అతిగా ఆలోచించడాన్ని ఆపడం ఎలా?
నిర్భందపు ఆలోచనల్లో మీరు చిక్కుకుపోయారా? మనస్సులో చిక్కుకుపోవడం గురించీ, అలాగే దాని నుండి ఒకరు ఎలా బయటకు వచ్చి మరింత స్పృహలోకి రాగలరు అన్నదాని గురించీ సద్గురు ఏం చెప్తున్నారో తెలుసుకోండి.
మీకు తప్పు గుర్తింపులు ఉన్నాయి, అలాగే ఒకసారి తప్పు గుర్తింపులు ఏర్పడ్డాక, మనసు పని నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. మీరు దాన్ని ఆపలేరు, మీరు ఏం చేసినా సరే! అయితే అది ఒక పరిమిత స్థాయి లోపల ఉంటే, మీరు దాన్ని సర్వసాధారణమే అనుకుంటారు. అది సాధారణం కాదు. మీరు సామాజికపరంగా ఆమోదింపబడే స్థాయి పిచ్చిలో ఉన్నారు. అందరూ అదే విధంగా ఉన్నారు కాబట్టి మీరు పర్వాలేదు అనుకుంటారు. కానీ, మీ బుర్రలో ఒక ఆలోచన కూడా లేకుండా ఇక్కడ కూర్చోవడంలోని ఆనందం మీకు తెలీదు. నన్ను నేను నాలుగైదు రోజుల పాటు ఉపసంహరించుకుంటే, ఆ నాలుగు ఐదు రోజుల పాటు నాలో ఒక్క ఆలోచన కూడా ఉండదు. నేను ఏమీ చదవను, లేదా కనీసం కిటికీలో నుంచి బయటకి కూడా చూడను. నేను ఊరికే ఒక ఆలోచన కూడా లేకుండా కూర్చుంటాను, అంతే.
ఉదాహరణకు మీరు ఒక మహత్తరమైన సూర్యోదయాన్ని చూసినప్పుడు, కొంత సమయం వరకు మీ ఆలోచన మాయమైపోతుంది. ఎందుకంటే అంతకంటే పెద్దది జరుగుతుంది కాబట్టి. లేదా మీరు చాలా ముఖ్యమైనదని అనుకునే దేనిలోనైనా నిమగ్నమైనప్పుడు కూడా, కొంత సమయం వరకు ఆలోచన అనేది మాయమైపోతుంది. మీ జీవితంలో ఆవే అందమైన క్షణాలు.
మీరు మరింత పెద్దదయిన దానితో స్పర్శలో ఉంటే, చిన్న విషయాలు సహజంగానే ఆవిరైపోతాయి. మీలో పనిచేస్తున్న జీవ మూలం అనేది మీ ఆలోచనా ప్రక్రియ కన్నా ఎంతో పెద్ద విషయం. మీరు దానితో ఎప్పుడు స్పర్శలోకి రాలేదు కాబట్టి ఈ ఆలోచన అనేది ఎంతో ముఖ్యమైనదిగా అయ్యింది. లేదా మరోలా చెప్పాలంటే, మీ ఆలోచనలు ముఖ్యమైనవిగా ఉన్నాయి అంటే, ఎక్కడో మీ వక్రీకరించబడిన దృష్టిలో, సృష్టికర్త యొక్క సృష్టి ముఖ్యమైనదిగా లేదు. మీ సొంత సృష్టి ఎంత ముఖ్యమైనదిగా అయింది. మీలోనే ఉన్న సృష్టికర్తపై, లేదా అతని సృష్టిపై, మీరు ద్రుష్టి పెట్టడం లేదు. కానీ మీ సొంత సృష్టితో మీరు బిజీగా ఉన్నారు. అది సృష్టి కర్త గురించి చేసే అత్యంత హీనమైన అపరాధం కదా? క్షణకాలం కూడా మీ లోపల ఉన్న సృష్టి మూలం వైపుకి మీ ధ్యాస మళ్ళలేదు. ఆలోచించడంగానో, లేదా ఏదో చేయడంగానో కాకుండా, ఇక్కడ కేవలం ఒక జీవంగా ఉండటంలోని ఆనందం మీకు తెలిస్తే, అప్పుడు జీవితం ఎంతో భిన్నంగా ఉంటుంది.
సృష్టి మూలంతో స్పర్శ లోకి రావడం
బాహ్య ప్రపంచం విషయానికి వస్తే, విభిన్నమైన మనుషులు విభిన్నమైన సామర్థ్యాలతో ఉంటారు. కానీ అంతర్ముఖ విషయానికి వస్తే, మనందరం ఒకే స్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము. అది జరగకపోవడానికి కారణం, మీరు ఎప్పుడూ ధ్యాస పెట్టకపోవడమే, అంతే కాని అది కష్టమైనదో, అందుకోలేనిదో, లేదా మీరు అర్హతలేని వారిరో అవ్వడం వల్ల కాదు. అంతర్ముఖ స్వభావం విషయానికి వస్తే, ప్రతి మనిషీ కూడా సమాన అర్హత కలిగి ఉన్నాడు. బాహ్య ప్రపంచంలో మీరు ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నా, లేదా ఒక వంట వండాలనుకున్నా, లేదా మరేదైనా చేయాలనుకున్నా మనలోని ప్రతి ఒక్కరికి వేరువేరు సామర్థ్యాలు ఉంటాయి. కానీ అంతర్గత వాస్తవికతల విషయానికి వస్తే, మన అందరికీ సమాన సామర్థ్యం ఉంటుంది. అది ఒకరికి జరిగి మరొకరికి జరగకుండా ఉండటానికి కారణం, కేవలం వారు ధ్యాస పెట్టకపోవడమే, అదొక్కటే కారణం.
ప్రజలు ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ఎంతో కష్టమైనది అనే ఈ నిర్ధారణకు వచ్చారు, ఎందుకంటే వాళ్ళు సరికాని పనులు చేస్తూ ఉంటారు. బయట ప్రపంచం విషయంలో మీరు సరైన పనులు చేస్తే తప్ప విషయాలు జరగవు, అని మీరు అర్థం చేసుకున్నారు. అంతర్ముఖంలో కూడా అదే వాస్తవం. ఒక రోజున ఒక టూరిస్టు దగ్గర్లో ఉన్న ఒక గ్రామానికి వచ్చి, “ఈశా యోగ కేంద్రం ఎంత దూరం?” అని అడిగాడు.
ఆ గ్రామంలోని పిల్లడు, “అది 24,996 మైళ్లు.” అన్నాడు.
అతను, “ఏంటి! అంత దూరమా?” అన్నాడు.
ఆ పిల్లోడు, “అవును, మీరు వెళ్తున్న దిశగా వెళితే అంత దూరం, మీరు వెనక్కి తిరిగి నడిస్తే అది కేవలం నాలుగు మైళ్ళు” అన్నాడు.
మీరు తప్పు పైపు చూస్తూ ఆధ్యాత్మికంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు - ఇప్పుడు ఇది ఎంతో సుదీర్ఘ ప్రయాణం. మీరు విశ్వాన్నంతటినీ దాటి వెనక్కి రావాలి. మీరు వెనక్కి తిరిగితే, అది ఇక్కడే ఉంది. ఎందుకంటే మీరు వెతుకుతున్నది మీలోనే ఉంది, మీ బయట కాదు. మీ లోపల ఉన్న దాన్ని మీకు, మీరే తప్ప మరెవరూ నిరాకరించలేరు. మీ అంతర్ముఖంలోకి మీరు వెళ్లడాన్ని ఎవరైనా నిరాకరించగలరా? అది జరగడం లేదూ అంటే, మీరు అర్థం చేసుకోవాలి, మీరు అందుకు అవసరమైన సుముఖతను సృష్టించ లేదు అని. దానికి మరి ఏ ఇతర కారణము లేదు.
మీ మనసు నుండి బయట పడ్డారా?
ప్రస్తుతం మీ ఆలోచనలను అణిచివేయాలని ప్రయత్నించకండి. అతిపెద్ద తప్పిదం, ఏంటంటే ప్రజలు మీకు, “మనసు నియంత్రించండి” అని చెప్పారు. ఒకసారి మీరు మీ మనసుని నియంత్రించడానికి ప్రయత్నిస్తే మీ పని అయిపోయినట్టే! ఉదాహరణకి ప్రస్తుతం మీరు శాంభవి మహాముద్ర సాధన చేస్తున్నారు, మీరు ఆ సాధన చేస్తే, అది మీకూ మీ శరీరానికి, ఇంకా మీకూ మీ మనసుకూ మధ్య కొంత ఎడం తీసుకువస్తుంది. మీరు శాంభవి చేసి ఊరికే కూర్చోండి - మీ శరీరం ఇక్కడ ఉంటుంది, మనసు బయట ఎక్కడో ఉంటుంది, నేను అని మీరు అనుకునేది మరి ఎక్కడో ఉంటుంది. ఒకసారి ఈ వ్యత్యాసం వచ్చాక, ఇక మనసుతో సమస్య ఉండదు.
ఒకసారి మీరు మనసు నుండి బయట పడితే ఇక సమస్య ఉండదు. ఎవరైనా మీతో, “You are out of your mind,” అంటే దానిని అవమానంగా భావించకండి.అది ఎవరైనా మీకు ఇవ్వగల అతి గొప్ప అభినందన. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒక బుద్ధుడు అని అంటున్నారు. బుద్ధుడు అంటే అతను తన మనసులో నుండి బయట పడ్డాడు అని. ప్రజలు మనసు నుండి బయట పడటం అంటే పిచ్చి అనుకుంటారు. అది పిచ్చి కాదు. పిచ్చి అనేది కేవలం మనసులో మాత్రమె ఉంటుంది. మీరు మనసు నుండి బయట పడితే, మీరు 100% విచక్షణతో ఉంటారు. అదే పిచ్చికి అంతం. ఇప్పుడు మీరు జీవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు.
ఒకసారి మీరు జీవాన్ని, మీ మనసులో ప్రతిబింబిస్తున్న విధంగా కాకుండా, ఉన్నదున్నట్టుగా చూస్తే, అప్పుడు మీరే చూస్తారు ప్రతిదీ కూడా ఎంతో చిన్నది అని. ఈ మనసు చేయగలిగిందీ, ఈ ప్రపంచం చేయగలిగినవీ అన్నీ ఎంత చిన్నగా ఉంటాయంటే, వాటిని మీరు మీ ఇష్టం వచ్చినట్టు అడగలిగేంత చిన్నగా ఉంటాయి. మీకు అసలు ఇష్టం లేకపోతే, మీరు ఏమి చేయకుండా ఉండొచ్చు. రెండూ కూడా ఎరుకతో చేసావే అవుతాయి. మీరు ఇక నిర్బంధంగా చేసేది అంటూ ఏమీ ఉండదు. మీరు ఈ సృష్టి మూలాన్ని చూడటం మొదలు పెట్టిన క్షణమే, మీ లోని అన్ని నిర్బంధతలూ తొలగిపోతాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఎంపిక ద్వారా జరుగుతుంది, ఇంకా జీవితం అందంగా అవుతుంది.
జీవితం ఆనందంగా అయ్యేది, ఏం జరుగుతుంది అన్న దాని వల్ల కాదు, కానీ అది అందంగా అయ్యేది మీరు దాన్ని చేయడానికి ఎంచుకున్నందు వల్ల. ఏది అందమైనదీ కాదు, వికారమైనదీ కాదు. మీరు అది చేయడానికి ఎంచుకొని అందులో నిమగ్నమైతే ప్రతిదీ కూడా అందంగానే ఉంటుంది. అది మీ మీద రుద్దబడితే, లేదా మీరు దానిని నిర్భంధంగా చేస్తూ ఉంటే, ప్రతిదీ కూడా ఘోరంగా ఉంటుంది. ఇదే మానసిక చర్యకి కూడా వర్తిస్తుంది. అది ఎరుకతో చేస్తున్నట్లైతే, ఒక గొప్ప పరికరం అయిన ఈ మనసుతో మీరు ఆడుకోగలిగేవారువారు, కానీ అది నిర్భందంగా ఉంది కాబట్టి, అది ఒక ఒత్తిడిగా అయింది.