‘ఈశా’ పద్ధతిలో ॐకార ధ్యానాన్ని చేసిన క్రీడాకారులలో, శరీరంలో నీటిశాతం ఆవశ్యకతను గూర్చిన అవగాహన ఎక్కువ అయిందని, న్యూ ఢిల్లి లోని లేడి ఇర్విన్ కళాశాల వారి అధ్యయనంలో కనుగొన్నారు. డా.ప్రీతి రిషిలాల్ 2011 లో “ clinical and sports nutrition” అనే అంశంపై జరిపిన పరిశోధనలో భాగంగా ఈ అధ్యయనాన్ని రెండు నెలలపాటు చేశారు. ఈ అంశాన్ని యునైటెడ్ స్టేట్స్ లోని ఇల్లినాయిస్లో, అక్టోబరు నెలలో ఆహార అధ్యయనంపై జరిగే అంతర్జాతీయ సదస్సులో సమర్పించనున్నారు.భారత క్రీడాధికార సంస్థ (స్పోర్ట్స్ అథారిటి ఆప్ ఇండియా) వారు నిర్వహించిన “Come and Play” అనే పథకంలో భాగంగా ‘యువ హాకి ఆటగాళ్ళలో నీరు త్రాగే అలవాటును మెరుగు పరచటం’ అనే విషయంపై ఆంచల్ అగర్వాల్ చేసిన మాస్టర్ థీసిస్ లో కూడా ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ॐకారమే ఎందుకు?

ఆటలాడేటప్పుడు తగిననంత నీరు త్రాగాలనే విషయాన్ని ఆటగాళ్లకు ఎంతగా అర్థమయ్యేలా చెప్పినా, తీరా ఆట జరిగే సమయానికి వారు శరీరంలో నీరు తక్కువ అవటం వల్ల ఇబ్బందిపడటాన్ని అగర్వాల్, డా. లాల్ కనుగొన్నారు. దానితో ఆటగాళ్ళు శారీరక సామర్థ్యాన్ని కోల్పోయి చక్కని ఆటను ప్రదర్శించలేకపోయేవారు.అంతేకాక వారు దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యలపాలు అయ్యేవారు.

“ఆటగాళ్లకు శరీరపు నీటి అవసరాలను గూర్చి బోధించాం. వాళ్లకు సమాచారాన్ని ఇవ్వటమే కాక డెమోల ద్వారా అనుభవపూర్వక జ్ఞానాన్ని కలిగించాం. అంతేకాక శరీరాన్ని తగినంత నీటిని అందజేయటంపై ఒక చిన్న పరీక్షను కూడా నిర్వహించాం, అందులో చాలా మంది నూటికి నూరు శాతం మార్కులను సాధించారు. వారికి ఏమి చెయ్యాలో తెలుసు, కాని చెయ్యటం లేదు.జ్ఞానానికి ఆచరణకు మధ్య ఉండాల్సిన లంకెఎదో లేదు. శారీరక నీటి ఆవశ్యకతను గూర్చిన చైతన్యపూర్వకమైన అవగాహన కలగవలసి ఉంది.” అని డా.లాల్ అన్నారు. అందుకు ॐకారమే జవాబా?

ॐకార ధ్యానం వల్ల కలిగే మానసిక, శారీరక ప్రయోజనాలను గూర్చి పరిశోధనలు ఇప్పటికే వివరించాయి.ఈశా అందిస్తున్న ॐకార ధ్యానానికి ఇతరులు ఇచ్చేదానికి మధ్య భేదం ఉందని అగర్వాల్,డా. లాల్ అంటారు. “ఇటీవలి అధ్యయానాలు ॐకారాన్ని ఒకే అక్షరంగా వర్ణిస్తూంటే ఈశాఫౌండేషన్ వారు మూడు అక్షరాలుగా బోధిస్తారు.” అంటారు అగర్వాల్. శాంభవి ముద్ర వల్ల కలిగే ప్రయోజనాలపై జరిగిన పరిశోధనలను ప్రస్తావిస్తూ “ఆకారంతో కూడిన యోగాభ్యాసాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తున్నాయి” అంటారు ఆమె.అందు వల్లనే శరీరంలో నీటి ఆవశ్యకతకు సంబంధించిన “జ్ఞానానికి ఆచరణకు మధ్య ఉండాల్సిన లంకె”పై చేసే పరిశోధనకు ॐకార ధ్యానాన్ని సాధనంగా ఆ పరిశోధకులు ఎంచుకున్నారు.

ముప్ఫయ్ మంది ఆటగాళ్లను రెండు గుంపులుగా చేశారు. ఒక గుంపుకు శరీరానికి తగినంత నీటిని గ్రహించటం గూర్చి వివరించారు. రెండవది ప్రయోగాత్మకమైన గుంపు. వారికి శరీరానికి తగినంత నీటిని అందించటం పట్ల అవగాహనతో పాటుగా రోజుకు 21 నిముషాల చొప్పున 21 రోజుల పాటు ॐకారధ్యానాన్ని చేయించారు. 21 రోజులు పూర్తి అయిన తరువాత మరొక గుంపు కంటే, ॐకారధ్యానాన్ని చేస్తున్న గుంపులోని క్రీడాకారులకు శరీరాల్లోని నీటిశాతం ఆరోగ్యకరంగా ఉన్నట్లు పరీక్షల్లో తెలిసింది.హృదయ స్పందనలు,శారీరక చురుకుదనం, దక్షత మెరుగు పడ్డాయని అధ్యయనం తెలిపింది. వారంతా మరింత ఆనందంగా,ప్రశాంతంగా,చక్కని ఏకాగ్రతను కలిగి ఉన్నారు.

“క్రీడా ప్రదర్శన మెరుగుపడటంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా కలిగాయని వారు నాతొ చెప్పారు. ఇంట్లో అందరితో చక్కగా కలిసి మెలిసి ఉంటున్నానని ఒకతను చెప్పాడు.ఈ అధ్యయనంలో వారంతా మరింత పరిణతి పొందారని తెలుస్తోంది. ఈ పరిశోధన మరెన్నింటికో తెరతీసింది.ఈశా అందిస్తున్న ధ్యాన పద్ధతుల ప్రయోజనాలపై రెండు అధ్యయనాలకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశాం.” అన్నారు లాల్.

ప్రేమాశీస్సులతో,

సద్గురు