యోగి మరియు మార్మికుడు అయిన సద్గురు విభూథిని తయారు చేసే వివిధ పద్దతులను, ఎలా ఉపయోగించాలి మరియు శరీరం పై ఎక్కడ రాసుకోవాలి అను వాటి గురించి వివరించారు.


సద్గురు: విభూథిని (లేక) పవిత్ర బూడిదను ఉపయోగించటంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. మొట్ట మొదటగా ఇది శక్తిని ప్రసురింప (లేక) బదిలీ చేసే ఒక గొప్ప మాధ్యమo మరియు దీనికి శక్తీ శరీరాన్ని(ప్రాణమయ కోశం) నియత్రించి మరియు నిర్దేశించే సామర్ధ్యం ఉన్నది. వీటితో పాటుగా, శరీరం పైన పూసుకుంటే దీనికి ఒక సంకేతాత్మకమైన ప్రాధాన్యత ఉన్నది. అదేమిటంటే జీవితం యొక్క ముగింపు (లేక) మరణించే స్వభావాన్ని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది –   మీరు అశాశ్వతo అనే తత్వాన్ని మీ శరీరం పైన నిరంతరం ధరించినట్లుగా.

సాధారణంగా, యోగులు స్మశానం నుండి సేకరించిన బూడిదను విభూథిగా ఉపయోగిస్తారు, ఆ బూడిదను ఉపయోగించుటకు వీలు కాకపోతే తరువాతి ప్రత్యామ్నాయం ఆవు పేడను ఉపయోగించటం. కొన్ని వేరే పదార్థాలు కూడా ఉపయోగిస్తారు కాని మూల పదార్ధం, అయితే ఆవు పేడ. ఒక వేళ ఈ బూడిదను కూడా ఉపయోగించక పొతే, తరువాతి ప్రత్యామ్నాయం బియ్యం పొట్టు నుండి తయారు చెయ్యటం. ఇది శరీరం మూల పదార్ధం కాదు, కేవలం పొట్టు మాత్రమే అని సూచిస్తుంది.

మనం పవిత్ర బూడిదను ఎందుకు ఉపయోగించాలి?

దురదృష్టవశాత్తు, చాలా ప్రదేశాల్లో ఇది ఒక మోసపూరిత వ్యాపారం అయ్యింది. అక్కడ వారు యధాలాపంగా తెల్లని రాయి పొడుముని పవిత్ర బూడిదగా ఇస్తున్నారు. కానీ దీనిని సరిగా తయారు చేసి మరియు మీకు దీనిని ఎక్కడ ఎలా పూసుకోవాలో తెలిస్తే, పవిత్ర బూడిద మిమ్మల్నిఎక్కువ గ్రహణశీలురుగా తయారు చేస్తుంది; మరియు మీ శరీరం పైన మీరు విభూథిని పూసుకునే స్థలం చాలా సున్నితంగా తయారు అయ్యి మీ అంతిమ స్వభావానికి దారి తీస్తుంది. కావున, ఉదయాన్నే మీరు ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో విభూథిని పూసుకుంటే మీరు మీ చుట్టూ ఉండే దైవత్వాన్ని స్వీకరిస్తారు, దానవత్వాన్ని కాదు.

ఈ క్షణం మీలోని ఏ అంశం గ్రహణశీలంగా ఉన్నదో అన్న దాని పైన ఆధారపడి మీరు మీలో ఉన్న వివిధ పరిణామాల్లో మీరు జీవితాన్ని వివిధ విధాలుగా స్వీకరిస్తారు. మీరు దీనిని గమనించే ఉంటారు - ఒక సమయములో మీరు చూసిన దానిని ఒక విధముగా అనుభూతి చెందుతారు. ఇంకొక సమయములో మీరు మరళా దానినే చూసినప్పటికీ మొత్తానికి వేరొక విధముగా అనుభూతి చెందుతారు. మీరు జీవితాన్ని గ్రహించే విధానమే ఈ భేదాలను కలిగిస్తుంది. కావున, మీలో ఉన్న ఉన్నత అంశాలకు గ్రహణశీలంగా ఉండాలి అనుకుంటారు, తక్కువ వాటికి కాదు.

నిర్దిష్ట ప్రదేశాల్లో విభూథిని పూసుకుంటే మీరుమీ చుట్టూ ఉండే దైవత్వాన్ని స్వీకరిస్తారు, దానవత్వాన్ని కాదు.

మీ భౌతిక శరీరంలో ఏడు ప్రాధమిక కేంద్రాలు, జీవితాన్ని అనుభూతి చెందే ఏడు పరిణామాలను సూచింప చేస్తూ ఉంటాయి. ఈ కేంద్రాలను చక్రాలు అని పిలుస్తాము. చక్ర అనేది శక్తీ వ్యవస్థలో ఒక నిర్దిష్ట కేంద్రం. ఈ చక్రాలు భౌతికంగా ఉండవు, అవి అతి సూక్ష్మ స్వభావం కలిగినవి. ఎవరైనా వీటిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలరు, కానీ ఒక వేళ మీరు శరీరాన్ని కోసి చూసినా మీకు ఏ చక్రము కనపడదు. మీరు తీవ్రతతో ఉన్నత స్థాయికి వెళ్ళేకొలది, సహజంగా శక్తులు ఒక చక్రం నుండి ఇంకొక చక్రమునకు పెరుగుతాయి. ఒక వేళ మీరు ఉన్నత చక్రాల నుండి జీవితాన్ని స్వీకరిస్తే , ఒకే పరిస్థితి మీరు తక్కువ చక్రాల నుండి స్వీకరించే జీవితం దాని కంటే భిన్నంగా ఉంటుంది.

మనం విభూథిని ఎందుకు పూసుకోవాలి?

సంప్రదాయబద్దంగా విభూథిని బొటనవేలు మరియు ఉంగరపు వేలు మధ్య నుండి తీసుకోవాలి- మీరు ఎక్కువ మొత్తం తీసుకోవలసిన అవసరం లేదు, కొంచెం తీసుకొని ఆజ్ఞ చక్ర అని పిలవబడే మీ కను బొమ్మల మధ్యన ,విశుద్ధి చక్ర అని పిలవబడే నామాల గుంత ( గొంతు క్రింద ఉండే గుంత) మరియు అనాహత అని పిలువబడే ఛాతి ఎముకలు కలిసే మధ్య ప్రదేశాలలో పూసుకోవాలి. భారత దేశంలో ఈ కేంద్రాలలో విభూథిని పూసుకోవాలి అన్నది సాధారణ విజ్ఞానం. నిర్దిష్ట ప్రదేశాలను పేర్కొనటానికి కారణం విభూథి వీటిని మరింత సున్నితంగా మారుస్తుంది.

ఇది చాలా లోతైన శాస్త్రము, కానీ ఈ రోజుల్లో దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్ధం చేసుకోకుండా మనం కేవలం నుదురు పైన నామాలు పెట్టుకుంటాము.

సాధారణంగా విభూథిని అనాహత దగ్గర పూసుకొంటే మీరు జీవితాన్ని ప్రేమగా స్వీకరిస్తారు, విశుద్ధి దగ్గర పూసుకుంటే మీరు జీవితాన్ని శక్తిగా స్వీకరిస్తారు. శక్తీ అంటే కేవలం భౌతికం (లేక) మానసికమే కాదు, ఎన్నో విధాలుగా మానవుడు శక్తివంతుడుగా ఉండవచ్చు. మీ జీవ శక్తులను బలంగా శక్తివంతముగా చేసి, మీ ఉనికే మీ చుట్టుపక్కల జీవాన్ని ప్రభావితం చెయ్యగలగటమే ముఖ్య ఉద్దేశం. మీరు మాట్లాడవలసిన పని లేదు లేక ఏమి చెయ్యనవసరం లేదు మీరు కేవలం కూర్చుని ఉండటం వల్లనే మీ చుట్టూ ఉన్న పరిస్థితిని ప్రభావతం చెయ్యగలరు. మానవుడు ఈ రకమైన శక్తిని పెంపొందించుకోవచ్చు.విభూథిని ఆజ్ఞ దగ్గర పూసుకుంటే జీవితాన్ని విజ్ఞానంగా స్వీకరించవచ్చు.

ఇది చాలా లోతైన శాస్త్రము, కానీ ఈ రోజుల్లో దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్ధం చేసుకోకుండా మనం కేవలం నుదురు పైన నామాలు పెట్టుకుంటాము. ఒక రకంగా నామాలు పెట్టుకునే వారు ఇంకొక రకంగా నామాలు పెట్టుకునే వారిని ఒప్పుకోరు. ఇది మూర్ఖత్వం. విభూథి అనేది శివుడో లేక ఏ దేవుడో ఇచ్చినది కాదు. ఇక్కడ విశ్వాసం అన్నది ప్రశ్న కాదు. భారతీయ సంస్కృతిలో దీనిని ఒక వ్యక్తి ఎదుగుదలకు సాధనంగా చూస్తారు. సరి అయిన పద్దతిలో తయారు చేసిన విభూథికి భిన్నమైన వైభవం ఉంటుంది. దీనిని పునరుద్ధరించి వెనుక ఉన్న శాస్త్రాన్ని ఉపయోగించుకోవలసిన అవసరం ఉన్నది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

శుద్ధమైన విభూతిని మీరు ఈశా షాప్ లో కొనుగోలుచేసుకోవచ్చు: Isha Shoppe