ప్రశ్నకున్న శక్తి - ఎందుకీ Youth and Truth? ఉద్యమం
తమ కాలేజీ జీవితంలో ఒక తుంటరి ప్రశ్న క్లాస్ నుంచి తనను డిస్ మిస్ చేయడానికి కారణమైన ఒక సంఘటన గురించి వివరిస్తూ, సద్గురు అసలీ Youth and Truth? ఎందుకో వివరిస్తున్నారు. ఆయన ‘‘మనకు అలా ప్రశ్నించడానికి సాహసించే వారే కాదు, ఆ సమాధానం తెలుసుకోవడానికి తమ జీవితాన్నైనా పణంగా పెట్టే వారు కావాలి’’ అంటారు.
అసలు నేను చేసింది సరైనదేకాదు, అలాంటి సలహా కూడా ఇవ్వను. కాని క్లాసురూములో కేవలం డిక్టేషన్ చెప్పడం, నోట్స్ రాసుకోవడంతో సరిపోతోంది, మరి నేనేమో ఒక స్టెనోగ్రాఫర్ కావాలని అనుకోవడం లేదు.
క్లాసునుండి బయటకు పంపివేయబడడం నాకేమీ క్రొత్త కాదు. నాకు స్కూలు కూడా బోరుకొట్టేది, ఎందుకంటే టీచర్లు తాము చెప్పేది తమ జీవితానుభవం కాదనిపించేది. నా చిన్నప్పుడు చాలా వరకు నా టైమంతా స్కూలు బయట, పిల్ల కాలువలో ఎన్నో రకాలైన జల జీవులను చూస్తూ గడిపేసేవాడిని. తరువాత మా తల్లి తండ్రులకు ఆ విషయం తెలిసి, నా పనులను వాన నీళ్ళతో ఆడు కోవడం గా కొట్టిపారేశారు. నన్ను మళ్ళీ క్లాసుకు పంపేరు.
ప్రశ్నలకు ఎప్పుడూ అంతేలేదు
మరి నేను సోమరితనాన్ని ప్రోత్సహిస్తున్నానా? ఖచితంగా కాదు. కాని నేను ఎత్తి చూపపేది ఏమిటంటే, యువతకు అనేక ప్రశ్నలు ఉంటాయని, అనేకం ఉంటాయని, వాటికి చాలా అరుదుగా సమాధానాలు దొరుకుతాయని చెబుతున్నాను. ఆలోచించడం తెలియని పెద్దలు మాట్లాడేదంతా, ర్యాంకులు, ఉద్యోగాలు, డబ్బు సంపాదించడం తప్ప పనికి వచ్చేది ఏదీ లేదు. నా బుర్రలో ఎప్పుడూ లక్షల కొద్దీ ప్రశ్నలు ఉండేవి, మానాన్న తరచూ నిస్పృహతో చేతులెత్తేసి ‘వీడు జీవితంలో ఏమి అవుతాడో’ అనేవారు. ఆయనకు తెలియనిదేమిటంటే జీవితంలో నేను చేద్దామనుకున్న వాటికి కొదువ ఏమీ లేదన్న విషయం. నాకు క్లాసు రూము చాలా డల్ గా అనిపించేది, నాకు మిగతావన్నీ ఎంతో ఇంట్రెస్టుగా ఉండేవి. అసలు ఈ ప్రపంచం ఎలా తయారయ్యింది? ఈ ఋతువులేంటి? భూమి, దున్నినప్పుడూ, పంటలున్నప్పుడూ అది ఎలా మారుతుంటుంది? ప్రజలు బ్రతుకుతున్న విధానం గురించి నాకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. నా జీవితమంతా అనేక ప్రశ్నలతో నిండి ఉండేది.
యువతలో ప్రశ్నలకు కొదువ ఉండదు. భారత దేశంలో ఏభై శాతం మంది పాతికేళ్ళ లోపు వారే, అంటే ఎన్నో ప్రశ్నలున్నాయని. ఈ అరవై ఐదు కోట్ల మంది యువతకూ ఉన్న ఆశలూ, ఆశయాలే ఈ దేశం, ఈ భూగోళం భవితవ్యాన్ని తీర్చి దిద్దుతాయి. కాని చాలా మంది యువత తాము తయారు చేయని ఈ ఇంపోజిషన్ లు, ఒత్తిడులతో సతమౌతోంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు వారిలో జరిగే ఆత్మహత్యలలో మనం ముందుండటం సిగ్గు చేటు. దేశంలో ప్రతిగంటా ఒక విద్యార్థి ఆత్మహత్యకు గురౌతున్నాడు. ఇవి భరించలేని గణాంకాలు, అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
రాబోయే కొన్ని రోజుల్లో నేను యువతతో కొంత సమయం గడపబోతున్నాను. దీని వెనక ఉద్దేశం వారికి నైతికతని, సలహాలని ఇవ్వడానికి కాదు. ఇటువంటి ఉపన్యాసాలు నా చిన్నప్పుడు నాకు పనిచేయలేదు. నేను ఇవ్వగలిగింది స్పష్టత మాత్రమే – నాకు 25సంవత్సరాలప్పుడు కలిగిన స్పష్టత. ఎందుకంటే నాకప్పుడు ప్రశ్నలుండేవి, వాటితో నేను జీవించాను. ఏ రకమైన నిర్ధారణ లేకుండా ప్రశ్నలతో జీవించడం అనేది జీవితంలో అధ్భుతమైన సాహసం.
“నాకు తెలీదు” అనేదొక గొప్ప అవకాశం
“నాకు తెలీదు” అనే స్థితిలో ఉండడంలోని అవకాశాలను ఈ ప్రపంచం తెలుసుకోకపోవడం విషాదం. ఆ ఆశ్చర్య స్థితిలో ఉండగల సామర్ధ్యాన్ని నమ్మకాలు, నిర్ధారణలు అనేవి జ్ఞానం అనే మారువేషంతో తుంచేసారు. “నాకు తెలీదు” అనేది ఒక ద్వారం – ఒకే ఒక ద్వారం – ఏదైనా తెలుసుకోవడానికి.
ఈనాటి యువత ముందున్న దారి ఇదే. ఇది ప్రగాఢమైన జీవితానికి ఉన్న దారి, ఈ సాహసాన్ని అలసిపోయిన పెద్దలు మర్చిపోయారు. ‘‘మనకు కావాల్సింది కేవలం అలా ప్రశ్నించడానికి సాహసించే యువత కాదు, ఆ సమాధానం తెలుసుకోవడానికి తమ జీవితాన్నైనా పణంగా పెట్టడానికి సాహసించే వారు కావాలి. మన శ్రేయస్సు, విశ్వ శ్రేయస్సు దీని మీదే ఆధారపడి ఉంది.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.