తపోవనం ఎంతోమంది అద్భుతమైన వారి అనుగ్రహంతో నిండిన ప్రదేశం..! ఇటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా సరే, వారు, వారి గుడ్లను(తపో సంపద) అక్కడ పెడుతూ ఉంటారు. ఇది, వారి జీవన విధానం. ఇప్పుడు బొంబాయి లోనో, న్యూయార్క్ లోనో లేదా మరెక్కడైనా, ఇటువంటి గుడ్లను పెట్టామనుకోండి, ప్రజలు వాటిని తొక్కేసి వెళ్లిపోతారు. వారికి, దానిని గుర్తించగలిగే ఇంగితం ఉండదు. అందుకని, యోగులు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారి గుడ్లను పెడతారు. నేను కూడా ఆ పని చేశాను. మీలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. అతి కొద్దిమందికే ఇది తెలుసు. ఉదాహరణకు, మీరు ఒక పక్షిని ఎప్పుడైనా చూశారా..? మీరు హిమాలయాల ప్రాంతాలకు మే, జూన్, జూలై నెలల్లో వెళ్ళినట్లైతే, మీలో చాలామంది, కొన్ని పక్షులు పెట్టిన గుడ్లను చూడలేరు. ఆ గుడ్లను, మరో ప్రాణి చూసి ఎత్తుకుపోలేని విధంగా ఆ పక్షులు వాటి గుడ్లని పెడతాయి. ఒకవేళ, మరో ప్రాణి కనుక ఆ గుడ్లను చూసినట్లైతే, అవి వాటిని తీసుకుని తినేస్తాయి. అలా జరుగకపోతే, ఈ గుడ్లు పక్షులుగా మారి ఎగురుతాయి.
మీరు కనుక ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్యలో దక్షిణభారత ప్రాంతంగుండా వెళ్తున్నట్లైతే, ఎన్నో అద్భుతమైన విధానాల్లో ఈ పక్షులు వాటి గూళ్లని కట్టుకుని లేదా గూళ్లని వెతుక్కొని, గుడ్లు పెడుతూ ఉండడాన్ని గమనిస్తారు. ఈ పక్షులు వాటి సొంత గూళ్లను ఏర్పరచుకుంటాయి. ఇవి వాటి గూటిని చెట్లలో ఎంతో అద్భుతంగా నిర్మించుకుంటాయి. ఇలా నిర్మించుకోవడం చేతగాని కొన్ని పక్షులు - వేరే, చిన్న చిన్న ప్రదేశాల కోసం చూస్తూ ఉంటాయి. ఇక్కడా-అక్కడా ఒక చిన్న రాయో లేదా ఒక చిన్న చెక్కముక్కో, లేదా మట్టిలోనో ఎక్కడో ఒకచోట, అవి వాటి గుడ్లను వదులుతాయి. ఒకవేళ మీరు వాటి కోసం వెతుకుతున్నా సరే, మీకు గుడ్లు కనపడకుండా ఉండేలా ఆ పక్షులు గుడ్లని పెట్టగలవు. ఇంత అద్భుతంగా అవి వాటి గుడ్లను పెట్టేందుకు తగిన ప్రదేశాలను వెతుక్కుంటాయి. నేను ఇందాక చెప్పినట్లుగా అవి మరో జంతువుకు ఆహారంగా కాకుండా ఉండేందుకు ఈ విధంగా చేస్తాయి. ఒకవేళ అలా చేయకపోతే, ఆ గుడ్లు మరొ జంతువుకు ఆహారమైపోతాయి. లేదా ఇవి పక్షులుగా మారి ఎగురుతాయి.
తపోవనం కొన్ని రకాలే..కేదారంలో ఉన్నవి అన్ని రకాలు
యోగులందరూ కూడా పక్షుల్లాంటివారే. వీరికి మరొక పార్శ్వాన్ని తెలుసుకున్న అధికారం, బాధ్యతా రెండూ ఉన్నాయి. సాధారణ ప్రజల అనుభూతిలో లేనివి, వారి దగ్గర ఉన్నాయి. వారు కూడా ఎక్కడైతే కూర్చుంటారో, నించుంటారో అక్కడ వారి గుడ్లను పెడుతూనే ఉంటారు. వీరెప్పుడూ కూడా, కొండ ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే, కొన్ని ప్రదేశాలు పవిత్రమైనవిగా గుర్తించబడ్డాయి. ఇక్కడ కనుక వారి గుడ్లను పెడితే, అవి తొక్కివేయబడవు. ప్రజలు వీటిని అనుభూతి చెందగలుగుతారు. అందుకని వారు ఇటువంటి ప్రదేశాలను ఎంచుకుంటారు.
తపోవనం ఇటువంటి పక్షిగూడే..! ఈ ప్రదేశాన్ని, ఎంతోమంది యోగులు వారి గుడ్లను పెట్టేందుకు ఎంచుకున్నారు. కానీ అన్నింటిలోకీ అతి పెద్ద గూడు - కేదార్. కేదారంలో అన్ని రకాలవారూ వారి గుడ్లను పెట్టారు. ఇవి విభిన్నమైనవి. ఇక్కడ అన్నీ కలిసిపోయాయి. అందుకని మీరు కనుక ఒక ప్రత్యేకమైన విధానంలో ఉపదేశం పొంది ఉంటే, మీరు ఆ అంశాన్ని అనుభూతి చెందగలుగుతారు. ఇక్కడ మీకు తెలియని ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. కానీ ఇంకా అవి మీ అనుభూతిలో లేవు. మీరు ఒక విధానంలో ఉపదేశించబడ్డారు కాబట్టి, మీరు ఆ పార్శ్వానికి లేదా ఆ కోణానికి సుముఖత కలిగి ఉన్నారు.
ఉదాహరణకి, మీకు ఒక నెమలి విధానంలో ఉపదేశం చేశామనుకోండి, మీరు కేవలం అక్కడ ఉన్న నెమలి రంగులు మాత్రమే చూడగలుగుతారు. ఒకవేళ, అక్కడ ఒక చిలుక కూర్చున్నా సరే.. మీకు అది అక్కడ ఉన్నది - అన్న విషయం తెలియదు. అందుకని మీకు ఎటువంటి ఉపదేశాలు ఉన్నాయో, మీ అనుభూతులు కూడా అదే రీతిలో ఉంటాయి. తపోవనం అనేది అద్భుతమైన ఆవశ్యకత. తపోవనం నుంచి ఇంకా పైకి వెళితే దాదాపు 17,200 లేదా 17,400 అడుగుల ఎత్తు మీద నందనవనం అని మరొకటి ఉంది. ఇక్కడ కూడా ఎంతోమంది వారి గుడ్లను పెట్టారు. నేను పర్వతాలను ఎక్కడానికి బద్ధకించే లోపే, ఏదో ఒక రోజున అక్కడికి వెళ్ళి, ఒక రెండు వారాలు అక్కడ గడిపి, అక్కడ ఉన్న కొన్ని గుడ్లను చూసి, నేను కూడా అక్కడ కొన్ని గుడ్లను పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టిన గుడ్లన్నీ కూడా నగరంలోనే..! కొంతమంది అనుభూతి చెందుతారు, మరికొంతమంది తొక్కేసి వెళ్లిపోతారు.
నేను కూడా కాస్త దీర్ఘకాలం ఉండేటటువంటి గుడ్లను పెడదామనుకుంటున్నాను. నేను పెట్టిన ఒక పెద్ద గుడ్డు, ఎవరూ వినాశనం చెయ్యలేనిది - ధ్యానలింగం. ఇది చాలనుకోండి. కానీ నేను కూడా, మరికొన్ని గుడ్లను, ఎక్కడైతే అవి ఎక్కువ కాలం ఉంటాయో, అలాంటి ప్రదేశంలో, ఉంచాలనుకుంటున్నాను. ప్రజలు దానిపట్ల భక్తిభావంతో అక్కడికి చేరుకున్నప్పుడు, అది వారికి అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు నేను అమెరికాలోని టైమ్-స్క్వేర్ లో ఈ పని చేశాననుకోండి, అక్కడి ప్రజలు వాటిపట్ల ఎటువంటి సుముఖత లేకుండా నడుచుకుంటూ వెళ్లిపోతారు. వారు, దీనిని అనుభూతి చెందలేరు. ఇంతేకాదు, వారెవరికో ఇది నచ్చకపోవచ్చు కూడానూ. కానీ ఇది ఎంతో అరుదు. ఎందుకంటే ఇక్కడి వారందరూ కూడా స్వీయ రక్షణని ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు. వారికి అదే అన్నిటికంటే పెద్దది - స్వయం సంరక్షణ. అక్కడ నడిచేవారికి ఇదే అన్నిటికంటే పెద్ద విషయం.
అదే మీరు కనుక తపోవనం వెళ్లారనుకోండి, మీరు అక్కడికి ఒక భక్తి భావంతో వెళ్తారు, దానిని ఒక ఆవశ్యకతగా మలచుకునేందుకు ఒక విధమైన సుముఖతతో వెళ్తారు....! ఇదే, మన భారతదేశంలోని దేవాలయాలు నిర్మించడంలో ఉన్న మూల విశేషం. ఇక్కడ కొన్ని గుడ్లు పెట్టారు. వీటిని, మీరు ఒక విధమైన భక్తి భావంతో చేరుకుంటారు. ప్రతీ విగ్రహానికీ, మీరు దానిని అనుభూతి చెందెందుకు ఒక విధానం ఉంటుంది. తపోవనం ఎంతో సంక్లిష్టమైనది. కానీ కేదారం కంటే కాదు. కేదారంలో మరిన్ని విషయాలు కలగాపులగం అయిపోయాయి.