శాంభవి మహాముద్ర - ఒక ప్రాణ ప్రతిష్ఠ

సద్గురు: దీక్షలు వివిధ రకాలు. కొన్నింటిని మనం వాడుక భాషలో దీక్షలు అన్నా, అవన్నీ నిజంగా దీక్షలు కావు. మనం అందించే మొదటి ప్రక్రియ ‘శాంభవి మహాముద్ర’ - ఇది దీక్ష కాదు - ఇది ప్రాణ ప్రతిష్ఠ. మనుష్యులకు మనము ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము. ఏ విధంగా చూసినా, ఆదియోగి లింగమువంటి (ఈశా యోగా కేంద్రంలోని ఆదియోగి ఆలయంలో ఉన్న) రూపానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం కన్నా, జీవించి ఉన్న మునుషులకి ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఎంతో సులభం. ఒక జీవములేని వస్తువుని, దాదాపుగా జీవమున్న, వివేకమున్నమూర్తిగా మరల్చడం ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. ఆయన(ఆదియోగి) కి మీగురించి అంతా తెలుసు..

శాంభవి మహాముద్ర ఒక శక్తివంతమైన ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ. మీరు చేయవలసినది, దీనికి అందుబాటులో ఉండడమే.

దానికి ఎంతో శ్రమించాలి. జీవంతో ఉన్న మనుషులకి ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఎంతో తేలిక. కానీ ఇందులో ఉన్న ఒక్కటే సమస్య, వెనుదిరిగి పోవటంలో మనుషులు నిష్ణాతులు. మొదటిరోజు మిమ్మల్ని శాంభవిలోప్రతిష్ఠ చేసినప్పుడు, మీరు ఏ స్థితికో చేరతారు; ఇది అనుభవపూర్వకమైనది. కొందరు ఈ అనుభూతిని అలాగే కొన్ని రోజులు,వారాలు, నెలలు, సంవత్సరాలు నిలబెట్టుకుంటారు. కొందరు హాలు దాటగానే వదిలేస్తారు. శాంభవి మహాముద్ర ఒక శక్తివంతమైన ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ. మీరు చేయవలసినది మిమ్మల్ని మీరు ఈ ప్రక్రియకి అందుబాటులో ఉంచుకోవడం మాత్రమే. ఇది ప్రాణ ప్రతిష్ఠ - జరగవలసిన పని జరిగిపోయింది. ఒక గుడి కట్టినట్లు, మీరు వెళ్లి అందులో కూర్చోవడం మాత్రమే చేయాలి. మీరు ప్రతిదినం దానిలోని లాభం అందుకోండి, అంతే.

దీక్ష - (అంటే)పరిపోషణ చేయవలసిన విత్తనం

కాని, శూన్య ధ్యానం, శక్తి చలన క్రియ, సంమ్యమ - అనేవి అసలైన దీక్షలు. అవి ఒక రకమైనవి. మునుపు మొదట శూన్య ధ్యానంతో ప్రారంభం చేసేవాళ్ళం. శూన్య ఒక అసలైన దీక్ష. దీక్ష ఒక విత్తనం వంటిది. దీనిని మీరు పోషించాలి. పోషించినప్పుడే ఇది పెరుగుతుంది. ఇది ఎంతోమంది గ్రహించారు. శూన్యధ్యానంలో వారికి దీక్ష ఇచ్చినప్పుడు, వారు ఎంతో అద్భుతంగా ఉన్నారు. తిరిగి వెళ్లి రెండు నెలలు ఇంట్లో చేశారు, వారి జీవితం మారింది. వారి శరీరంలో పరివర్తనం కనిపించింది, నిద్ర తగ్గింది, ఆహారం తగ్గింది, అన్ని విధాలా అద్భుతంగా ఉంది. ఇంతలో ఎదో జరుగుతుంది వారు కొన్ని వారాలు దీనిని విస్మరిస్తారు. మళ్ళీ తిరిగి శూన్యధ్యానం మొదలెడతారు. అక్కడ ఏమీ లేదు, అది పోయింది. ఎందుకంటే, అది విత్తనం, దానిని పోషించాలి. దీనికి నీరు పోయకపోతే ఇది మరణిస్తుంది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఇది మాయం అవుతుంది.

అందుకే, శాంభవి ప్రాణప్రతిష్ఠ కావడంవల్ల దీనిని మొట్ట మొదటి కార్యక్రమంగా ప్రవేశపెట్టాము. ఇది వెళ్ళి పోదు - నిలిచి ఉంటుంది. మీరు చేయవలసింది దీనిని భద్రంగా ఉంచడం మాత్రమే. ఇది ఒక విశిష్ఠమైన వాతావరణాన్ని, తక్షణ అనుభవాన్ని ఇస్తుంది. మీరు దీనిని బాగా ఉంచుకుంటే దానంతట అదే మెరుగుపడుతుంది. కానీ ఇది శూన్య ధ్యానంలా వృద్ధిచెందదు. శూన్యధ్యానం పెరుగుతుంది. శూన్యత ఎలా పెరుగుతుంది? శూన్యము వ్యాపించడంవల్లే విశ్వం ఇంత విశాలంగా ఉంది. కోట్లాది నక్షత్రాలు, నక్షత్ర మండలాలు దీనిని ఇంతగా వ్యాపింపలేవు. శూన్యము వ్యాపించడంవల్లే ఇది ఇంత విశాలమయ్యింది. అందువల్ల ఇది పెరగగలదు, అంతులేకుండా పెరగగలదు.

కార్యక్రమాల మధ్యలో ఆటంకాలు

శాంభవి ప్రాణప్రతిష్ఠ కావడంవల్ల, ఇది జరుగుతున్న సమయంలో ఒడుదుడుకులు కలిగితే, అవి నన్ను ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో ఒకేసారి పది వేలమందికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము. వారందరు ఒక్కరిలా ఉంటే సమస్యలేదు, కానీ ఇందులో ఒక పదిహేను, ఇరవైమంది పిచ్చిగా వ్యవహరిస్తే, అది నాపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. నా చుట్టు ప్రక్కల ఉన్నవారికి ఇది కనిపిస్తుంది. ఒక కార్యక్రమంలో ప్రాణప్రతిష్ఠ చేయడం, చిటికెలో అయిపోతుంది. ఇంకొక కార్యక్రమం నన్ను కూల్చేస్తుంది. తరువాత, మీరు మీ శాంభవి సాధన ఏ విధంగా చేసుకుంటారో అది నన్ను అంతగా ప్రభావితం చెయ్యదు. మా పెట్టుబడి మేము పెట్టాము, దానిని కోల్పోతామేమో కానీ, నా మౌలిక శక్తిని అది ప్రభావితం చేయదు.

ఈ రోజులలో భావ స్పందన కార్యక్రమం దానికై ప్రత్యేకంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన అనుకూలమైన స్థలాల్లో మాత్రమే జరుపుతున్నాము. ఒకప్పుడు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో ఈ కార్యక్రమం వివాహ మండపాలలో, సత్రాలలో, ఫంక్షన్ హాలులో జరుపుతుండేవాళ్ళం. ఒక రోజు ముందు అక్కడ వివాహమో, ఇంకేదైనా పార్టీనో జరిగి ఉండవచ్చు. ఉదయాన్నే వాలంటీర్లు శుభ్రం చేసి, అన్ని సర్ది, ఏర్పాట్లు చేసేవాళ్ళు. సాయంత్రం మేము భావ స్పందన ప్రారంభించేవాళ్ళం. ఇటువంటి చోట్ల మేము ఎంతో బాధపడేవాళ్ళం. భావ స్పందన కార్యక్రమం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నా వెన్నెముక పైన నిమ్మకాయంత గడ్డలు వచ్చేవి. ఒకోసారి అవి తగ్గడానికి కొన్ని రోజులు పట్టేది. ఈ రోజులలో భావ స్పందన ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సురక్షితమైన ప్రదేశాలలో జరుగుతుండడం వల్ల ఒక ఆటలాగా సులువుగా జరిగిపోతుంది. కాని, సురక్షితం కాని ప్రదేశాలలో జరిగినప్పుడు, పరిస్థితి వేరు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో జరగగల నష్టం.

ఆదియోగికి (ఆదియోగి లింగంను ఉద్దేశించి) మనము ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు చేస్తే, ఇందులో హాని జరగడానికి అవకాశం ఉంది. పదునాలుగు వేల మంది ఇందులో ఒకటే వ్యక్తిలా పాల్గొన్నారు. ఈ రోజున కూడా నేను వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తాను. ఇప్పటివరకు మనం చూసిన వారిలో అందరికన్నా అద్భుతమైన జన సముదాయం అదే. ఎందుకంటే ఎక్కువభాగం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేను కొద్ది మంది సమక్షంలో జరపాలనుకున్నాను, ప్రాణ ప్రతిష్ఠకి కొద్ది రోజుల ముందే వచ్చాను, అందువల్ల అలా చేయడం కుదరలేదు. ఇంతమంది సమక్షంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ జరపడం నాకు కొంత ఆందోళన కలిగించింది. కానీ ఇది బహిరంగ ప్రదేశంలా అనిపించలేదు, పదునాలుగు వేలమంది ఒక్కటిగా ఉన్నట్టు నేను ఒక్కరితోనే ఉన్నట్టు అనిపించింది. ప్రజలు అలా ఉన్నట్లయితే, మనం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయగలం.

లింగ భైరవి ప్రాణ ప్రతిష్ఠ చాలా వరకు కొద్దిమంది సమక్షంలోనే జరిగింది, కానీ ఎందువల్లనో వారిలో మనకు తగినంత క్రమశిక్షణ కనిపించలేదు. నేను పూర్తి ప్రయత్నం చేశాను, కాని చుట్టు ప్రక్కల ఉన్నవారు కొద్దిమంది చిన్న చిన్న చికాకులు కలిగించారు. నేను ఒకటిన్నర సంవత్సరం పాటు రుచి, వాసన కోల్పోయాను. నేను రుచులను ఎంతో బాగా ఆస్వాదిస్తాను, ఎటువంటి వాసన నైనా సున్నితంగా పసిగడతాను. అటువంటిది ఒక పదునెనిమిది నెలలు పాటు, కేవలం రుచి పచి లేని ప్లాస్టిక్ తింటున్నట్టుగా మాత్రమే ఉంది. ఏమి తింటున్నానో కూడా నాకు తెలియలేదు. పోషణకే ఏదోఒకటి తినవలసి వచ్చింది. ఇంతే కాదు, మూడు సార్లు నేను నా ఎడమ వైపుకు పడిపోయాను - ఒకసారి పెద్ద గాయం కూడా అయింది, మిగతా సార్లు ఏ గాయం లేకుండా తప్పించుకున్నాను. అవన్నీ ఇప్పుడు దాదాపు బాగు పడ్డాయి.

అంటే, మనము చేస్తున్న పనిపై అది ఆధారపడివుంటుంది. ఈ మధ్యనే ఎవరో అడిగారు "ఈ యోగ ప్యాకేజీలు ఎందుకు?" అని. ( ఇశా యోగ /ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమాలు వివిధ రకాలుగా అందించడం గురించి) ప్యాకేజీలు భద్రత కొరకు, అందుకునేవారికి, అందించేవారికి, ఇరువురికి కూడా. ఒక ప్యాకేజీని ఇస్తే, దానిని వారు అద్భుతంగా ఉంచుకోవచ్చు, లేదా దానిని పూర్తిగా నాశనం చేయవచ్చు - అది పాల్గొన్న వారిపై ఆధారపడి ఉంటుంది. ప్యాకేజీ లేకుండా స్వేచ్ఛగా అంద చేయాలంటే, అప్పుడు పూర్తి నమ్మకం అవసరం. ఆలా కాకుంటే, వారి మూర్ఖత్వం మిమ్మల్ని కూడా నాశనం చేయగలదు - ఇది సంభవం. ఒకటి రెండు సమయాలలో అటువంటి ధరల, మేము చెల్లించుకున్నాము. కానీ ప్రధానంగా, మాకు అందిన ఫలితాలను చూస్తే, మేము కట్టిన ధర పెద్దదిగా భావించనక్కరలేదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు