విద్య గురించి సద్గురు సుభాషితాలు
సద్గురు తన విద్యాభ్యాసానికి, పాఠశాలలో నేర్పించే చదువును ఎప్పుడూ అడ్డు రానివ్వలేదు. అందువల్ల ఆయన ప్రారంభించిన వివిధ విద్యా కార్యక్రమాలలో, ప్రాధాన్యత ఎప్పుడూ ప్రేరణకే ఉంది, బోధనకుకాదు. ఇది సమాచారాన్ని సేకరించడం గురించి కాదు, అవగాహనను పెంచుకోవడం గురించి. ఈ అంశంపై ఆయన పంచుకున్న కొన్ని మంచి మాటలు మీకోసం.
సుభాషితాలు - విద్య ఎందుకు ముఖ్యం?
విద్యార్ధుల కోసం విద్యాభ్యాసం గురించి కొన్ని సూక్తులు
విద్యా రంగంలోని ప్రముఖులు తమ జ్ఞానాన్ని పంచుతున్నారు
సద్గురుతో సంభాషణలో సర్ కెన్ రాబిన్సన్
“పిల్లలు దేనిలో రాణిస్తున్నారో మీరు కనుగొంటే, సద్గురు సూచించినట్లు మీరు చేస్తే, ఆధ్యాత్మిక వికాసానికి, భౌతిక వికాసానికి దోహదపడేది, మానవ జీవితం ఒకే క్రమంలో లేదని, అది సేంద్రీయమైనది, విభిన్న మార్గాలను అనుసరిస్తుంది అని గుర్తించగలిగే సంపూర్ణమైన వాతావరణాన్ని మీరు సృష్టిస్తే - అప్పుడు పూర్తిగా అసాధారణమైన తరహా పరిస్థితులు ఏర్పడతాయి- అందులో వ్యక్తులు సంపూర్ణ వికాసం పొందగలరు."
యునెస్కోలో సద్గురుతో సంభాషణలో ప్రొఫెసర్ గ్రెగోయిర్ బోర్స్ట్
"ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మనం ఇప్పటి నుండి ముప్ఫై సంవత్సరాల తరువాత, ప్రపంచానికి ఎలాంటి పిల్లలను ఇస్తున్నాము అని చూసుకొని, ఇక మనం మన పాఠశాలలను ఆ దృక్పథానికి తగినట్టుగా మార్చుకోవాలి."
సంపాదకుని సూచన: సద్గురు నుండి మరిన్ని సలహాల కోసం "మీ పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వండి, ప్రపంచాన్ని చైతన్యం చెయ్యండి" ఈబుక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. పుస్తకం "మీకు ఇష్టం అయినంత చెల్లించండి", అందుబాటులో ఉంది