సోనాక్షి సిన్హా: ప్రియమైన సద్గురు, నేను చాలా ఎమోషనల్ వ్యక్తిని - చాలా సందర్భాల్లో ఎటువంటి భావోద్వేగం లేకుండా పరిస్థితుల నుండి తప్పుకోవడం కష్టమవుతుంది. అది నాకు మంచిది కాదని తెలుసు. దీని పర్యవసానం నాకు నచ్చినట్టు ఉండదని నాకు తెలుస్తుంది కానీ నా మనసుని, భావోద్వేగాల్ని వాటినుంచి మళ్ళించుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితిని నేను ఎలా సంభాళించుకోవాలో చెప్పండి.

సద్గురు: ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడేది వీటి గురుంచే, బుద్ధి ఇంకా మనసు! నిజానికి వీటి మధ్య తేడా ఎమీ లేదు, ఎందుకంటే మీరెలా ఆలోచిస్తే అలాగే అనుభూతి చెందుతారు. అలాగే మీరు ఏలా అనుభవిస్తారో అలానే ఆలోచిస్తారు.

కొంతమందికి, ముఖ్యంగా విద్యా విధానం వల్ల, మనుషుల ఆలోచనలు, భావోద్వేగాల కంటే ముందు వస్తాయ్. కానీ ఇప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆలోచనల కంటే ముందు భావోద్వేగాలు వచ్చే మనుషులు ఉన్నారు.

ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్కటి ముందు వస్తుంది. కొంతమందికి, ముఖ్యంగా విద్యా విధానం వల్ల, మనుషుల ఆలోచనలు, భావోద్వేగాల కంటే ముందు వస్తాయ్. కానీ ఇప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆలోచనల కంటే ముందు భావోద్వేగాలు వచ్చే మనుషులు ఉన్నారు. భావోద్వేగ సూచీ గురుంచి ఈ రోజుల్లో మాట్లాడుతున్నప్పటికీ, ఇలా భావోద్వేగాలు ముందు వచ్చేవాళ్ళని ఈ రోజుల్లో జనాలు పిచ్చివాళ్ళుగా జమకడుతున్నారు. ఎందుకంటే, వారికి భావోద్వేగానికున్న శక్తి ఇంకా విజ్ఞతల గురించి అర్థం కాదు. 

ఆలోచనలు-భావాలు

ఇప్పుడు సోనాక్షి ఏం అడుగుతున్నారంటే, కొన్ని సందర్భాలు మీకు ఇష్టం లేకపోయినా అవి భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. అందుకే ఆలోచన అటు వెళ్తుంది..మీరు కూడా తెలియకుండానే ఆ మార్గంలో వెళ్తారు. 

ఆలోచన చురుకైనది, త్వరగా మారిపోతుంది. కాని భావోద్వేగం రసవంతమైనది, మారటానికి కొంత సమయం పడుతుంది.

ఆలోచన చురుకైనది, త్వరగా మారిపోతుంది. కాని భావోద్వేగం రసవంతమైనది, మారటానికి కొంత సమయం పడుతుంది. ఇవాళ మీరు “ఆహా, ఈమె చాలా అధ్బుతమైన వ్యక్తి” అని అనుకోవచ్చు. రేపు ఆమె మీకు నచ్చని పని ఏదైనా చేస్తే, “ఆవిడ మంచిది కాదు” అనే ఆలోచన వస్తంది. కానీ భావోద్వేగాలు అంత వేగంగా మారిపోవు. ఒకవేళ నా భావోద్వేగాలు ఆ వ్యక్తిని దాటిపోతే, అవి అంత త్వరగా, తిరిగి రావు. దీనికి సమయం పడుతుంది. ఈ లోపు మీకు సంఘర్షణ తప్పదు. 

బుర్రనిండా కోతులే

దీనికి మీరు ఏం చెయ్యాలి? మీ భావోద్వేగాల్ని లేదా ఆలోచనల్ని నియంత్రించకండి. ఎందుకంటే మీ బుద్ధి యొక్క లక్షణమేమిటంటే, ఎవరి గురించైతో ఆలోచించకూడదు అనుకుంటామో, అదే ఆలోచన జీవితాంతం ఆలోచించేలా చేస్తుంది. 

మన ఈ బుద్ధిలో తీసివేతలు, భాగాహారాలు లేవు, కేవలం కూడికలు, గుణకారాలే.

బాగా పేరొందిన ఒక కోతుల కథ ఉంది. “అయిదు సెకన్ల వరకు కోతుల గురుంచి ఆలోచించకండి” అని అంటే, మీరు ఆలోచించకుండా ఉండగలరా? కేవలం కోతుల గురుంచి..! ఎందుకంటే మీ బుద్ది యొక్క లక్షణం ఇదే. మీరు “ఇదే నాకు వద్దు” అంటే, అది మాత్రమే జరుగుతుంది.

ఇటువంటి నిర్భందమైన ఆలోచనలూ, భావోద్వేగాలూ వచ్చినప్పుడు, మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటంటే, అవి ఎలా ఉన్నాయో అలాగే చూడండి, వాటిని ఆపే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే, వెంటనే అవి ఎన్నో రెట్లు పెరిగిపోతాయి.

మన ఈ బుద్ధిలో తీసివేతలు, భాగాహారాలు లేవు, కేవలం కూడికలు, గుణకారాలే. నేను “ఈ భావోద్వేగం నాకు వద్దు” అంటే, వెంటనే అవి పెరిగిపోయి, ఒకటి రెండవుతుంది. మీరు “ఓ దేవుడా! ఇది మళ్ళీ వస్తుంది, నాకు అది వద్దు” అంటే, అది వంద రెట్లు పెరిగిపోతుంది. అది మీ బుద్ది యొక్క లక్షణం. ఈ బుద్ధిలో దేనినీ మీరు బలవంతంగా తీసేయ్యలేరు. 

సమాచారంతో దూరం

మీరేం చేయాలంటే, ఒకటి అర్ధం చేసుకోండి, మీ ఆలోచనలు భావోద్వేగాలూ కేవలం మీకు ఇప్పటికే ఉన్న జ్ఞ్యాపకాలు, సమాచారాల రూపం అని. జ్ఞ్యాపకానికి కాస్త వాసన ఎక్కువ. తిరిగి వస్తూనే ఉంటుంది. మీరు దాన్నుంచి కొంచెం దూరంగా ఉండాలంతే. 

ఇది ఎలా అంటే, మీరు విమానాశ్రయానికి వెళ్తూ ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. మీకు ఎంత ఆందోళన ఇంకా చికాకు కలుగుతుంది? ఎలాగోలా విమానాశ్రయం చేరుకొని విమానం ఎక్కారు. అక్కణ్ణించి కిందకి చూస్తే అదే ట్రాఫిక్ జామ్ ఎంత అందంగా కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడది కాస్త దూరంగా ఉంది. అదే ట్రాఫిక్ జామ్, కానీ దూరంగా ఉండటంవల్ల, ఇప్పుడు ఇబ్బంది లేదు. 

అదే విధంగా మీరు కొంత సాధన చేస్తే, మీ ఆలోచనా భావోద్వేగాల నించీ మీ మానసిక శారీరిక ప్రక్రియల్ని దూరం పెట్టవచ్చు. కానీ మీరు ఒక్కొక్క ఆలోచననీ, భావోద్వేగాన్ని సంబాళించే ప్రయత్నం చేస్తే, అవి వేల రెట్లు పెరిగిపోతాయ్.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image