అపోలో హాస్పిటల్ సంస్థాపకులు డా.ప్రతాప్ రెడ్డిగారు సద్గురుని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఎలా ఉండగలం అని ప్రశ్న వేసారు. సద్గురు అంటు రోగాలు ఇంకా దీర్ఘకాలిక రోగాల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసారు.
ఇక్కడ చదవండి:
డాక్టర్ ప్రతాప్ రెడ్డి: అద్భుతం సద్గురు?. ఈ అందమైన ఆడిటోరియంలో ఉన్న వారికీ, ఇంకా ఇంటర్నెట్ ద్వారా వీక్షిస్తున్న వేలాది మందికి, అందరికీ ఇవాళ ఓ విషయం తెలుసుకోవాలనుందని నాకు తెలుసు.చక్కగా ఆరోగ్యంగా ఉండేందుకు మార్గం ఉందా అని....!!(నవ్వు..) ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం....(నవ్వు..) ఎందుకంటే నేను చూశాను, కొందరికి ఆరోగ్యం బాలేనప్పుడు మీరు వారికోసం ఎన్నో అసాధ్యమైన పనులు చేశారు. అలాగే మీకు, ఏ వైద్యుడూ వైద్య గ్రంధాలూ గుర్తించలేని అనారోగ్యం వచ్చినప్పుడు కూడా జరిగింది. బైట పడడం..ఎలా? ఆరోగ్యంగా ఉండటానికి మారేదైనా ఉందా?. నేను అరుంధతి గారు రాసిన పుస్తకాంలో చదివాను- మీరొక మార్మికులని. ఒక కనిపెట్టలేని అనారోగ్యాన్ని మీరు....స్వయంగా తగ్గించుకున్నారని.
సద్గురు:చూడండీ ...ఈ శరీరం..
డాక్టర్ ప్రతాప్ రెడ్డి: మీ అందరి మనసులో ఉన్న ప్రశ్న ఇదేనా. మీరు ఆరోగ్యంగా ఉండాలి ఔనా?
ప్రేక్షకులు: ఔను.
డాక్టర్ ప్రతాప్ రెడ్డి: ఇవాళ మనని చూస్తున్న వారందరికీ డాక్టర్ రెడ్డి ఎందుకీ ప్రశ్న అడగలేదనే అనుమానం వస్తుంది(నవ్వు..)నాకు వాళ్ళ బిజినస్ కావాలి,కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా..
సద్గురు: విషయం ఏంటంటే, మనం ఈ శరీరాన్ని లోపల్నించి సృష్టించాం. అంటే దీన్ని తయారు చేసిన వాడు కూడా లోపలే ఉన్నాడు.ఏదైనా రిపేర్ వస్తే, మీరు manufacturer దగ్గరకు పోతారా లేక దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికా?. మీకు అందుబాటు ఉంటే, అందుబాటులో ఉంటే .. మీరు manufacturer దగ్గరకే వెళ్ళాలనుకుంటారు;అందుబాటులో లేకపోతేనే సందు చివర ఉన్న కుర్రాడితో సరిచేయిస్తారు.
వైద్యశాస్త్రం లేకపోతే, ఈ ప్రేక్షకుల్లో సగం జనాభా ఇప్పటికే చనిపోయి ఉండేవారు.ఔను. ఎందుకంటే పందొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనిషి సగటు ఆయుర్దాయం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే.ఇవాళ అది అరవై నాలుగుకి పెరిగింది.దానికి గల కారణాల్లో వైద్య శాస్త్రం ఒకటి.అందుకని, నేను వైద్య శాస్త్రాన్ని తక్కువ చెయ్యట్లేదు,.ఇదెంతో ముఖ్యం.గత ముప్పై , నలభై ఏళ్ళలో అది సాధించిన ఘనత అమోఘం.ప్రశ్న మాత్రం ఒక్కటే-మిమ్మల్ని తయారు చేసిన మూలశక్తి మీకు అందుబాటులో ఉంటే, మీలోపల పుట్టిన ప్రతి సమస్యనీ సరిచేయవచ్చు.
అనారోగ్యాలు రెండు రకాలు- దీర్ఘకాలిక వ్యాధులు.అంటువ్యాధులు మనకు బయట ఉన్న జీవుల వల్లన, వస్తాయి. దానికి డాక్టర్ దగ్గరకి వెళ్ళండి. దానికి కూర్చుని ధ్యానం చెయ్యకండి.(నవ్వు.). కానీ ఈ భూమిమీదున్నడబ్భై శాతం అనారోగ్యాలు సొంతంగా సృష్టించుకున్నవే. సొంత సృష్టి అంటే అవి మీ లోపలే పుట్టాయి. లోపల ఉన్నసమస్యలని లోపలినించి సరిచెయ్యచ్చు.బైటి నించి వచ్చే వాటికి బైటి మందులు కావాలి. మీరు ఏదైనా బైటి జీవిని పోరాడాలంటే మాత్రం మందు కావాలి. అవి కాక మిగిలినవన్నీ, అంటే దాదాపు డబ్భై శాతం మనం తయారు చేసుకున్నవే. మీ శరీరం మీకు విరుద్ధంగా ఎందుకు పనిచేస్తుంది?.
ఈ శరీరం ఆరోగ్యంగా ఉండటానికే తయారు చెయ్యబడింది. మరెందుకు మీకు విరుద్ధంగా పనిచేస్తోంది మీ శరీరం?. ఎందుకంటే ఎక్కడో మీరు దాన్ని సంతోషంగా ఉంచట్లేదు. వాడుకభాషలో చెప్పాలంటే, మీ కుటుంబ సభ్యులే మీకు ఎందుకు ఎదురు తిరుగుతారు చెప్పండి? వాళ్ళు మీతో సంతోషంగా లేరు కాబట్టి. ఔనా కాదా?(నవ్వు..). మీరు చేస్తున్నదేదో వాళ్ళకి నచ్చలేదు. అలాగే, మీ శరీరంలోని కొన్ని కణాలో కొన్ని శరీర భాగాలో, హాయిగా లేవనమాట.అప్పుడు మీరు వాటిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి. ఒక క్రమబద్ధమైన మార్గం ఉంది దీన్ని శ్రద్ధగా గమనించటానికి, ఎందుకంటే అంతా లోపలినుంచే సృజించాం కాబట్టి.అలాంటప్పుడు లోపలి నుంచి సరి చేసుకోలేమా?.
ఇది ఒక అద్భుతమేం కాదు. మనుషులకి ఇది అర్ధం కావాలి.ఇది అద్భుతం కాదు.అద్భుతం అంటే..... ఒకవేళ మీకు కరెంటు అంటే ఏంటో తెలీదనుకోండి.నేను ఇక్కడికొచ్చి ఆ గోడలో ఒక చోట నొక్కితే లైటు వెలిగిందనుకోండి , మీరు నన్ను ఎవరనుకుంటారు?. ఒకవేళ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటే, నేనొక నంబరు నొక్కి ఇక్కడి నించీ అమెరికాలో ఉన్న ఎవరితోనో మాట్లాడితే, మీరు నన్ను దేవుడనుకుంటారు, ఔనా?.
అద్భుతమంటే...... మీకు అర్ధం కానిదీ, మీ తార్కిక అవగాహనకు అందనిదీ మీకు అద్భుతంగానే అనిపిస్తుంది. మీ తార్కిక దృష్టి పెరిగిన కొద్దీ, కొన్ని వందల సంవత్సరాల క్రితం అద్భుతాలుగా తోచిన విషయాలన్నీ ఇప్పుడు మన దైనందిన జీవితంలో అతి సాధారణ విషయాలే. ఔనా కాదా? అందుకే, ఇది అద్భుతం కాదు. మీ శరీర నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకునే లోతైన అవగాహన ఇది.. మనం ఇంకాస్త శ్రద్ధ చూపాల్సింది ఈ విషయంలోనే.