కాలభైరవ కర్మ - చనిపోయిన వారికోసం ఒక ప్రక్రియ
ఎవరికైనా తన మరణాన్ని సరిగ్గా నిర్వహించుకునే అవగాహన లేకపోతే, యోగ సంప్రదాయంలో చనిపోయినవారికి సహాయం చేయడం కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. సద్గురు అటువంటి రెండు పద్ధతులు- కాలభైరవ కర్మ ఇంకా కాలభైరవ శాంతి గురించి మనకు వివరిస్తున్నారు.
కాలభైరవ కర్మ అంటే ఏంటి?
సద్గురు:ఈ ప్రక్రియను ‘కాలభైరవ కర్మ’ అని అంటాము. ఇది చనిపోయిన వారి కోసం. వారి కొత్త ప్రదేశం మెరుగైనదై ఉండేందుకు. ఎవరైనా చనిపోతే, మీరు అతనికలేడు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు మాత్రం, కేవలం అతని శరీరం, ఇంకా తను జీవితమని అనుకున్నదంతా పోయింది. ఎప్పుడయితే తను శరీరాన్ని కోల్పోయాడో, తన విచక్షణ జ్ఞానాన్ని కూడా అతడు కోల్పోతాడు. విచక్షణను కోల్పోవడం అంటే ఏమిటి? ఉదాహరణకు మీకు తెలిసిన వారెవరో చనిపోయారనుకుందాం. మీరు విచారంతో, బాధతో ఉన్నారు. బహూశా కొంత సమయం ఈ విచారం కొనసాగొచ్చు, కానీ కొంత కాలం గడిచాక మీరు మీలోని విచక్షణను ఉపయోగించి “ఇలా ఎప్పటికీ ఉండడంలో అర్థం లేదు, నేను చేయాల్సిన వాటి పైన తిరిగి దృష్టి పెట్టాలి” అని తెలుసుకుంటారు. కానీ ఎవరైతే ఈ విచక్షణను ఉపయోగించలేరో, వారు అదే స్థితిలో చాలా కాలం కొనసాగుతారు, ఎందుకంటే వారిలో విచక్షణ బుద్ధి పనిచెయ్యడం లేదు. కనుక అతని ధోరణులు ఎలా ఉంటాయో, అవి మరింత ఎక్కువ అవుతాయి. తనలో ఆహ్లాదకరమైన ధోరణులు ఉంటే అవి మరింతగా పెరుగుతాయి. ఒకవేళ అతనిలో బాధాకరమైన ధోరణులు ఉంటే అవి మరింత తీవ్రమైన బాధగా మారతాయి.ఎక్కడా, ఏ మతం అనే దానితో సంబంధం లేకుండా, ప్రతీ సంస్కృతికీ ఈ అవగాహన ఉంది- ఒక మనిషి చనిపోతున్నప్పుడు, అతను ఎవరైనా గానీ, మీరతనికి తప్పకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలి. మీ శత్రువు చనిపోతున్నప్పటికీ, ఆ ఒక్క క్షణం మీరతనికి విచారం కలిగించకూడదు. కాబట్టి మరణం చివరి క్షణంలో గానీ లేదా చనిపోయిన కొద్ది రోజుల్లో, మనం ఆ జీవంలోకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రవేశ పెట్టొచ్చు. ఒక్కసారి ఇలా ఆహ్లాదం ఇవ్వబడితే, అది ఒక చుక్క ఆహ్లాదం అయినా సరే- మీరు అతనిలోకి ప్రవేశపెడితే, కొంతకాలం తరువాత అది సముద్రమంత ఆహ్లాదంగా మారిపోతుంది, ఎందుకంటే అతనికి విచక్షణ లేదు, అతడు దానిని ఆపలేడు.
కాలభైరవ శాంతి ప్రక్రియ అంటే ఏమిటి?
50 ఏళ్ళు పైబడి సహజ మరణం పొందిన వారికి 14 రోజుల వరకు, 50 ఏళ్ల లోపు చనిపోయిన వారికి 48 రోజుల వరకు, మనం కొంత ఆహ్లాదాన్ని ఆ జీవంలోకి ప్రవేశింప జేయవచ్చు. ఒకవేళ ఎవరైనా చురుగ్గా, ఉత్సాహంగా ఉండి, ప్రమాదంలోనో, ఆత్మహత్య చేసుకునో మరణిస్తే- 33 ఏళ్ళు పైబడిన వారికి 48 రోజుల వరకు, 33 ఏళ్ల లోపు వారికి 90 రోజుల వరకు మనం దీనిని చేయవచ్చు. మరణించిన తరువాత ఎప్పుడైనా చేయగలిగే ‘కాలభైరవ శాంతి’ అనే మరో ప్రక్రియను కూడా మేము అందిస్తున్నాము. కాలభైరవ కర్మ చేయవలసిన నిర్ణీత సమయం దాటిపోతే మీరు కాలభైరవ శాంతి ప్రక్రియను చేయవచ్చు.
ఇది యోగా సంప్రదాయంలో ముఖ్యమైన భాగంగా ఉంది- ఎవరైనా మరణిస్తే, అతనికి తన మరణాన్ని సరిగ్గా నిర్వహించుకునే అవగాహన లేకపోతే, అప్పుడు మరొకరు అతని కోసం ఇది చేస్తారు. కానీ దురదృష్టవశాత్తూ, బహుశా గత 100-150 సంవత్సరాలలో ఈ సంప్రదాయాలు చాలా వరకు నిద్రాణమైపోయాయి. ఇప్పుడు మిగిలింది అవినీతి వ్యాపారమే. మీకు బాగా ప్రియమైన వారు చనిపోతే, వారు చనిపోయిన వారి కోసమని చెప్పులు, గొడుగు తీసుకురమ్మని కోరతారు. చనిపోయిన వ్యక్తికి చెప్పులు అవసరం లేదు. శరీరము లేని వ్యక్తి, చెప్పులు వేసుకోలేడు. దీన్ని నిర్వహిస్తున్న వ్యక్తికి చెప్పులు కావాలంటే, అతను నిజాయితీగా ముందుకొచ్చి ‘‘నాకు చెప్పులు కావాలి” అని అడగాలి. అప్పుడు కనీసం సరైన సైజు దొరుకుతుంది. చనిపోయిన మనిషి సైజు తీసుకుంటే, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్ముకోవాలి.
మేము భైరవి దేవాలయాన్ని శక్తి స్థావరంగా ఉపయోగించి, మరణించిన వారికి కొన్ని ప్రక్రియలను చేస్తాము. మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయినా, లేదా మీకు తెలిసిన వాళ్ళ కుటుంబాలలో ఎవరైనా చనిపోయినా, ఒక నిర్ధిష్ట వ్యవధిలో ఇక్కడ ఒక ప్రక్రియ చేస్తాము.
ప్రజలు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. వారలా ఆనందంగా జీవించకపోతే, కనీసం వారి మరణమైనా ప్రశాంతంగా జరగాలి. అది కూడా సాధ్యం కాకపోతే, అప్పుడు మేము మరణానంతరం అయినా, వారికోసం ఏదైనా చేయాలనుకుంటున్నాము. కాబట్టి మీరు చనిపోయినా, మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి నా ప్రయత్నాలను నేను వదిలిపెట్టను.
కాలభైరవ కర్మ - ఇది శరీరానికి సంబంధించినది కాదు
ప్రశ్న:సద్గురు, ఎవరైనా మరణానంతరం తమ శరీరాన్ని ఒక మెడికల్ కాలేజీకి దానం ఇవ్వాలనుకుంటే, కాలభైరవ కర్మ చేయడంలో ఏమైనా అర్థం ఉందా?
సద్గురు: భౌతిక శరీరానికి కాలభైరవ కర్మ చేయవలసిన అవసరం లేదు. శరీరము కాలి తిరిగి భూమిలోకి వెళ్లిపోవాలి. ఒకటి, రెండు భాగాలు ఏవైనా ఇంకా కొంత కాలం ఉపయోగపడితే, అవి సరిగ్గా పనిచేయని వేరే శరీరములో పెట్టొచ్చు. కాలభైరవ కర్మ శరీరమును విడిచిపెట్టి వెళ్లిన పార్శ్వానికి సంబంధించినది. మాకు ఆ శరీరాన్ని తాకి ఉన్న ఏదో ఒక వస్తువు కావాలి, ఎందుకంటే శరీరానికి జ్ఞాపకశక్తి ఉంటుంది, అందువలన ఈ రెండు పార్శ్వాల మధ్య సంబంధం ఏర్పరచడం కోసం, మేము ఒక బట్ట ముక్కను ఇంకా ఫోటోను వాడతాము.
చనిపోయిన తరువాత శరీరానికి ఏ ప్రక్రియలు చేయరు. అది అర్థం లేని పని. అది శరీరానికి సంబంధించినది ఐతే వారు బ్రతికి ఉన్నప్పుడే చేసేవాళ్ళం. ఇంకా అటూ ఇటూ తేలుతూ మరో శరీరం కోసం వెతికే ఆ స్మృతుల బుడగ ఏదైతే ఉందో, దానికోసమే కాలభైరవ కర్మ.ఇది ఆ జీవంలోకి కొంచెం బుధ్ధిని తీసుకురావడానికి, ఎందుకంటే వారు శరీరంతో ఉన్నప్పుడు వినరు కాబట్టి. కానీ వారికిప్పుడు విచక్షణ లేదు. మేము విచక్షణ బుధ్ధి కోల్పోయిన వారితో చాలా చేయగలము. ఎప్పుడైతే తెలివితేటలు ఉండవో, వారు ఇక ఒక జల్లెడలా కాకుండా తెరిచి ఉంచిన ఒక రంధ్రంలా ఉంటారు - అందులో ఏదైనా పెట్టొచ్చు. జల్లెడ మనకి నచ్చని వాటిని బయటికి నెడుతుంది. అలాంటి నచ్చనివి కోకొల్లలు ఉంటాయి! శివుడు కూడా బైటే ఉండిపోతాడు.
ఒక రకంగా, ధ్యాన స్థితిలోకి వెళ్ళే ప్రక్రియ చావును అనుకరించడం లాంటిదే. మరణించడం అంటే శరీరం ఒక సమస్య కాకుండా అవ్వడం, ఇంకా తెలివితేటలు కోల్పోవటం. మీ తెలివితేటలు మీ అనుభవాల, అభిప్రాయాల ఉత్పత్తి. ఒకరికి మరొకరికన్నా ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు. కానీ ముఖ్యంగా, విభజన చేయలేని అతీతమైన స్వభావాన్ని మీరు విభజించి చూస్తున్నారు. తెలివి అనేది అతీతమైన జ్ఞానము నుండి తాత్కాలిక జ్ఞానానికి పడిపోవడం వంటిది.
చనిపోయినవారికీ, వారి శరీరానికీ మధ్య గల తేడా మీకు అర్ధమైoదనుకుంటున్నాను. మెడికల్ కాలేజీ వాళ్లకు చనిపోయిన వారి శరీరం కావాలి, వారికి చనిపోయిన వారితో పని లేదు. చనిపోయిన వారి గురించి వారు చేయగలిగింది ఏమీ లేదు. కాలభైరవ కర్మ చనిపోయిన వారి కోసం చేసేది, వారి శరీరానికి కాదు.
Kalabhairava Karma Process Registration
Register for the Kalabhairava Karma process with a phone call to +91 83000 83111 or by emailing kbprocess@lingabhairavi.org, info@lingabhairavi.org.
Kalabhairava Shanti Process Registration
Register for the Kalabhairava Shanti process online here or with a phone call to +91 83000 83111 or by emailing kbprocess@lingabhairavi.org, info@lingabhairavi.org.
Kayantha Sthanam
Kayantha Sthanam is Isha’s Cremation Service that revives ancient traditions and death rituals with a powerful energy basis, conducting them in the spirit of service rather than as a commercial venture. We request your support and contributions to help us offer these services to more people. Donate now by clicking the respective links for Indian Residents and Overseas Residents.