తేనె మీకు మంచి చేస్తుందా? సరైన విధానంలో తీసుకుంటే, అవును చేస్తుంది. ఇది వ్యవస్థకి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది, మరి ముఖ్యంగా ప్రసరణ వ్యవస్థకి. కాబట్టి తేనె మీకు అసలు ఏ విధంగా మంచి చేస్తుంది, దాన్ని తీసుకోవడానికి సరైన పద్ధతి ఏంటి? యోగి, మార్మికుడు అయిన సద్గురు ఏమంటారో చూద్దాం.

సద్గురు:తేనె యొక్క రసాయన కూర్పు మానవ రక్తానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. అలాగే మీరు దాన్ని అలాగే తీసుకుంటున్నారా లేదా చన్నీటితో తీసుకుంటున్నారా, లేదా గోరువెచ్చని నీటితో తీసుకుంటున్నారా అన్న దాన్ని బట్టి, అది వ్యవస్థపైన వేర్వేరు ప్రభావాలను చూపుతుంది.

గుర్తుంచుకోండి

తేనెని ఎప్పుడూ కూడా వంటలో వాడకూడదు, మరిగే నీటిలో వేయకూడదు. నీరు గోరువెచ్చగా ఉండాలి అంతేగాని మరిగేంత వేడిగా ఉండకూడదు. ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి తేనెని ఇవ్వకూడదు.

తేనె మీకు ఏ విధంగా మంచి చేస్తుంది

#1 తేనె రక్తహీనతను ఎదుర్కుంటుంది

రక్తంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత కలుగుతుంది. రక్తంలో తగినంత ఐరన్ లేనప్పుడు, మనిషికి అలసిపోయినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే రక్తం ద్వారా ఆక్సిజన్ ను సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. మీకు తగినంత ఆక్సిజన్ లేకపోతే - మీ గుండె, మీ మెదడు, మీ శరీరంలోని ప్రతిదీ కూడా తక్కువ స్థాయిలో పనిచేస్తాయి. కాబట్టి రక్తంలో ఆక్సిజన్ ను పెంచటం అనేది చాలా ముఖ్యం. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, తనని తాను ఎంత సునాయాసంగా పునరుద్ధరించుకుంటుంది అన్నది రక్తంలోని ఆక్సిజన్ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. మరిముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషుల కంటే స్త్రీలు చాలా తేలికగా రక్తహీనతకు గురవుతారు.

Red Blood Cells

రక్తహీనతను ఎదుర్కోవడానికి తేనె చాలా మంచిది. మీరు రోజూ కొద్దిగా తేనెని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకున్నట్లయితే, మీరే చూస్తారు, క్రమంగా ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఒకసారి రక్తంలో మరింత ఆక్సిజన్ ఉన్నాక, మీకు చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి కణాల పునరుద్ధరణ పెరుగుతాయి, శరీరం, మనసులో తామసత్వం తగ్గుతుంది. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా వ్యాకులతకు లోనవ్వటానికి గల కారణాలలో ఒకటి ఏంటంటే, వారికి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ స్థాయి మరీ తక్కువగా ఉంటే, చాలా తేలికగా వ్యాకులతకు లోనవుతారు.

#2 తేనె రక్తపోటులో సమతుల్యాన్ని తెలుస్తోంది

ఒక్కసారిగా నుంచోగానే కొంచెం మైకం వచ్చినట్లుగా అనిపించే వారిలో మీరూ ఒకరు అయితే, మీకు లో-బీపీ ఉండి ఉండవచ్చు. అంటే తగినంత రక్తం లేదు అని, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మెదడుకి తగినంత ఆక్సిజన్ అందటం లేదు అని. మీరు తల వంచినప్పుడు మైకంగా అనిపిస్తే, అది మీకు హై-బీపీ ఉన్నందువల్ల అయి ఉండవచ్చు. హైబీపీ వల్ల, లేదా ఆక్సిజన్ లోపం వల్ల మీకు అలా మైకంగా అనిపిస్తుంది.

తేనెని తీసుకోవడం అనేది ఈ అసమతుల్యతలను సరిచేస్తుంది. శరీరం అవసరానికి అనుగుణంగా, రక్తపోటు పెరుగుతుంది. ప్రజలు అధిక రక్తపోటు ఒక రోగం అనుకుంటారు. లేదు అది రోగం కాదు. అది కేవలం శరీరం చేసుకునే ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఏదైనా కారణం వల్ల, శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అయినట్లయితే, అదే విధంగా ఇతర పోషకాలు ఎక్కువగా అవసరం అయినట్లయితే, లేదా రక్తం అది ఉండవలసినంత నాణ్యతను కలిగి ఉండకపోయినా, అప్పుడు త్వరితంగా సరఫరా చేయడం లేదా అవయవాలకు మరిన్ని ఎక్కువ సార్లు సరఫరా చేయడం అనేది అవసరం అవుతుంది, కాబట్టి వ్యవస్థ మరింత గట్టిగా పంపిణీ చేస్తుంది, అప్పుడు రక్తపోటు పెరుగుతుంది.

లోబీపీ విషయానికి వచ్చేసరికి, వ్యవస్థ తక్కువగా సరఫరా చేసే విధంగా తనను తాను సరి చేసుకుంటుంది. లేదా అది పుట్టుకతో వచ్చేది కావచ్చు - వ్యవస్థ అవసరమైన విధంగా సరఫరా చేయడానికి తగినంత బలంగా ఉండదు. లేదా ప్రసరణ ప్రక్రియలో మరేదైనా సమస్య ఉండి ఉండవచ్చు. తరచుగా, ఇలాంటి అనేక అంశాల కలయిక ఇటువంటి పరిస్థితిని కలిగిస్తుంది. అలాగే అధిక రక్తపోటు విషయంలో కూడా, అది రెండో స్థాయి పర్యవసానాలను కలగజేస్తుంది, కానీ మొదటి స్థాయి పర్యవసానం అధిక రక్తపోటే - అది ఒక పర్యవసానమే కానీ, అది కారణం కాదు.

#3 తేనె మీకూ ఇంకా మీ యోగాకూ కూడా మంచిది!

యోగ సాధనలు చేస్తున్నవారికి, ముఖ్యంగా తేనెని తీసుకోవడం అనేది చాలా మంచిది. ఒక యోగ సాధకునికి, కొన్ని విధాలుగా తన శరీర పరిమితులను దాటి పనిచేసేలా చేస్తున్న అతనికి, ప్రసరణ వ్యవస్థని ఇంకా రక్తం యొక్క రసాయనికతని సమతులనంలో ఉంచుకోవటం అనేది ఆవశ్యకమైన విషయం. రోజూ తేనెని తీసుకోవడం అనేది, ఆ సమతుల్యాన్ని తీసుకువస్తుంది, మిమ్మల్ని ఉత్తేజంగా చేస్తుంది. మనం తేనెని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి, ఎందుకంటే మనం వ్యవస్థని తెరుచుకునేలా చేయాలి అనుకుంటున్నాము కాబట్టి.

యోగా అనేది శరీరానికి సంబంధించిన ఈ చిన్న చిన్న విషయాలను తెలుసుకోవడం గురించే. మీరు ఇటువంటి చిన్న చిన్న విషయాలను ఎన్ని ఎక్కువ తెలుసుకుంటారో, మీ జీవితం అంత చక్కగా అవుతుంది. లేదంటే అది ఒక స్థూలమైన ఉనికి అవుతుంది - ఊరికే తినడం, నిద్రపోవడం, చనిపోవడం.

ఈ వ్యాసం ఫారెస్ట్ ఫ్లవర్ యొక్క మార్చి 2014, సంచికలోని సారాంశం ఆధారంగా రూపొందించబడింది, అది “మీకు నచ్చినంత చెల్లించి పొందండి.” అనే ధరకు లభ్యమవుతుంది (ఉచితంగా పొందడానికి ప్రైస్ వద్ద ‘0’ అని టైపు చేయండి). ప్రింటెడ్ పుస్తాకాల సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.