సాధారణంగా చంద్ర గ్రహ ప్రభావానికీ, హేతుబద్ధతకూ చుక్కెదురు అని భావిస్తారు! కానీ, ఇక్కడ, మన సంస్కృతిలో మాత్రం, మనకు కేవలం శుష్క తర్కానికి ఉన్న పరిమితుల గురించి మొదటినుంచీ స్పష్టమైన అవగాహన ఉంటూనే ఉంది. మీలో తార్కికతతో, హేతు బద్ధతతో ముడిపడిన పార్శ్వం ఒకటి ఉంటుంది. అది మీకు తటస్థపడే భౌతిక, లౌకిక వ్యవహారాలను సవ్యంగా నిర్వహించుకొనేందుకు మీకు ఉపకరిస్తుంది. కానీ, మీలోనే హేతుబద్ధతకు అతీతమైన పార్శ్వం కూడా ఒకటి ఉంది. దాని సహాయం లేకుండా ఆత్మాశ్రయమైన (subjective), అంతర్గతమైన విషయాలు అర్థం చేసుకోలేం. - సద్గురు