సహస్రార చక్రం – మైకం ఇంకా పారవశ్యం
ఏడు చక్రాల గురించి వివరించే పరంపరలో ఈ ఆఖరి విడతగా, సద్గురు మైకం ఇంకా పారవశ్యాలకు లోబడే సహస్రార గురుంచి వివరిస్తారు. సహస్రారలో ఒకరు ఊరికే ఉండదగ్గ ప్రదేశము ఎందుకు కాదో, దానికి ఆదియోగి ఇంకా నెలవంక చంద్రునికి గల సంబంధమూ, ఇంకా దక్షిణ భారతదేశ దేవాలయాలలోని ప్రజలు తరచూ ఈ పార్శ్వాన్ని ఎలా స్పృశించారో ఆయన వివరిస్తారు.
ప్రశ్న: సద్గురూ, సహస్రార చక్ర మార్గం ఏదో చెబుతారా? అది ఎలా ఉండవచ్చు? ఆ సాంప్రదాయానికి చెందిన వారు ఉదాహరణకు ఎవరైనా ఉన్నారా?
సద్గురు: సహస్రారం ఒక మార్గం కాదు. మార్గం అనే పదం వాడినపుడు, అది హద్దులు నిర్ణయించి నిర్మించిన దారి అని అర్ధం. ఒకవేళ హద్దులు నిర్ణయించవలసి వస్తే, మీకు భౌతికంగా ఖాళీ స్థలం అవసరమవుతుంది. సహస్రారం ఒక భౌతిక స్థలం కాదు. శరీరరూప క్రమంలో దాని ఉనికి ఉంది, కానీ అది భౌతికంగా కాదు. అందువలనే దానికి మార్గం లేదు.
దీని గురించి సంప్రదాయంలో అనేకమైన చిహ్నాలు ఉన్నాయి, అయినా బహుశా తోతాపురి ఇంకా రామకృష్ణ పరమహంసలది ఒక నాటకీయమైన ఉదాహరణ కావచ్చు. సహస్రారలో కొంత అతిగా ఉన్న రామకృష్ణ పరమహంస, ఎక్కువ కాలం శరీరంలో ఉండవలసిన వారు కాదు, ఎందుకంటే శరీరాన్ని పట్టుకొని ఒకరు ఉండడానికి సహస్రార తగిన ప్రదేశం కాదు. అది సహజంగా పారవశ్యమైనది ఇంకా అసాధారణమైనది కనుక అది నివసించే చోటు కాదు, అది “వెళ్ళదగిన” చోటు. ఒకసారి మీరు దానిని స్పృశించి వెనక్కి వచ్చే ప్రదేశం. ఎప్పుడైనా ఒకరు అక్కడ చాలా ఎక్కువ సేపు ఉన్నట్లయితే, శరీరం నిలవలేదు.
రామకృష్ణ పారవశ్యంలో అంతటా తేలిపోయే బదులు సాధారణ స్పష్టత మరియు ఎరుక స్థితికి ఆయనను దింపాలని, తోతాపురి ఒక గాజు ముక్కను తీసుకుని ఆయన యొక్క ఆజ్ఞను కోసినట్లు మీరు వినే ఉంటారు. పారవశ్యంలో అంతటా తేలియాడడం మంచిది కాదా? అది గొప్పదే కాని ఆ పరిస్థితిలో మీరు ఏ పనీ చేయలేరు ఇంకా ఎటువంటి ఆవిర్భావం చేయలేరు. ఆ పరిస్థితి మైకంలాంటిది. అది ఎంతో విస్మయం ఇంకా అస్తిత్వంలో అద్భుతం, కానీ మీరు ఆ స్థితుల్లో మానవ కార్యకలాపాల్లో ఉపయోగకరంగా ఉండలేరు. ఒకవేళ మీరు కార్యోన్ముఖులైనా ప్రభావశీలంగా ఉండలేరు. అది భౌతిక అభౌతికాల మధ్య అస్పష్టమైన ప్రపంచం.
అందుకే సహస్రార గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది, ఎందుకంటే ప్రస్తుతం మేము లక్ష్యంలో ఉన్నాము – మేము అస్పష్టమైన వాటి గురించి కృషి సలపలేము. అక్కడక్కడ, కొంతవరకు సంబంధముంది – మాకు మా భావ స్పందనలు మరియు సత్సంగలు ఉన్నాయి, అయినా మేము ఏది చేయాలో వాటిపై మేము కేంద్రీకరించవలసి ఉంది. ఒకవేళ అందరూ సహస్రారంలో ఉంటే అది సాధ్యం కాదు. ఒకవేళ అందరూ అక్కడే ఉండిపోవడం ఆరంభిస్తే, వారు ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు, వారు వెళ్ళిపోతారు.
సంప్రదాయాలకు సంబంధించిన ఉదాహరణలలో – అటువంటిది ఏమీ జరగలేదు. శివుడు ఎవరికీ దొరకకుండా ఇంకా అందుబాటులో లేని పారవశ్య స్థితిలో ఉంటాడని మీరు వినే ఉంటారు. ఎవరైనా సరే ఎంతో స్పష్టంగా మరియు ప్రబలంగా ఉన్నా, హఠాత్తుగా అంతా మత్తుగా - మైకంగా అయ్యి అందుబాటులో ఉండరు. ఎంతో తీవ్రంగా మరియు ప్రబలంగా ఉన్న శివుడికి కూడా, అతిగా త్రాగితే పనిచేయలేనంత మైకం ఎందుకంటే అది సహస్రారంలో ఉండటం మూలంగానే.
అన్ని దైవ రూపాలలో కెల్లా శివుడు అత్యంత ద్రుడమైనవాడు. దాని అర్ధం ఆయన కార్యాచరణకు ప్రతీక, అయినప్పటికీ ఆయన కూడా సహస్రారంలో ఉండడంవలన, కొన్నిసార్లు మైకం కలుగుతుంది. అందువలనే అది మార్గం కాదు. మిమ్మల్ని మీరు మరచిపోవాలని కోరుకోవడంవలన మీరు సహస్రారకు వెడతారు, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలని కాదు. మిమ్మల్ని వదులుకోవాలని భావిస్తే – సహస్రారం. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరేదో ఒక మార్గంలో ఉండాలి. ఇలా వదులుకోవటానికి సంప్రదాయం ఏదైనా ఉందా? అవును ఉంది, కానీ దాని నుండి మీరు ఒక రూపం ఇవ్వలేరు.
ప్రశ్న: మీ మాటలలో ఒకసారి సోమరేఖని ప్రస్తావించారు. ఈ గీత లక్షణం, దాని ప్రాధాన్యత ఇంకా అనుభవజన్యమైన పార్శ్వము గురించి మీరు వివరించగలరా?
సద్గురు: సోమ అంటే చంద్రుడు లేదా ఒక మైమరపించు రూపం. సోమరేఖ అంటే వారు మూడవరోజు చంద్రుని మార్గాన్ని వెతుకుతారు. భారతదేశంలో సముద్రంనుండి అమృతం రావడమనే ప్రతీక వాదం ఒకటి ఉంది, ఆ క్రియలో భాగంగా శివుడు విషం త్రాగినట్లు మరియు మిగిలివారందరూ అమృతం లేదా జీవసారంను త్రాగి తమను మృత్యుంజయులుగా చేసుకున్నట్లు ఉంది. జీవితానుభవం భౌతికస్థాయికి అతీతంగా ఎదగడం అనే స్పృహతో చూస్తే, అమృతం అంటే మృత్యుంజయ స్థితి. మీ జీవితానుభవం భౌతికస్థాయికి అతీతంగా ఎదిగింది అంటే మీరు ఒక విధంగా మత్యుంజయులే. మృత్యుంజయత్వం అంటే మేము మిమ్మల్ని ఎల్లకాలం భరించాలని అర్థంకాదు, దానికి అర్థం మేము మిమ్మల్ని అసలు భరించవలసిన అవసరమే లేదని, ఎందుకంటే మీ భౌతిక (శారీరక) స్వభావం దాదాపుగా పోయినట్లే.
దానిని చక్రాలు అనే పరిభాషలో పెట్టాలంటే, అదే సహస్రారం. మూడవరోజు చంద్రునిగా మీరు చూసేది ఈ చుక్కనే. శివుని సహస్రారం నుండి అమృతం చుక్కలు మూడు పడ్డాయి, అందరూ దానిని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దానిని ఒక ఆభరణంగా ధరించారు. ఇది ముఖ్యమైనది. ఆయన దానిని తలపై ఆభరణంగా ధరిస్తున్నారు. అంటే అక్కడ పారవశ్య ప్రభావం ఎల్లవేళలా ఉంటుంది కానీ ఆయన అందులో మునిగిపోలేదు. కొన్నిసార్లు ఆయన దానిలోనికి వెళ్ళినా కానీ అక్కడ పారవశ్య ప్రభావం ఎప్పుడూ ఉంటుంది.
ఒకవేళ ఈ పారవశ్య ప్రభావం లేకపోతే, ఎవరూ స్థిరంగా ఉండలేరు. బయట ఏమీ చేయవలసిన అవసరం లేకుండా, ఆహ్లాదంకై వెతికే లేదా నెరవేర్చే అవసరం లేకుండా ఒకరు ఇక్కడ ఊరికే కూర్చోవచ్చు. దాని అర్ధం మీరు మందంగా ఝంకారం చేసినట్లు. ఒకవేళ మీరు పూర్తిగా అందులో మత్తెక్కేలా మునిగితే, అప్పుడు మీరు ఇక పనికిరారు. నా ఉద్దేశ్యం ప్రాపంచిక విషయాలలో, జీవితానికి సంబంధించి కాదు. జీవితం విషయంలోనైనా అది పరవాలేదు. కానీ ప్రాపంచిక కర్మల విషయాలలో, మీరు అసమర్థులు కాగలరు. కానీ పారవశ్య ప్రభావంతో మీరు ఎన్నైనా పనులు చేయవచ్చు అయినా మీరు ఏమీ చేయనట్లే అనిపిస్తుంది. అది ఎలా అంటే జనం కొద్దిగా త్రాగి, పారవశ్య ప్రభావంతో వాళ్ళ కాళ్ళు పడిపోయేవరకు నాట్యం చేస్తూ ఇంకా నాట్యంచేస్తూ ఇంకా చేస్తూనే ఉంటుంటారు. వేరే సమయాలలో వారు అలా చేయలేరు. కొంత పారవశ్య ప్రభావం ఉంది కనుక, మీరు నాట్యం లేదా పని లేదా ఏదైనా సరే అందులో ఏ శ్రమ లేదన్నట్లు అనిపించేలాగ చేస్తారు. ఎల్లప్పుడూ పారవశ్య ప్రభావంతో ఉండే ఆదియోగి దీనికి ప్రతినిధి.
మనం ఒక ప్రత్యేకమైన రూపాన్ని తయారు చేసినపుడు – అన్ని లింగాలు కాదు కానీ చాలావరకు – అవి సక్రమంగా చేయబడితే, అక్కడ పారవశ్య ప్రభావం ఉంటుంది. మీరు ఈ పారవశ్య ప్రభావం మీలోకీ ఇంకా ప్రతిష్టించిన రూపాలలోకి తీసుకురాకపోతే, అప్పుడు అక్కడ ఉత్తేజం ఉండదు. నేను అక్కడ ఉత్తేజం లేదు అన్నానంటే, ప్రజలు ఒక రూపంయొక్క ప్రభావానికి లోబడలేరు – వాళ్ళకు ఏవి అవసరమో వాటి గురించే వాళ్ళు ఆలోచిస్తుంటారు.
భారతదేశంలో బాగా ప్రతిష్టింపబడిన చాలా దేవాలయాలలో ఇది జరుగుతోంది. ప్రజలు అక్కడికి వెళ్ళి ప్రార్ధించి అన్ని రకాలైన కోరికలు కోరాలనే ఉద్ధేశ్యంతో వెడతారు, కానీ వారు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఈ అనవసరమైనవన్నీ మరచిపోయి ఊరికే నిలబడతారు. ఇది పారవశ్య ప్రభావం వలన జరుగుతుంది.
ప్రతిష్టించిన రూపం యొక్క నీడ – నీడ అని నేను అన్నప్పుడు, అక్షరాలా వెలుగు నీడలు అనే అర్ధం తీసుకోవద్దు – ఒక విధంగా, రూపం యొక్క శక్తినీడ సహజంగా అక్కడ నేలపై ఉంటుంది. దానికి గుర్తు పెడితే, ప్రజలు దానిని అనుసరించవచ్చు. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో మాత్రమే ప్రజలు ఇంకా ప్రదోషం అనే, మూడవరోజు చంద్రుడు గురించి క్రియాశీలంగా ఎరిగి ఉన్నారు.
దక్షిణాన ప్రజలే ఈ స్పృహ కలిగి ఉండడానికి కారణం మేము అగస్త్యమునికి రుణపడి ఉండడం. ఆయన ప్రజలతో స్నేహభావంతో మాట్లాడుతూ అనేకమైన విషయాలు చెప్పేవారు! వారిపై ఆయనకుగల ప్రేమతో మాట్లాడుతూ, స్పర్శిస్తేనే పరవశం కలిగే కొన్ని ప్రదేశాలున్నాయి అని వారికి చెప్పారు. అందువలన ప్రజలు దానినుండి ఒక సంప్రదాయం తయారు చేసుకుని, దానిని అనుసరించాలనుకునేవారు. ఈ విధానం దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళలలో భాగమైన దేవాలయాలలో ఇంకా ప్రబలంగానే ఉంది. ఈ ప్రదేశాలలో మాత్రమే దీని గురించి ప్రజలకు తెలుసును – వ్యక్తిగతంగా ఎరుగక పోవచ్చు కానీ సాంప్రదాయంలో అది ఉంది.
దీనిని ప్రజలు తమంతట తామే కనిపెట్టారని నేను అనుకోవడంలేదు. ఎపరో ఒకరు దాని గురించి మాట్లాడి ఉంటారు. అగస్త్యుడిని దీనికి నెపంగా పెట్టగలం లేదా మరో యోగైనా మాట్లాడి ఉండవచ్చు, ఎందుకంటే రూపం తయారు చేసినవారికి, అందుకు సంబంధించిన ఇతర అంశాలు వృధా కావడం ఇష్టం ఉండదు కనుక, సాధారణంగా దాని గురించి మాట్లాడరు. అది చిన్నపిల్లవాడికి ఆహారం, తీపి మిఠాయిలు పంచి పెట్టినట్లు. అతడు తీపి ఒకటే తినవచ్చు. ఇందుకనే భారతదేశంలో, మేము భోజనం అయిన తరువాతనే తీపి పదార్ధాలు వడ్డిస్తాము. ఆరంభంలోనే వడ్డించేవాళ్ళు కొంచెం రుచి చూపించటానికి సగం చెంచాడు పాయసం వేస్తారు, ఎందుకంటే చివరిలో మళ్ళీ పాయసం వడ్డిస్తారన్న ఆశతో భోజనం బాగా భుజిస్తారని. వడ్డించిన ఇతర పోషక పదార్ధాలన్నీ మీరు తిన్నాక, చివరిలో వాళ్ళు మళ్ళీ పాయసం వడ్డిస్తారు, కానీ అప్పటికే మీ కడుపు ఎంతగా నిండిపోతుందంటే మీరు ఎక్కువగా తీపి తినలేరు!
అదేవిధంగా, ఒకవేళ మీరు ప్రజలకు ఎక్కడైనా పారవశ్య ప్రభావం ఊరికే చూపిస్తే, ప్రజలు దానిని ఊరికే అనుసరిస్తూ మిగిలినదంతా మర్చిపోవచ్చు. నేను చెప్పినట్లు, మీరు దీంట్లో స్థిరత్వంగా ఉండి ఇంకా అందులో పారవశ్య ప్రభావంతో ఉంటే, అది అద్భుతం. కానీ పారవశ్యం ఒకటే కావలిస్తే, అది కూడా అద్భుతమే కానీ కొంచెం ఎక్కువ మోతాదవుతుంది. ఇంకా మీరు వాస్తవంనుంచి చపలచిత్తమైన స్థితికి వెళ్ళవచ్చు. మీకు ఈ స్థితి అధ్బుతంగానే ఉండొచ్చు కానీ అది ఈ ప్రాపంచికంలో స్థిరత్వంగా ఉండేట్లు చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని చేయవలసినవి ఉన్నాయి కనుక.