Click here to purchase "Death: An Inside Story" on Amazon, where it has been on the Bestseller lists ever since its release!

మీరు తీసుకునే ప్రతి శ్వాసతో, మీరు స్మశానానికి చేరువౌతున్నారు. కాని మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాసతో మీరు మీ ముక్తికి కూడా చేరువ కావచ్చు.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-1

ఒకరినొకరు నిజంగా, అమితంగా ప్రేమించుకున్నవారే, తాము ప్రేమించినవారి మరణాన్ని హుందాగా తట్టుకోగలరు.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-2

సకాల మరణమేమీ విపత్తు కాదు. ఎన్నోసార్లు జన్మించడం - అదే నిజమైన విపత్తు.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-3

మీరు అశాశ్వతం అనే ఎరుక మీకు ఎల్లప్పుడూ ఉంటే మీ ఆధ్యాత్మిక అన్వేషణ చెక్కు చెదరకుండా ఉంటుంది.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-4

జీవం ఎంతో, మరణమూ అంతే. ఈ విషయం స్పృహలో ఉంటేనే మీరు జీవితాన్ని పూర్తిగా, శక్తివంతంగా జీవిస్తారు.

​​sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-8

సంపూర్ణంగా జీవించిన వ్యక్తి మాత్రమే హుందాగా మరణించగలడు.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-10

చాలామందికి జీవితం ఇంకా జీవితానుభవం సాపేక్షమైనవి, కానీ మరణం అనేది పరిపూర్ణమైనది. ప్రజలను జాగృతం చేయడానికి మరణం యొక్క పరిపూర్ణత అవసరమవుతుంది.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-6

మరణం - ఒక మహోన్నతమైన విశ్రాంతి. జీవం నడవడానికి ఒకింత బిగుతు అవసరం.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-9

మీ జీవితం ఏ క్షణాన్నైనా తల్లకిందులు అవ్వగలదు అని మీరు తెలుసుకోగలిగితే, మీరు ఈ గ్రహం మీద ఎంతో సున్నితంగా నడుచుకుంటారు.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-7

ప్రజలకు మృత్యువంటే అంత భయం ఉండడానికి ఏకైక కారణం, శరీరానికి మించి ఏమీ తెలియక పోవడమే.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-11

పరిపూర్ణత్వానికి కావలసింది జీవంలోని చైతన్యం, మరణంలోని నిశ్చలత. ఈ సృష్టి తత్త్వమే జీవిస్తున్న మరణం.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-12

మీరు శాశ్వతంగా ఉండిపోయేవారు కాదనే విషయాన్ని, మీరు నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటే, ఈ భూమి మీద కాస్త సున్నితంగా, వివేకంతో నడుస్తారు

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-5

జనన మరణాలు అనేవి జీవం ఒక దశ నుండి మరొక దశలోకి వెళ్ళే మార్గాలు.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-13

మరణం అనేది విశ్వం చేసే పరిహాసం. ఆ పరిహాసాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఆవలకు చేరడం అద్భుతంగా ఉంటుంది.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-14

జీవితం ఎప్పుడూ అనిశ్చితమైనదే. ఖచ్చితమైనది కేవలం మరణం మాత్రమే.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-15

మరణించడానికి సిద్ధంగా ఉన్న వారే సంపూర్ణంగా జీవించగలరు

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-16

మరణం ఎరుకలేనివారు సృష్టించిన కట్టు కధ. ఉన్నది కేవలం ఒక స్థితినుంచి మరొక స్థితికి మారే జీవం, జీవం, జీవం మాత్రమే.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-17

మీరు అమరులు కాదన్న విషయం మీకు ఎప్పుడూ స్పృహలో ఉంటే, మీకూ ఇంకా మీ చుట్టూ ఉన్న వారికి ఏది ఆవశ్యకమో అది తప్ప మరేదీ చేయరు.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-18

మనం పుట్టుకని జరుపుకున్నట్టు, మరణాన్ని కూడా ఒక పండుగలా జరుపుకోలేకపోతే, మనం జీవితాన్ని తెలుసుకోలేము.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-19

మరణం అనేది మన జన్మలో ఒక్కసారే జరుగుతుంది. మనం దానిని బాగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-20

మనకు జీవించి ఉన్నవారి పట్ల బాధ్యతలు ఉన్నట్లుగానే మరణించినవారి పట్ల కూడా బాధ్యతలు ఉంటాయి. మరణించిన కొద్దికాలం తరువాత వారిని ప్రభావితం చేసేందుకు మనకు అవకాశం ఉంటుంది.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-21

Editor's Note: Click here to purchase "Death: An Inside Story" on Amazon, where it has been on the Bestseller lists ever since its release!