.., దీనివల్ల ఎటువంటి రక్తపాతం లేకుండా అధికారం మారుతోంది …. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అదే. మీరు ఒక తెగకు చెందిన వారిగాఆలోచిస్తే, నేను ఈ తెగ వాడిని లేదా ఆ తెగ వాడిని అని అనుకుంటే.. మళ్ళీ మీరు దీన్ని తెగల మధ్య జరిగే పోరాటం దిశగా తీసుకువెళుతున్నట్లే. మనం అధికారాన్ని మార్చాలన్న ప్రతిసారి రక్తపాతమే జరుగుతుంది.
అందుకనే ఆయుష్మాన్ మీరు ఏ పక్షాన నిలబడకూడదు. నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత 4 నుంచి 6 నెలలపాటు అప్పటివరకు ఏం జరిగిందో పరిశీలించి చూడండి.. ఈ నాలుగున్నర సంవత్సరాలలో వారి పనితీరును బట్టి, మళ్లీ వారిని ఎన్నుకోవాలా లేదా అన్న విషయం బేరీజు వేసుకోండి. ఇది ప్రతి పౌరుడు చివరి మూడు నుంచి ఆరు నెలల్లో తీసుకోవాల్సిన నిర్ణయం. ఓ ప్రజాస్వామ్యంగా పరిణితి చెందాల్సిన సమయం ఇది. మీరు ఏ పక్షానా నిలబడాల్సిన పని లేదు.