నవ్వు నిజంగా అత్యుత్తమ ఔషధమా?- ప్రపంచ నవ్వుల దినోత్సవం.
ఉన్న ఒక విధానం
ఎంత కాలంనుండో నవ్వు అత్యుత్తమ మంచి ఔషధం అని అందరూ అంటూ ఉంటారు.కొందరన్నారు, ఆనందంగా ఉండే వారు తమను తామే సహజంగా స్వస్థ పరచుకుంటారు అని మరి కొందరన్నారు.
మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది మీ శరీరం ఎంత బాగా పనిచేస్తోందో చెపుతుంది. అది బాగా పనిచేస్తుంటే మనం దాన్ని ఆరోగ్యం అంటాం, లేకపోతే అనారోగ్యం అంటాం.మీరు ఆనందంగా ఉన్నారంటే అర్థం ఉంటే మీ శారీరక క్రియలన్నీ చక్కగా జరుగుతాయి. అప్పుడు అందుకు ఆరోగ్యంగా ఉండటం సహజంగానే జరుగితుంది,అవుతుంది.నవ్వు మిమ్మల్ని స్వస్థ పరచటం లేదు; ఆనందం స్వస్థ పరుస్తోంది.కాని నవ్వుతోనే స్వస్థతను చేర్చి చెప్పటం ఎక్కువైంది.
నవ్వు కూడా బంధం అవుతుంది. ఎప్పుడూ హహహ అంటూ ఉండటమే ఆనందం అనుకుంటే మీ ప్రవర్తన చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే సందర్భం ఏదైనా దాని గాంభీర్యాన్ని పట్టించుకోకుండా మీరు “ హ హ హ “ అంటూ ఉంటారు. ఆనందం అంటే నవ్వు కాదు.ఆనందం ఎన్నో రకాలుగా వ్యక్తం కావచ్చు. ఒక్క నవ్వు ద్వారానే కాదు. నవ్వు ఒక విధమైతే నిశ్శబ్దం మరొకటి. ఆనందం వల్ల మీరు స్తబ్దంగా ఉండవచ్చు, క్రియాత్మకం కావచ్చు, మీకు కన్నీళ్ళు కూడా రావచ్చు.
గౌతమ బుద్ధుడు ఆనంద స్వరూపమని అందరికి తెలుసు కానీ ఆయన పగలబడి నవ్వటం ఎవరూ చూడలేదు. ఆయన ఎప్పుడూ పెద్దగా నవ్వలేదు.ఆయన నవ్వు ఎప్పుడూడ్ స్పష్టంగా లేదు. ఆ చిరునవ్వు చాలా అలవోకగా ఉండేది.ఆనందం అంటే నవ్వు చిరునవ్వు కాదు.ఆనందం అంటే మీరు జీవిత సారాన్ని చవిచూసినట్టు. వ్యక్తీకరణకు పరిమితం చేస్తే, మీరు మీ ఆనందాన్ని నిరంతరం ఉండకుండా చూస్తున్నారని అర్థం.
ఆనందం అంటే మీరు జీవితంలో పైపైన తేలి కాకుండా నిండా మునిగి ఉన్నారని అర్థం. మీరు మూలాన్ని అందుకున్నారు లో ఉన్నారు. అందుకే మీ మీరే ఆనందం.కాని మానవులు దాన్ని సరిగా వ్యతిరేకంగా భావిస్తారు. మద్యం త్రాగటం ఆనందమని కొదరు అనుకుంటే, కొందరు నవ్వటం ఆనందమని అనుకుంటారు. నవ్వే వాళ్ళందరితో ఒక సంఘాన్నే ఏర్పరచారు.రోడ్లమీద, అన్నిచోట్ల వారు హా హా , హు హు హెహె అంటూ ఉంటారు. ముందు సరదాగానే విచిత్రంగా ఉంటుంది. ఒకవేళ నిరంతరం నవ్వుతూ ఉండే మనిషితో ఒకవేళ కలిసి జేవించ వలసి వస్తే , అతని నవ్వును ఆపటానికి అతన్ని చంపేయాలని మీరు అనుకునే రోజు వస్తుంది.
నవ్వు ఒక పరిణామం
“నవ్వే యోగం” అంటూ ఒక దయనీయమైన యోగం ఇటీవల బయలు దేరింది. మనమిద్దరం ఎదురు బొదురుగా నిలబడి, నన్ను చూసి మీరు హిహి అంటే, మిమ్మల్ని చూసి నేను హిహి అంటాను. ఇది పిచ్చి. ఆమధ్య ఎక్కడో చదివాను, ఒక అమెరికన్ టిచర్ చెప్పారు ప్రతిరోజూ పది నిముషాలు నవ్వి తీరాలని. మీరు అలాచేస్తే ఖచ్చితంగా తొందరలో మానసిక ఆసుపత్రిలో చేరతారు.
మీకు తోటలో పూలు కావాలంటే, ప్లాస్టిక్ పూలను తెచ్చి అతకరు. పూలలాగా కనబడని పని ఏదో చేస్తారు. మట్టిని, ఎరువును, నీటిని, ఎండను చూచుకోవలసి ఉంటుంది.ఇవి ఏవి కూడా, పూల లాగా కనపడవు, మృదువుగా ఉండవు, సువాసనను కలిగించవు. కాని వాటన్నింటిని సరిగా చూసుకుంటే పూలు పూస్తాయి. అందువల్ల ప్రతిరోజూ మీరు నవ్వాలని నిర్ణయం తీసుకున్నంత మాత్రాన నవ్వు రాదు. మీ లోలోన ఒక ప్రసన్నత ఉంటే, ఎందుకో తెలియకుండానే ఒక చిరునవ్వు మీముఖంలో వ్యాపిస్తుంది.చిన్నపాటి చక్కిలిగింతకే మీరు పక పకా నవ్వుతారు.నవ్వు ఒక పరిణామం. ఒక పరిణామాన్ని తీసుకు రావాలనికాక, విధానంపై, మూలంపై దృష్టినిలిపి దానికొరకు ప్రయత్నించండి.
ఆనందం అనేది మీరు చేసే పనికాదు. మీ లోలోన సహజంగా జరిగే జీవన విధానానికి మీరు స్వయంగా భంగం కలిగించక పొతే, ఆనందం సహజంగా వెలువడుతుంది. ఆనందం మీరు సాధించేది కాదు అది మీ సహజ స్థితి. యోగ శాస్త్రం మానవుని పంచకోశ సమాహారంగా చెపుతుంది. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఆనందాన్ని ఆంగ్లంలో “జాయ్” గా వ్యాఖ్యానించ వచ్చు. అందువల్ల మీ లోలోని స్వభావం ఆనందం. శరీరంలోని మొదటి మూడు పరిమాణాలు భౌతిక, మానసిక, శాక్తిక పరిమాణాలు సరైన అమరికలో ఉంటే, మీలోని మౌలిక తత్త్వం , ఆనంద తత్త్వం అదే వ్యక్తం అవుతుంది.
ప్రేమాశీస్సులతో,