ప్రశ్న: నా పేరు నరేంద్ర సింగ్. నా ప్రశ్న ఏంటంటే చదవకుండా పరీక్షల్లో పాస్ అవ్వటం ఎలా?
సద్గురు: ఓహ్! నరేంద్ర సింగ్.... చదవకుండా పరీక్ష పాస్ అవ్వటం ఎలా?.. నా కోరికా ..నా ఆశీర్వాదం ఏంటంటే.. నా కోరికా నా ఆశీర్వాదం ఏంటంటే నువ్వు పాస్ అవ్వకోడదు. ఎందుకంటే, చదవకుండా ఎలా పాసవ్వాలని అడుగుతున్నారంటే... మీరు “ ఏమీ తెలీకుండా సర్టిఫికెట్ తెచ్చుకోవటం ఎలా” అని అడుగుతున్నారు. మీరు ఒక డాక్టర్ అయ్యారనుకోండి, ఏమీ తెలియని డాక్టర్ అయితే, ఎన్ని ప్రాణాలు పోతాయో చెప్పలేం. ఏమీ చదవకుండా, ఏమి తెలియకుండా మీరొక ఇంజనీర్ అయ్యి, కోల్కతా బ్రిడ్జి కడితే, మనుషులు ఆ బ్రిడ్జి దాటకుండానే,అది కూలిపోయి మనుషుల తల మీదపడితే??.. ఇంకేమేమి ఉపద్రవాలు జరుగుతాయో తెలీదు. మీరు చేసుకున్నదేంటంటే, మీరు మీ అహాన్ని బలపరుచుకుని, కోరికల్ని పెంచుకున్నారు. లేదు...చేయవలసింది ఏమిటంటే మీ తెలివిని బలపరుచుకుని సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి.
మీరు చెయ్యల్సింది ఇదే. విద్యంటే కూడా అదే..జీవితమంటే అర్ధం ఇదే. చదువంటే పరీక్ష పాస్ అవ్వటం అని మీరు అనుకుంటున్నారు. విద్య అంటే పరీక్ష పాస్ అవ్వటం కాదు. చదువంటే నేర్చుకోవటం. ప్రపంచం ఈ విషయాన్ని మర్చిపోయినట్టుంది . చదవకుండా పరీక్షలు రాసి పాస్ అవ్వాలనుకునేవాళ్ళు, ఆడకుండానే గెలవాలనుకునేవాళ్ళు, వారు చెయ్యని పనులకు గౌరవం పొందాలనుకునేవాళ్ళు- వీళ్ళంతా సంపాదించేదోక్కటే, వాళ్ళు జీవించకుండా మరణిస్తారు. ఇదొక్కటే వాళ్ళు సంపాదించేది. ఎందుకంటే, జీవించాలంటే అందులో లీనమవ్వాలి, మీ తెలివిని,సామర్ధ్యాన్నీ బలోపేతం చేసుకోవాలి. మీ సాయకక్తులా కృషిచేసి ఏదైనా చేయడంలో ఒక తృప్తి ఉంది , సంతోషం ఉంది, జీవం ఉంది. చదవకుండా పరీక్ష పాస్ అవ్వటంలో, ఆడకుండా ఆట గెలవటంలో,చేయ్యనిపనికి మెప్పు పొందటంలో, కేవలం అహం తృప్తి పడుతుంది.
చుట్టూ ఓడిపోయిన వాళ్ళని చూసి కాస్త తృప్తి పడటానికే పనికొస్తుంది.చెప్పాను కదా, ఇలాగైతే జీవించకుండానే మరణిస్తారు. చదవకుండా పరీక్ష పాసవ్వటం ఒక విజయంగా మీరు భావిస్తే, జీవించకుండా మరణించటం ఒక గొప్ప విజయం –అది సాధించగలరు. ఏంటి? నరేంద్ర సింగ్ ‘ధోని’ ..మోడీ ఆ?? కాదు...చదవకుండా పరీక్ష పాస్ అవ్వాలనుకునే వాళ్ళు అన్నిటిల్లో ఛాంపియన్ లే. అన్నిటిల్లో ఛాంపియన్ అంటే మూర్ఖుడే. మీరు దేనిలోనైనా విజేత ఐతే, దాంట్లో ఎంతో కృషి ఉంటుంది, గెలుపు సాధించటానికి. అదే అన్నిటిలో విజేతలంటే మీరు మూర్ఖులే. మీరు అన్నిట్లో విజేతైతే, మీకేమీ తెలీదనమాట, ఔనా?. మీకు ఏమీ చెయ్యటం తెలీదు. నరేంద్ర సింగ్. ఇది నాకోరికఇంకా ఆశీర్వాదం కూడా.., చదువుకోని వారందరూ ఫెయిల్ అవ్వాలి... ఆడటం రాని వారందరూ ఓడిపోవాలి...ఔనా??. సద్గురు: అర్హత లేని వారికి గౌరవం దక్కకూడదు.. ఇది నా కోరిక.. ఇదే నా ఆశీర్వాదం.. మీరు తప్పు చోటుకి వచ్చారు. అలాంటివారు ఉన్నారు.
నువ్వు చదివినా చదవకపోయినా, నా ఆశీర్వాదం వల్ల నువ్వు పాసవుతావ్ అనేవాళ్ళు ఉన్నారు.నేనలా కాదు. మీరు తప్పు చోటుకి వచ్చారు.. ఏం... అన్నిట్లో ఛాంపియన్???? ఉ.. మీరు అలా కాకపోతే మంచిదే. మీరు అన్నిట్లోనూ విజేతలైతే, జీవితం రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఓడిపోతే ..కనీసం నేను తర్వాత మెట్టుకు అర్హుడిని కానని తెలుస్తుంది.ఔనా కాదా?. మీరొక ఆట ఓడిపోతే, మీకు ఆ ఆట రాదనీ తెలుస్తుంది. ఔనా కాదా?. సద్గురు: అదే ఓటమి ముఖ్య ఉద్దేశం. గెలుపు ఓటముల ప్రధాన లక్ష్యం అదే,నేను తర్వాతి అడుగు వెయ్యటానికి అర్హుడినా కానా అని తెలుసుకోవడానికి. ప్రపంచాన్ని మోసం చెయ్యటానికి కాదు. మీరు ప్రపంచాన్ని మోసం చెయ్యచ్చు. అలా చేస్తూ చివరికి, మీరే మూర్ఖంగా మోసపోతారు .అదే సమస్య. నరేంద్ర సింగ్, ధోని కాదు.. మోదీ కాదు. ఆ పేర్ల వెనకాల ఎంతో కృషి ఉంది. ఇది ఇక్కడికి వదిలేద్దాం... లేకపోతే నేను ఇంకా దురుసుగా మాట్లాడతా ఎందుకంటే చదవకుండా పాస్ అయ్యే వారంటే నాకు ఇష్టం ఉండదు.