సద్గురు అందించిన 21 ప్రేమ సుభాషితాలు
ఒక సమకాలీన మార్మికుని దృక్పథంతో ప్రేమను సరికొత్తగా చూద్దాం. ప్రేమ గురించి సద్గురు అందించిన, అంతర్దృష్టి కలిగించే, స్ఫూర్తిమంతమైన ఈ 21 సుభాషితాలు, తరాల నాటి ఈ విషయంపై, కొత్త వెలుగుని ప్రసరిస్తున్నాయి.
ArticleJan 30, 2022
భగవంతుడు లేదా మరెవరైనా మిమ్మల్ని ప్రేమించడం వల్ల మీకు ఒరిగేదేమీ లేదు. మీరే ప్రేమపూర్వకంగా ఉంటే, అది మీ జీవితాన్ని మధురంగా, అతి మధురంగా మారుస్తుంది.
ప్రేమ అంటే పనికొచ్చే పనిముట్టు కాదు. ప్రేమ అంటే మనల్ని కరిగించివేసే ప్రక్రియ.
ప్రేమని మీరు నేర్చుకోలేరు, సాధన చేయలేరు, మరొకరికి ఇవ్వలేరు. ప్రేమ అంటే కేవలం వికసించడం.
భగవంతుడిని ఎవరైనా ప్రేమించగలరు ఎందుకంటే, ఆయన మిమ్మల్ని ఏమీ అడగరు కాబట్టి. కానీ ఈ క్షణంలో మీ పక్కన ఉన్న వారిని ప్రేమించాలంటే మీ జీవితాన్ని వెచ్చించాల్సి వస్తుంది.
మీ మనసులో ప్రేమ ఉంటే అది మీ జీవితంలో మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రేమకి దాని సొంత మేధస్సు ఉంది.
ప్రేమ అనేది మరొకరిని మీలో భాగంగా చేసుకోవాలనుకునే ఒక తపన. కలుపుకు పోవడం ద్వారా మీరున్న స్థితి నుండి ఇంకా విస్తరించే అవకాశమే అది.
మీ ప్రేమను మరింతగా విస్తరించండి. మీరు మొత్తం విశ్వంతోనే ప్రేమలో పడగలిగినప్పుడు ఒక్కరినే ప్రేమించడమెందుకు?
ప్రేమకు ఎటువంటి బీమా లేదు. దానిని సజీవంగా ఉంచడానికి ఎరుక కావాలి.
అందరూ మీతో ప్రేమలో పడిపోవాలంటే, ముందు మీరు అందరితో ప్రేమలో పడిపోవాలి.
కేవలం ప్రేమని పొందలేని వారు మాత్రమే, భగవంతుణ్ణి ప్రేమ స్వరూపంగా భావిస్తారు. ప్రేమ అంటే, మనిషికున్న భావోద్వేగం.
ఏడువందల ఏభై కోట్ల జనాభాలోంచి ఒకర్ని మినహాయించినప్పుడు, మీరు ఘోరమైన ఒంటరితనంతో మగ్గిపోతుంటే, అది ప్రేమ కాదు – అది బంధనం.
షరతులతో కూడిన ప్రేమ, షరతులు లేని ప్రేమ అంటూ ఏదీ ఉండదు - షరతులో, ప్రేమో ఏదో ఒకటే ఉంటుంది.
చాలామందికి ప్రేమంటే ‘నాకు ఇష్టమైందే నువ్వు చేయాలి!’ అని. కాదు, ప్రేమంటే వాళ్లకి ఇష్టమైంది వారు చేసుకోవచ్చు, అయినా మనం వాళ్లని ప్రేమిస్తూనే ఉంటాం.
చాలామందికి ప్రేమంటే ‘నాకు ఇష్టమైందే నువ్వు చేయాలి!’ అని. కాదు, ప్రేమంటే వాళ్లకి ఇష్టమైంది వారు చేసుకోవచ్చు, అయినా మనం వాళ్లని ప్రేమిస్తూనే ఉంటాం.
మీరు ప్రేమలో ఎదగలేరు, మీరు ప్రేమలో ఎగరలేరు, మీరు ప్రేమలో నిలబడలేరు - మీరు ప్రేమలో పడిపోవాలి. ఆ అనుభూతిలోని మాధుర్యాన్ని తెలుసుకోవడానికి మీలోనిదేదో పడిపోవాలి.
కామం అనేది ఒక బలమైన కోరిక. ప్రేమ ఒక కోరిక కాదు. ప్రేమించినప్పుడు మీరు కుదుటపడతారు, మీకు ఇంక కావలసింది ఏమీ ఉండదు. ప్రేమలో ఉంటే, మీరు జీవితకాలం ఇక్కడ ఇలా కూర్చోవచ్చు.
తమ మనస్సులోని చెత్తను పక్కన పెట్టేవారే నిజంగా ప్రేమాదరణలు చూపే సామర్ధ్యం కలవారు.
ప్రేమించడానికి, ఆదరించడానికి, జీవితాన్ని అనుభూతి చెందడానికి మీకున్న సామర్థ్యం అపరిమితం. పరిమితి ఉన్నది మానసికంగా, శారీరకంగా మీరు చేసేవాటికి మాత్రమే.
మీరు ప్రేమలో పడ్డప్పుడు మీ ఆలోచనా విధానాలు,మీ భావాలు, మీ ఇష్టాయిష్టాలు, మీ తత్త్వ సిద్ధాంతాలు అన్నీ కరిగిపోతాయి.
తర్కానికి అతీతమైన స్థానం ఒకటుంది. మీరక్కడికి చేరితేగాని ప్రేమలోని మాధుర్యంగాని లేక దివ్యత్వంలోని మాధుర్యంగాని తెలుసుకోలేరు.
యోగా అనేది అతిపెద్ద ప్రేమ వ్యవహారం. అది జీవంలోని ప్రతి అంశాన్నీ, రీతినీ కలిపేసుకునే ప్రక్రియ.
సంపాదకుడి సూచన: ప్రేమ యొక్క భిన్నమైన పార్శ్వాల గురించి, సద్గురు ఇంకా ప్రఖ్యాత చిత్ర నిర్మాత శేఖర్ కపూర్ చర్చించిన, “లవ్ – ఎ కెమికల్ హైజాక్” DVD ని చూడండి.