ప్రశ్న: నాకు సన్నిహితంగా ఉన్నవారు నా కర్మనుపెంచుతున్నారా? అదే నిజమైతే, దానితో నేను ఏ విధంగా వ్యవహరించాలి?

సద్గురు: సరిజేయాలవలసింది మీ కుటుంబంలోని వారు అనుకోకండి. ఎవరి కర్మను ఎవరు అనుభవిస్తున్నారో ఎవరికి తెలుసు? వారు ఇంకేదో చెప్పవచ్చు. మీకు మీ కుటుంబం చెడ్డదని మీకనిపిస్తే, వారు ఆ విధంగా మారి ఉండవచ్చు, వారు అలానే ఉండిపోవాలని ఏమీ లేదు కదా? చంద్రుడికి ఉన్నట్లుగా వారికి కూడా దశలు ఉండవచ్చు. కొన్ని ఇష్టమైనవి కావచ్చు మరికొన్ని అయిష్టమైనవి. కుటుంబ వ్యక్తులతో ఎంతో సన్నిహితంగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. మీ జీవితం, మీ బాధ్యత

మీ జీవితంలో ఏది జరిగినా అందుకు మీరే బాధ్యులు. మీ కర్మ, అంటే మీరు చేసుకున్నదే. మీరు ఆధ్యాత్మిక పధంలో నడుస్తూ, 'కర్మ' అని మీరంటుంటే, అదెప్పుడూ మిమ్మల్ని ఉద్దేశించినట్లే. ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు , అది వాళ్ళు చేసిన కర్మకి ఫలితం, అనడం సరైన పద్ధతి కాదు. అలా చేస్తే మీరు మీలోని మానవత్వాన్ని కోల్పోతారు. వేరేవారి కర్మతో ఎప్పుడూ మీకు సంబంధం లేదు. ఇంకొకరి కష్టాన్ని ప్రత్యక్షంగా చూడడమే మీ కర్మ.

మరొకరి కర్మని గురించి మాట్లాడిన మరుక్షణం మీరే దుష్ట శక్తి అవుతారు. దుష్ట శక్తి అంటే అది ఉద్దేశ్య పూర్వకంగానే కానక్కరలేదు. దుష్ట శక్తి అంటే, మీరు ఏది చేసినా మీ చుట్టు ప్రక్కల వారికి అది చెడు ఫలితాలు అందించవచ్చు. మీరు ఇతరుల కర్మను గురించి ప్రస్తావించిన మరుక్షణం మీరు ఆ దిశగానే వెళ్తున్నట్లు.

ఆధ్యాత్మికతలో ఈ విషయాన్ని చెప్పడానికే మా ప్రయత్నం, ‘మీకు ఏది జరిగినా అది మీరు చేసుకున్నదే అని మీరు తెలుసుకోవడం. ఇది మీ జీవితంలో జరుగుతున్నది, అంటే ఇది మీ కర్మ. మీ చుట్టు ప్రక్కల ఉన్నవారితో మీరు సుఖపడుతున్నారో, దు:ఖపడుతున్నారో అదంతా మీ కర్మ.

అందువల్ల మీ కుటుంబం మీకు అందచేసే కర్మను గురించి దిగులుపడకండి - అటువంటిదేమీ లేదు. "కుటుంబం" అనేది మన మనస్సులోనే ఉంది. మీ కుటుంబంలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో, ఎవరు మీకు సన్నిహితులో, ఎవరు కాదో, ఇది పూర్తిగా మీ మనస్సుకి సంబంధించిన విషయం. మీకు మనస్సు లేకపోతే, కుటుంబం అనే వ్యవస్థే మీ ఉనికిలో ఉండదు. అంటే, కుటుంబంలోని వారందరూ మీ కర్మానుసారమే వచ్చారు మీ జీవితంలో జరుగుతున్నది అంతా మీరు చేసుకున్నదే అని మీరు గ్రహించాలి. ఇది గ్రహించినప్పుడు మీరు ఒక వ్యక్తిగా మారుతారు. అంతవరకూ మీరు చెల్లా చెదురుగా ఉండిపోతారు. ప్రజలు తమని తాము చెల్లా చెదురుగా ఉంచుకుంటూ, వేరువేరు విషయాలతో గుర్తుంచు కోవడం వలన, ఒక వ్యక్తిగా మారడానికి చాలా సమయం పడుతుంది. అది జరిగితే, మీరు కోరుకున్నది మీకు క్షణంలో అందగలదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు