నా బుద్ధి నాకు వ్యతిరేకంగా పనిచేస్తుందా?
నిజానికి మన బుద్ధి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? అలా అయితే ఎందుకు అలా జరుగుతుంది?
ప్రశ్న: నిజానికి మన బుద్ధి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? అలా అయితే ఎందుకు అలా జరుగుతుంది?
సద్గురు: మీ బుద్ధి వల్లనే మీరు ఆధ్యాత్మికత అనే పదం విన్నారు. అవునా?మీ బుద్ధివల్లనే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం అవుతుంది. కాబట్టి మీకున్న మిత్రుడిని మీ శత్రువుగా మార్చుకోకండి. ఒకసారి మీ జీవితాన్ని చూసుకోండి మీ బుద్ధి మీ శత్రువా? లేక మిత్రుడా? మీరు మీ బుద్ధి వల్లనే మీలా ఉన్నారు, ఔనా? మిమ్మల్ని మీరు గందరగోళ పరుచుకున్నారు, అది మీరు చేసుకున్నది. మీకు అలా జరగకుండా ఉండాలంటే చాలా సులువు. మీ తలపై మీకు ఒక మొట్టికాయ అవసరం. బుద్ధి సమస్య కాదు దాన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలియక పోవడమే సమస్య. కాబట్టి బుద్ధి గురించి మాట్లాడకండి, దాన్ని సరిగ్గా నిర్వహించుకోలేని మీ అసమర్థత గమనించండి. ఎటువంటి అవగాహన, పట్టు లేకుండా దేన్నైనా నిర్వహించాలనుకుంటే అది గందరగోళంగా మారుతుంది.
ప్రస్తుతానికి ఒక ఉదాహరణకు వరి పండించడం ఒక పెద్ద విషయమా? ఒక సాధారణ రైతు చేస్తున్నాడు. నేను మీకు 100గ్రాములు వరి ధాన్యం ఇస్తాను, అవసరమైన భూమి ఇంకా కావలసినవి అన్ని ఇస్తాను. మీరు ఒక ఎకరం వరి పండించి నాకివ్వండి, మీకు దాంట్లో గందరగోళం ఏంటో తెలుస్తుంది. వరి పండించడం పెద్ద విషయం కాదు, కానీ మీకు దానికి సంబంధించిన ఒక్క విషయం కూడా తెలియదు కనుక అది కష్టం. జీవితం అలా కాదు, దేన్నైనా నిర్వహించగల సమర్ధత కావాలంటే దానిపై పూర్తి పట్టు సాధించాలి. లేదంటే అనుకోకుండా కొన్ని విషయాలు మనకు అనుకూలంగా జరుగవచ్చు కానీ ప్రతిసారీ అలా జరగదు.
ఒక రోజు ఒక మతవాద చర్చిలో సండే స్కూల్ నడుస్తుంది అసలు సర్వీస్ కన్నా ముందు. అటుగా ఒక పాస్టరు నడుస్తున్నారు వారు చాలా ఉత్సాహంగా ఉంటారు అందుకే వారి దగ్గరకు వెళ్ళాడు, పిల్లలు కాస్త నిరుత్సాహంగా ఉండడం గమనించి వారిని ఉత్సాహపరిచేందుకు ఒక పొడుపు కథ చెప్పాలనుకున్నాడు. "శీతాకాలం కోసం ఆహారం సహకరిస్తుంది, చెట్లెక్కుతుంది, గంతులు వేస్తుంది ఇంకా గుబురైన తోక కలది ఏమిటది ?" ఒక అమ్మాయి చెయ్యెత్తింది, "సరే ఏమిటో చెప్పు" ఆమె అంది "నాకు జీసెస్ అని సమాధానం తెలుసుకానీ నాకెందుకో ఉడత అనిపిస్తుంది " సరేనా? అంటే మీరు ఇప్పటి వరకూ అలాంటి విషయాలు నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్న విద్యంతా ఇటువంటిది. ఏది ఒప్పో ఏది తప్పో, ఏది సరైనదో ఏది కాదో, ఏది దైవము ఏది దయ్యం అన్నీ కూడా దీనికి సంబంధించినవే, జీవితంలోని మీ అనుభవం వల్ల వచ్చినవి కాదు.
మీ ఈ బుద్ధిని ఎలా ఆపగలరు. మీకు సంబంధించని వాటితో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ముడిపెట్టుకున్నారో ఇంక బుద్ధికి అదుపు ఉండదు. ఒకవేళ మీరు చాలా నూనె పదార్థాలు తిన్నారనుకోండి మీకు గ్యాస్ వస్తుంది. మీరు దాన్ని ఆపాలని చూస్తారు కానీ ఆపలేరు. మీరు సరైన ఆహారాన్ని తీసుకున్నట్లైతే దేన్ని ఆపాల్సిన అవసరం లేదు, మీ శరీరం కూడా బాగుంటుంది. మీ బుద్ధి తో కూడా అంతే. మీరు మిమ్మల్ని తప్పుగా, మీరు కానివాటితో అన్వయుంచుకున్నారు. ఇలా తప్పుగా అన్వయించుకున్నప్పుడు మీ బుద్ధిని ఆపగలరు.
మీరు కాని వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే దూరం చేసుకోగలరో అప్పుడు మీ బుద్ధి ఖాళీగా ఉంటుంది. మీరు దాన్ని వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు లేదంటే ఖాళీగా ఉంటుంది. ఇలా ఉండాలి. దానికి వేరే విధంగా ఉండాల్సిన పని లేదు. కానీ ప్రస్తుతం మీరు చాలా విషయాలతో మిమ్మల్ని గుర్తించుకుంటున్నారు, మీ శరీరంతో మొదలుకొని చాలా విషయాలతో ముడిపెట్టుకొని మీ బుద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు, ధ్యానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా పని చేయడం సరికాదు. మీ గుర్తింపులను మీరైనా తునాతునకలు చేయండి లేదా మీ జీవితం మీకు చేసిపెడుతుంది. మిమ్మల్ని మీరు దేనితో ముడిపెట్టుకున్నా మరణం మీ ముందున్నప్పుడు అన్నీ దూరమౌతాయి, అవును కదా? మీరు వేరే ఏ విధంగా మార్చుకోకపోయినట్లైతే మరణం మీకు నేర్పిస్తుంది ఇది కాదు అని. మీకు కాస్త బుద్ధి ఉంటే ఇప్పుడే నేర్చుకుంటారు నేను ఇది కాదు అని. మీరు ఇప్పుడు నేర్చుకోకపోతే మరణం వచ్చి గట్టిగా తన్ని మిమ్మల్ని మీరు అనుకున్న వాటినుండి విడదీస్తుంది.
అందుకే మీరు మీ గుర్తింపులనుంచి విడదీసుకోవడం అవసరం. ప్రతి రోజూ ఉదయం పది నిమిషాలు వెచ్చించి తెలుసుకోండి మీరు మీరుకాని వేటితో మిమ్మల్ని ముడిపెట్టుకున్నారో, మీకు తెలుస్తుంది ఎంత హాస్యాస్పదంగా ఎన్ని హాస్యాస్పద విషయాలతో ముడిపెట్టుకున్నారో. మీరు మానసికంగా మీ చుట్టూ మీ ఇంట్లో ఉన్న అన్నింటినీ బద్దలు కొట్టండి మీకు తెలుస్తుంది మీరు ఎన్నింటితో ముడివేసుకున్నారన్నది. చిన్న వస్తువులు, పెద్ద విషయాలు, మీ ఇల్లు, మీ కుటుంబం అన్నీ, వాటిని మానసికంగా బద్దలు కొట్టి చూడండి. అన్నీ మిమ్మల్ని బాధించే వాటితోనే మీరు గుర్తించుకుంటున్నారు. ఒకసారి మీరు దానితో మిమ్మల్ని ముడివేసుకున్నపుడు ఇక అది మీరు ఆపలేని ఎక్స్ప్రెస్ రైలు. మీరు ఏ విధంగా ప్రయత్నించినా అది ఆగదు. మీరు మీ బుద్ధికి నిండుగా ఇంధనం ఇచ్చి బ్రేకులు వెయ్యాలనుకుంటున్నారు - అలా పని చేయదు. ఏ వాహనాన్ని ఆపాలన్నా ముందుగా మీ కాలు ఆ ఆక్సలరేటర్ పై నుంచి తీసి బ్రేక్ వెయ్యాలి.
Editor's Note: Find more of Sadhguru's insights on the potential of the human mind, in "Mind is Your Business".