"సాధన మిమ్మల్ని ఒక దిశగా నడిపిస్తోంది. మీ మనస్సు పరిమితమైన వాటికి కట్టుబడిపోతే, అనవసరంగా మీరు మీ వ్యవస్థను సంఘర్షణకు గురి చేస్తున్నారు. ఇది ఎలాంటిదంటే, మీరు మీ పడవని కట్టేసారు. ఆ తర్వాత నడపడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఎక్కడికీ వెళ్ళలేరు. మీరు ఆ కట్టిన తాడును తీసేస్తే, మీరు తెడ్డు వేయకపోయినా సరే, మెల్లిగా నది ఒరవడితో అయినా సరే మీరు ముందుకు సాగుతారు" అని అంటున్నారు సద్గురు.
Subscribe