ప్రశ్న: హాయ్ సద్గురు,మై లవ్!  నా ప్రశ్న ఏమిటంటే, ఎన్నో వందల కోట్ల డబ్బు వ్యవసాయం మీద, ఫుడ్ ఇంకా  అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ , అనేక  పరిశోధనా సంస్థలపైనా ఖర్చు చేస్తున్నాను. ఎంతో మంది పరిశోధకులు ఈ విషయంపై నిరంతరాయంగా పరిశోధన చేస్తున్నారు, అయినా, మనం  ఆకలి సమస్యను   ఇంకా ఎందుకు పరిష్కరించ లేకపోయాము?. నాకు చాలా విచారంగా ఉంది. ఆధ్యాత్మిక విజ్ఞానం ఈ సమస్యతో పోరాడి నిర్మూలించగలదా? ఈ రెండింటికీ సంబంధం ఉందా? ఈ అంతరాన్ని అది సమసిపొయేటట్లు చేయగలదా?

సద్గురు: ప్రపంచంలో చాలామంది ఆకలి మరియు పొషకాహారలొపంతో ఉండటానికి కారణం, తగినంత ఆహారం లేకపోవడం వల్ల కాదు.  మన దగ్గర ఈ భూమ్మీద ఉన్న 760  కోట్ల మందికి కావాల్సిన ఆహారం కంటే ఎక్కువే ఉంది, అయినా 80 కోట్ల మందికి పైగా ప్రజలు సరిగా తినడంలేదు. దానికి వ్యవసాయ వైఫల్యం కారణం కాదు,  ఆ వైఫల్యం  మనిషి గుండెది.

 

ప్రేమ ఫలించినప్పుడు 

మీరు లేచి నుంచుని ‘ లవ్’ అనే మాట వాడారు. నేను బాగానే  ఉన్నాను, ఆ మాట నా మీద వాడే బదులు,  దానిని ప్రపంచం మీద ప్రయోగిస్తే, మీ ప్రేమతో ఏమి చేయవచ్చో మనం చూడగలం. ప్రపంచంలో తగినంత ఆహారం లేకపోతే అది వేరే విషయం, మన దగ్గర కావడానికి కావలసిన దానికన్నా ఎక్కువ ఆహారం ఉండి కూడా ఇంకా చాలామంది ఆకలితోనే ఉన్నారు. ఇది మానవ వైఫల్యం,  వ్యవసాయ వైఫల్యం కాదు. మనం వ్యవసాయదారులను ఇప్పుడు పండించే దానికంటే రెండింతలు రెట్టింపు పంట పండిచమంటే,  రెండు సంవత్సరాల్లో అది సాధ్యమవుతుంది. కాని  పండించిన  ఆహారాన్ని, ఆహారం కావలసిన వారి దగ్గరకు చేర్చడం ఎలా? అదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే  అక్కడ మార్కెట్లు  ఉన్నాయి, అక్కడ  స్వలాభ పరులు ఉన్నారు, అడ్డుపడే దేశాలు ఉన్నాయి.

మనం వ్యవసాయదారులను ఇప్పుడు పండించే దానికంటే రెండింతలు రెట్టింపు పంట పండిచమంటే,  రెండు సంవత్సరాల్లో అది సాధ్యమవుతుంది

నేనొక సారి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్నప్పుడు. అక్కడ నామాటలు విన్న కొందరు నాయకులు ‘‘సద్గురూ ప్రపంచాన్ని మార్చడానికి మేము చేయగలిగింది ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పండి, అది ఏది?’’ అని అడిగారు. నేను ఒక ఇరవై ఐదు మందిపేర్లు చెబుతాను, వారిని నాకు ఓ ఐదు రోజులు అప్పగించండి, రెండు మూడు సంవత్సరాలలో ప్రపంచంలో ఎంతో మార్పు మీర గమనిస్తారు అని చెప్పాను. వారెవరు అని వారు నన్నిడిగారు. ప్రముఖ దేశాల నాయకుల పేర్లు చెప్పాను. వారిని మీరు నాకు ఐదు రోజలు అప్పగించండి. మామూలు మనుషులనైతే రెండు మూడు రోజుల్లో మార్చగలను, కాని వారు రాజకీయ నాయకులు కాబట్టి ఐదు రోజులు కావాలి అన్నాను. వారిని నాకు ఓ ఐదు రోజులు అప్పగించండి, నేను ప్రపంచాన్ని రెండు మూడు ఏళ్ళలో మార్చి వేస్తాను అని చెప్పాను.

ఉన్న ఒకేఒక్క ప్రశ్న 

ప్రపంచంలోని ఈ ఇరవై ఐదు మంది నాయకులు తమ మనస్సు మార్చుకుంటే ఆహారం అందరికీ అందేటట్లు మనం చేయగలం. పిల్లలందరూ నిండు కడుపుతో నిద్ర పోగలరు. అలా చేయడానికి  దశాబ్దాల కాలం పట్టదు, రెండు ఏళ్ళల్లో చేయవచ్చు.. ఆహారం, సాంకేతికత,రవాణా అన్నీ ఉన్నాయి. ఇంతకు మునుపు ప్రపంచంలో ఇవన్నీ లేవు. ఇరవై ఏళ్ళకు ముందుకూడా ఇది సాధ్యం అయ్యేది కాదు. కాని ఈనాడు మొట్టమొదటి సారిగా మనకు అన్నీ ఉన్నాయి. లేనిది మనిషి సమ్మతి. మనుషులు సమ్మతించడానికి ఎంత కాలం పడుతుంది? ఉన్న ప్రశ్న ఏమిటంటే మీరు, నేను ఒక తరం మనుషుల్లా దానిని జరిగేటట్లు చూస్తామా? కూర్చుని ఫిర్యాదులు చేస్తూ ఏడుస్తుంటామా? లేక నిలబడి  మనకు  ఎంత చేతనైతే అంత అది జరిగేటట్లు చేస్తామా అన్నదే ప్రశ్న. ఉన్న ప్రశ్న అదే. 

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.