మనుషులపై పౌర్ణమి చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుంది?
మానవులపై, ఇంకా మానవుల నిద్రా, మానసిక స్థితీ ఇంకా మానసిక ఆరోగ్యాలపై చంద్రుడు చూపే ప్రభావం గురించి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రంగంలో ప్రముఖులైన డాక్టర్. హోరాషియో డే లా ఇగ్లేసియ, చంద్రుడు చూపే ప్రభావం గురించి సంభాషిస్తున్నారు, అలాగే సద్గురు నుండి ఈ విషయంపై యోగిక దృక్పధాన్ని తెలుసుకుంటున్నారు. డాక్టర్. హోరాషియో, వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఓ రీసెర్చ్ అసోసియేట్ గా ఇంకా బయాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈ సంభాషణని, వండెర్బిల్ట్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రోఫెసర్, ఇంకా బ్రిఘం అండ్ విమెన్స్ హాస్పిటల్ లో రీసెర్చ్ అసోసియేట్, అలాగే హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో కూడా రీసెర్చ్ అసోసియేట్ అయిన డాక్టర్ డేవిడ్ వాగోచే నిర్వహించబడింది.
విషయ సూచిక :
- శాస్త్రవేత్తలు తెలుపుతున్న ఇటీవలి పరిశోధనా ఫలితాలు
- మానవులపై చంద్రుని ప్రభావం
- మన నిద్రపై చంద్రుని ప్రభావం ఉంటుందా?
- యోగాలో సూర్యుచంద్రులను ఎలా చూస్తారు?
- చంద్రుని దశలు యోగ సాధనలను ప్రభావితం చేస్తాయా?
- మీ మానసిక స్థితిపై చంద్రుని ప్రభావం ఉంటుందా?
- పౌర్ణమి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందా?
శాస్త్రవేత్తలు తెలుపుతున్న ఇటీవలి పరిశోధనా ఫలితాలు
డాక్టర్ డేవిడ్ వాగో: డా. హోరాషియో ఈ మధ్యనే, వేరు వేరు పరిస్థితులలో, చంద్రుని దశకి అనుగుణంగా మనుషుల నిద్రలో చోటుచేసుకునే మార్పులను గురించి ఒక రీసెర్చ్ పేపరు వ్రాశారు. దాని గురించి మరింత చెబుతారా?
డాక్టర్. హోరాషియో : కొన్ని నిద్రా ప్రయోగశాలలో చేసిన అధ్యాయనాలలో, మన నిద్ర యొక్క ఎలెక్ట్రోయెన్సుఫాలోగ్రాఫ్ రికార్డింగ్స్ పైన చంద్రుని ప్రభావం ఉండటాన్ని వారు కనుగొన్నారు. “వ్యక్తిగత స్థాయిలో చంద్రుని దశను బట్టి వ్యక్తి నిద్రలో మార్పులు చోటుచేసుకుంటాయా?” అనే ప్రశ్నకు సమాధానం కోసం మేం పరిశోధన చేశాం. వాస్తవానికి మార్పులు చోటుచేసుకుంటున్నాయని మేం కనుగొన్నాము.
మానవులపై చంద్రుని ప్రభావం :
డాక్టర్ డేవిడ్ వాగో: మానవ శరీర పనితీరులో చోటు చేసుకుంటున్న ఈ మార్పుకీ, ఇంకా ఆ రెండింటి ద్రవ్య రాశికీ మధ్య ఏమైనా సంబంధం ఉందా?
డాక్టర్. హోరాసియో : ప్రతి పదిహేను రోజులకీ, పౌర్ణమి అమావాస్య సమయాలలో, సముద్రపు ఆటుపోట్లు, సాధారణ గరిష్టానికంటే ఎక్కువగా, అలాగే సాధారణ కనిష్టానికంటే తక్కువగా ఉండటాన్ని గమనించాం, ఎందుకంటే ఆ రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి సమలేఖనమయ్యేలా ఒకే అక్షం మీదకి వస్తాయి. సూర్యుడి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అదనంగా జోడవుతుంది, అందువల్ల పెద్ద పెద్ద అలలు వస్తాయి. కానీ ఇంతవరకు, మానవులు గురుత్వాకర్షణలో చోటుచేసుకునే ఆ మార్పులను కనుగొన్నట్టు ఏ రుజువులూ లేవు. ఈ మార్పులకు మనవద్ద ఇది తప్ప వేరే వివరణ లేదు. ఎందుకంటే, అసలు చంద్రుని వెలుగును పసిగట్టే అవకాశం కూడా లేని ప్రదేశంలో, చంద్రుని దశను బట్టి మనుషులలో మార్పులు చోటు చేసుకోడాన్ని మేం మా పరిశోధనలో కనుగొన్నాం.
నిద్రపై చంద్రుని ప్రభావం ఉంటుందా?
డాక్టర్. హోరాసియో: ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పౌర్ణమికి ముందటి రాత్రులలో, నిద్ర ఆలస్యంగా మొదలవుతుంది, ఇంకా నిద్రా సమయం తక్కువగా ఉంటుంది. అత్యంత తక్కువ నిద్రా సమయం, పౌర్ణమికి మూడు నుండి ఐదు రోజుల ముందు చోటు చేసుకుంటుంది. ఆ రోజులలో, సాయంకాలం, పొద్దు పోయాక ఇంకా రాత్రి మొదలయ్యే సమయంలో కూడా వెన్నెల కాస్తుంది. అలాగే మనం, వెన్నెల వల్ల కలిగే ప్రయోజనాన్ని చూసినట్లయితే, వేటాడి పోగు చేసుకుని జీవించే మన పూర్వీకుల విషయంలో, వెన్నెల ప్రభావం వల్ల మధ్యరాత్రిలో లేవటం కంటే, వెన్నెల కాస్తుండగా పగటి పూట చేసే పనులను కొనసాగించటం అనేది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
నాడీ వ్యవస్థలో చోటుచేసుకున్న ఈ అభివృద్ధి, మనలోని అత్యంత ముఖ్యమైన అంశం. అలాగే మన నాడీ వ్యవస్థ ఎంత ఉత్తేజంగా, చురుకుగా ఇంకా సమతుల్యంగా ఉంటుంది అనేదానికీ ఇంకా చంద్రుని దశలకీ మధ్య సరాసరి సంబంధం ఉంది.
మరోలా చెప్పాలంటే, ఒకవేళ వెన్నెల ఉదయం మూడింటికి కాస్తే, బహుశా మీరు నిద్రలో ఉంటారు, అలాగే ఆ వెన్నెలకు మీరు స్పందించరు; అది మిమ్మల్ని నిద్ర లేపదు. అయితే, మీరు రాత్రి ఎనిమిదింటికి పడుకుందాము అనుకున్నారనుకుందాం, ఉన్నట్టుండి మీరు కాంతివంతమైన వెన్నలని చూసినప్పుడు, మెలుకువగా ఉండి, మీరు చేస్తున్న పనిని కొనసాగించే అవకాశం ఉంది. అలాగే ఈ రోజుల్లో కృత్రిమ వెలుగుతో మనం చేస్తున్నది కూడా సరిగ్గా అదే - చాలా వరకూ మనం దాన్ని మన సాయంకాల పనిని పొడిగించడం కోసం వాడుతున్నాం.
ఈ రోజుల్లోని కృత్రిమ కాంతి మన పూర్వీకుల రోజుల్లోని చంద్రకాంతి స్థానాన్ని భర్తీ చేసిందని అనుకోవచ్చు. కానీ గురుత్వాకర్షణ గురించి మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి వస్తే, మీరు అనుకునే దృష్టికోణంలో గురుత్వాకర్షణ శక్తి వల్లనే మీరు రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారు అని మీకు అనిపిస్తుంది.
డాక్టర్ డేవిడ్ వాగు: కానీ ఆ డేటా స్పష్టంగా లేదు కదా, అవునా?
డాక్టర్. హోరాసియో: ఇప్పటివరకూ, మనుషులు ఈ గురుత్వాకర్షణలో వచ్చే మార్పులకు స్పందిస్తున్నట్టు ఏ విధమైన శారీరక సంబంధమైన ఆధారాలూ లేవు.
యోగాలో సూర్యుడు ఇంకా చంద్రులను ఎలా చూస్తారు?
డాక్టర్ డేవిడ్ వాగు: సద్గురు, యోగిక దృక్పథం నుండి, మీరు కొంత విశదీకరిస్తారా. స్పష్టంగా, మన శరీరం పై చంద్రుడు ఏ విధంగా ప్రభావం చూపుతాడన్నదానిపై ఎన్నో చారిత్రాత్మక వివరణలున్నాయి. కానీ, రెండు ద్రవ్యరాశులను దగ్గరకు ఆకర్షించే ఈ శక్తులు, మన శరీరం, మనసు పనిచేసే తీరుపై ఖచ్చితంగా ఏ విధంగా ప్రభావం చూపుతాయో, ఆధునిక శాస్త్రం దగ్గర ఏ రుజువులూ లేవు.
సద్గురు: ఈ విషయాన్ని యోగ దృక్పథం నుండి చూస్తే, యోగాలో ఓ ముఖ్యమైన అంశం ఏంటంటే హఠ యోగ. హ అంటే సూర్యుడు. ఠ అంటే చంద్రుడు. హఠ అంటే ఈ రెండు శక్తుల మధ్య సమతుల్యాన్ని తీసుకురావడం. సూర్యుడు, చంద్రుడు ఇంకా భూమి, ఈ మూడూ ఈ గ్రహంపైనున్న జీవంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఈ విషయంలో మగవారిలో కొద్దిగా అయోమయం ఉండొచ్చు. కానీ ఆడవారు ఎప్పుడూ కూడా చంద్రుని చక్రాలతో సమన్వయంలో ఉంటూనే వచ్చారు. అదే ప్రస్తుతం మన జననానికి మూలాధారం కూడా.
మేము చంద్రుడు మనపై కేవలం గురుత్వాకర్షణ పరమైన ప్రభావాన్ని మాత్రమే చూపుతాడన్నట్టుగా చూడము. మేము చంద్రుణ్ణి, భూమి, సూర్యుని చుట్టూ తన కక్ష్యలో తిరుగుతూ ఉండేలా పట్టి ఉంచేది ముఖ్యంగా చంద్రుడే అని చూస్తాం. ఇవాళ ఆధునిక శాస్త్రాలు, భూమికి ఉపగ్రహం అయిన చంద్రుడు, ప్రతి సంవత్సరం దూరం దూరంగా వెళుతున్నాడని ధ్రువీకరిస్తున్నాయి, అదొక స్థాయిని దాటి దూరంగా వెళ్లినప్పుడు, ఈ గ్రహం మీద ఉన్న జీవంపై దాని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మానవ పునరుత్పత్తి చక్రాలు, సాధారణ చక్రాలనుండి గాడి తప్పుతాయి, ఆపై మెల్లగా మానవులు అంతరించిపోతారు. కానీ అన్నింటికి మించి, చంద్రుడు వెళ్లిపోతే, కొన్ని బిలియన్ల సంవత్సరాలకి అది వెళ్ళిపోతుంది కూడా, అప్పుడు భూమి దాని కక్ష్యలో అది కొనసాగలేదు. అది ముక్కలు ముక్కలుగా విచ్చిన్నం అవుతుంది. యోగా వ్యవస్థ దీన్ని ఈ విధంగా చూస్తుంది.
చంద్రుని దశలు యోగసాధనలను ప్రభావితం చేస్తాయా?
సద్గురు: భారతదేశంలో చాలావరకు పంచాంగం వాడతారు. ఆడవారి పెత్తనం ఉన్నా ప్రదేశాలలో, చంద్రమాన క్యాలెండర్ వాడతారు. అలాగే మగవారి పెత్తనం ఉన్న ప్రదేశాలలో లూనీ సోలార్ క్యాలెండర్ వాడతారు. అంటే అది సూర్య చంద్రుల చక్రాలు రెండింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. మేం క్యాలెండర్ అన్నప్పుడు కేవలం విషయాలకు సంబంధించిన అంకెల చిట్టాను మాత్రమే చూడడం లేదు, ఆ విషయాలను మనలో మనం ఎలా అనుభూతి చెందుతాము, అలాగే వేరు వేరు సమయాలలో మన శరీరం ఏ విధంగా స్పందిస్తుందో పరిగణనలోకి తీసుకోబడతాయి.
మీరు ధ్యాన పరులైతే, మీరు మరింత ధ్యాన స్థితికి చేరుతారు. మీకు మానసిక అనారోగ్యం ఉంటే, అది పెరుగుతుంది. పున్నమి చంద్రుడు వల్ల, మీలో ఏ గుణం ఉంటే, అది హెచ్చించ బడుతుంది.
తదనుగుణంగా, భూమి శక్తి నుండి, దాని కక్ష నుండి, ఇంకా దాని ఉత్తర ముఖం ఏ వైపుగా ఉందన్న దాని నుండి, అలాగే అది సూర్యునికెంత దగ్గరగా ఉందన్న దాని నుండి, అత్యుత్తమమైన ప్రయోజనాలు పొందడం కోసం, రకరకాల సాంప్రదాయాలు, ఆచారాలు, ఇంకా క్రతువులు రూపొందించబడ్డాయి. ఇక్కడ చేసే అనేక విషయాలలో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోబడి ఉంటాయి.
ఒక సూర్య చక్రం 4356 రోజులు అంటారు, అలాగే ఈ చక్రం వేరువేరు ప్రజలకు వేరు వేరు విధానాలలో విభాగించబడింది. ఆ విభజన యోగులకు, సన్యాసులకు, గృహస్థులకు, ఇంకా దయినందన జీవితంలో ఉండేవారికీ వేరు వేరుగా ఉంటుంది. ఎందుకంటే వారి శరీరాలు వేరు వేరు విధానాలలో నిర్మాణమయి ఉంటాయి. అవి వేరు వేరు విధంగా పని చేయాల్సుంటుంది. ఈ క్యాలెండరు, చంద్రుని దశలను ఇంకా సూర్యుని చుట్టూ భూమి ఉన్న స్థానాన్ని ఆధారం చేసుకుని రూపొందించబడింది. కాబట్టి రోజువారీగా, చంద్రుడు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాడు? అంటే, అది కేవలం వెన్నెల మాత్రమే కాదు - ఈ రోజుల్లో, జనాలు విద్యుత్ ఆవేశం, విద్యుత్ అయస్కాంత ప్రభావం, ఇంకా ఇతర అంశాలు అంటూ శాస్త్రీయ పదజాలం వాడుతున్నారు. ఆ విషయంలో నేను నిష్ణాతుడిని కాదు, కానీ యోగ వ్యవస్థలో, మేం అమావాస్య, పౌర్ణమి రోజులకు ఎంతో ప్రాముఖ్యతనిస్తాం. ఆ రోజుల్లో, మేం వేర్వేరు రకాల సాధనలు చేస్తాం.
సన్యాసులు సాధారణంగా అమావాస్య రోజున సాధన చేస్తారు, అయితే కుటుంబ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు పౌర్ణమి రోజున సాధన చేస్తారు. ఎందుకంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ఒకానొక సమయంలో మనం ఎన్నో రకాల ఉపకరణాలు సృష్టించాం - ఉదాహరణకి, పౌర్ణమి రాత్రిన మీ వెన్నెముకను ఓ నిర్దిష్ట విధానంలో దానిపై వెన్నెల పడేలా ఉంచడం. ఇలా మూడు పున్నములు చేస్తే, అది మీ వ్యవస్థను, పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తుంది, అలాగే అనారోగ్యం నుండి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
మీ మానసిక స్థితి పై చంద్రుని ప్రభావం ఉంటుందా?
మార్మిక ప్రపంచంలో, మానవ గ్రహణశక్తి, ఇంకా చంద్రుడు నేరుగా ముడిపడి ఉంటాయి. ఆదియోగి తన తలపైన నెలవంకను ఓ ఆభరణంగా ధరిస్తాడు. ఇది ఆయన అత్యున్నత స్థాయి గ్రహణ శక్తి కలిగి ఉన్నాడని సూచిస్తుంది. వైద్యపరంగా, మనం దాన్ని, ఓ స్థాయి నాడీ సంబంధిత ప్రేరణగా గుర్తించవచ్చు. ఈ జీవన పరిణామ క్రమంలో, మనము ఏ గ్రహం మీద అత్యంత బలమైన వారము కాము, కానీ మనకత్యంత సంక్లిష్టమైన, అధునాతనమైన నాడీ వ్యవస్థ ఉంది. అదే మనల్ని అన్నింటికన్నా పైన నిలబెట్టింది.
నాడీ వ్యవస్థలో చోటుచేసుకున్న ఈ అభివృద్ధి, మనలోని అత్యంత ముఖ్యమైన అంశం. అలాగే మన నాడీ వ్యవస్థ ఎంత ఉత్తేజంగా, చురుగ్గా, సమతుల్యంగా ఉంటుంది అనేదానికీ ఇంకా చంద్రుని దశలకీ మధ్య సరాసరి సంబంధం ఉంది. దీన్ని, తమ మానసిక హెచ్చుతగ్గులను సరి చేసుకోవడం కోసం ఉపయోగించుకునేందుకు ఎన్నో విధానాలున్నాయి. ఎందరో తమ వ్యవస్థలో, అలల అలజడికి గురి అవుతారు, ఎందుకంటే ఆ సముద్రమే ఎగసి పడుతుంది. మన శరీరంలో 60 శాతం నీరే. కాబట్టి వ్యవస్థలో కూడా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి.
నిండు పున్నమి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందా?
సద్గురు: కొన్ని పరిశోధనలు, పౌర్ణమి రోజులలో, మానసిక సమతుల్యాన్ని కోల్పోతారని, లేదా మేనియాక్ డిప్రెషన్ ఉన్న వారు పూర్తిగా అదుపు కోల్పోతారని చెబుతున్నాయి. ఈ వెర్రితనాన్ని కలిగించేది చంద్రుడు కాదు; అది కేవలం మీ శక్తిని ఓ విధంగా నెడుతుంది. మీ స్వభావం ఆనందంగా ఉండడం అయితే, మీరు మరింత ఆనందంగా అవుతారు. మీ స్వభావం ప్రేమ అయితే, మీరు మరింత ప్రేమగా అవుతారు. మీరు ధ్యాన పరులైతే మీరు మరింత ధ్యాన పరులవుతారు. మీకు మానసిక అనారోగ్యం ఉంటే, అదీ పెరుగుతుంది. నీ గుణం ఏదైతే అది పౌర్ణమి కారణంగా మరింతగా పెరుగుతుంది.
Editor's Note: ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి పౌర్ణమి రాత్రులు ధ్యానానికి అనుకూలిస్తాయి. ఎందుకంటే అపుడు ప్రకృతి అదనపు శక్తిని ఉచితంగా అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక అన్వేషకులు పౌర్ణమి రాత్రిన గల సంభావ్యతలను అందుకునే వీలు కల్పించేలా, సద్గురు నెలవారీ ఆన్లైన్ పౌర్ణమి సత్సంగాన్ని అందిస్తున్నారు. ఉచితంగా పౌర్ణమి సరాగాలకు రిజిస్టర్ అవ్వండి.
మెదడు యొక్క ఉపరితల పొర యొక్క స్థూల కార్యాచరణను సూచించే, తలమీదటి ఎలక్ట్రికల్ యాక్టివిటీని, ఎలక్ట్రోఫిజియోలాజికల్ మానిటరింగ్ రికార్డ్ చేస్తుంది.