క్యాన్సర్ నివారణలో యోగా పాత్ర ఏమిటి?
యోగా ప్రకారం క్యాన్సర్‌ను ఎలా చూస్తారు, ఈ వ్యాధిని నివారించేందుకు యోగా పరంగా ఏమి చేయవచ్చు అనే విషయాల గురించి సద్గురు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు. అలాగే, భారతీయ సాంప్రదాయక వైద్యం సూచించే కొన్ని సహజ మార్గాల ద్వారా క్యాన్సర్‌ను ఎలా దూరంగా ఉంచవచ్చో కూడా వివరిస్తున్నారు.
యోగా ప్రకారం క్యాన్సర్ ని ఎలా చూస్తారు, ఈ వ్యాధిని నివారించేందుకు యోగా పరంగా ఏమి చేయవచ్చు అనే విషయాల గురించి సద్గురు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు. అలాగే, భారతీయ సాంప్రదాయక వైద్యం సూచించే కొన్ని సహజ మార్గాల ద్వారా క్యాన్సర్ ని ఎలా దూరంగా ఉంచవచ్చో కూడా వివరిస్తున్నారు.
మన అందరి శరీరాలలోను క్యాన్సర్ కణాలు ఉంటాయి. యోగా వ్యవస్థలో క్యాన్సర్ కణాలను, ఉదాహరణగా చెప్పాలంటే, సమాజంలో నేరస్థులతో పోలుస్తాము. చిన్న చిన్న నేరాలను చేసే వ్యక్తులు అక్కడక్కడ ఉన్నా కూడా సమాజంపై ప్రభావం పెద్దగా ఉండదు. కానీ వారందరూ ఒక్క చోట గుంపుగా చేరితే, ఎదో ఒక పెద్ద నేరం జరుగుతుంది. అదే విధంగా, మీ శరీరంలో కొన్ని క్యాన్సర్ కణాలు ఉంటే, అవి మీ ఆరోగ్యంపై కానీ, మీ జీవితంపై కానీ ఏ విధమైన ప్రభావం చూపవు. సాధారణంగా యోగాలో మనం దీనిని ఈ విధంగా చూస్తాము: ఒక వ్యక్తి దృక్పధం, ఆహారం, జీవనశైలి లేదా శక్తి శరీరాన్ని ప్రభావితం చేసే ఏ ఇతర కారణం వల్లనైనా, శక్తి శరీరంలో కొన్ని రకాల శూన్యతలు ఏర్పడినప్పుడు, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం సృష్టించబడుతుంది. శరీరంలోని ఏదైనా ఒక భాగంలో శక్తి ప్రవాహం సరిగా లేకపోతే, క్యాన్సర్ కణాలు దాక్కోవడానికి, వృద్ధి చెందడానికి ఆ భాగాన్ని ఎంచుకుంటాయి.
పిల్లలను కనవలసిన వయసులో చాలా మంది మహిళలు గర్భం ధరించనందువలన రొమ్ము క్యాన్సర్, ముఖ్యంగా పాశ్చాత్య సమాజాలలో నేడు ప్రబలంగా ఉంది. నేను వారికి మరింత సంతానాన్ని కనాలని చెప్పడం లేదు. ఇప్పటికే అధిక జనాభా ఉన్న ప్రపంచంలో వారు చేస్తున్నది ఒక మంచి పనే. అసలు విషయమేమిటంటే ప్రధానంగా పిల్లలకు పాలివ్వటానికే ఉన్న రొమ్ము వ్యవస్థ ఉపయోగించుకోబడటం లేదు, లేదా కేవలం ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే దానిని ఉపయోగించుకుంటున్నారు. గతంలో, ఒక మహిళ 16 లేదా 18 ఏళ్ళ నుండి 45 వరకు, సహజంగానే మాటిమాటికీ గర్భం ధరించటం ద్వారా ఆమె పూర్తి వ్యవస్థ, గర్భాశయం, రొమ్ము చాలా విధాలుగా క్రియాశీలంగా ఉండేవి. ఇది ఆమెలో శక్తిని సరిగ్గా ప్రసరింపచేసేది.
నేడు, చాలా మంది మహిళలకు 30 సంవత్సరాలకే వారి గర్భధారణ అయిపోతోంది. వారి జీవితంలో మరో 15 నుండి 20 సంవత్సరాల వరకు పిల్లలను కనడానికి అవసరమైన హార్మోన్లు, ఎంజైములు ఉత్పత్తి అవుతున్నప్పటికీ, వాటిని ఉపయోగించుకోవడం లేదు. శరీరధర్మం ప్రకారం ఉపయోగించుకోవలసిన విధంగా వీటిని ఉపయోగించుకోనందు వలన ఆ శరీర భాగంలో శక్తి తగ్గి, అది క్యాన్సర్ కణాలను ఆకర్షించి, అవి పెరిగే స్థలంగా మారుతుంది.
అంటే దాని అర్ధం మనం మరింత మంది పిల్లలని కనాలనా? దయచేసి అలా చేయకండి. దీనికి పరిష్కార మార్గాలు ఉన్నాయి.
ఉపవాసం
వ్యవస్థలో క్యాన్సర్ కణాలను తగ్గించే సరళమైన మార్గాలలో ఒకటి క్రమ పద్ధతిలో అప్పుడప్పుడూ ఉపవాసం ఉండడం. ఈ క్యాన్సర్ కణాల యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, వీటికి ఒక సాధారణ కణం కంటే 30 రెట్లు ఎక్కువ ఆహారం అవసరమవుతుంది. కేవలం కొన్ని నిర్దేశిత రోజుల్లో మీరు ఆహారాన్ని తీసుకోకపోవడం ద్వారా క్యాన్సర్ కణాల స్థాయిని తగ్గించవచ్చు.
ఆసనాలు, క్రియలు
అలాగే కొన్ని రకాల సాధనల ద్వారా మనలో హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించవచ్చు. మేము నేర్పే శక్తి చలన క్రియ, ఆసనాలు మన వ్యవస్ధను సరిచేసి సమతుల్యంలో ఉంచడానికి దోహదపడుతాయి. కేవలం కొన్ని ఆసనాల, క్రియల సాధన ద్వారా చాలా మంది స్త్రీలలో పాలిసిస్టిక్ అండాశయాలు వంటి గర్భాశయ సంబంధిత సమస్యలు పూర్తిగా నయమవడం చూశాము. శక్తి చలన క్రియ, ఆసనాల వల్ల శరీరంలోని హార్మోన్ల స్థితి కేవలం మీరు తినే ఆహారం, నివసించే వాతావరణాలకు ప్రతిస్పందిస్తూ అదుపుతప్పిపోకుండా, సరైన నియంత్రణలో ఉంటుంది.
ఈ ప్రక్రియలు క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు ఎంతవరకు సహాయపడ్డాయో చెప్పడానికి నిర్దేశిత ఋజువులు లేవు, దీనిని నిర్దారించలేము కూడా. కానీ ఖచ్చితంగా వారు చాలా బాగా కోలుకోవడాన్ని మేము గమనించాం. ఈ క్యాన్సర్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా కీమోథెరపీకి వారి స్పందన చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. యోగా ప్రక్రియలు అభ్యాసం చేసిన తర్వాత చాలా త్వరగా కీమోథెరపీ నుండి కోలుకున్న వారిని కూడా చూసాము. యోగా ప్రక్రియల వల్ల వారి క్యాన్సర్ తగ్గిందా అన్న విషయాన్ని నిర్ధారించే మార్గం లేదు. కాని, వైద్య చికిత్సకు అనుబంధంగా యోగా చేయడం ఖచ్చితంగా రోగికి లాభదాయకమని నేను అంటాను.
వేప, పసుపు
మరొక విషయం ఏమిటంటే చిన్న గోలీల పరిమాణంలో ఉండలుగా తయారు చేసిన వేప, పసుపు ముద్దలను రోజూ తినాలి. ఇలా చేయటం శరీరంలోని క్యాన్సర్ కణాల సంఖ్యను ఒక నిర్దిష్ట శాతంలో ఉంచుతుంది. అందువల్ల అవి వ్యవస్థకి వ్యతిరేకంగా గుమిగూడవు. శరీరంలో జడత్వం స్థాయి పెరిగితే, అది కణాలలోకి కొంత శక్తిని అనుమతించదు. మనము ముందు అనుకున్నట్లుగా, శక్తి స్వేచ్ఛగా ప్రవహించని శరీర భాగాలు క్యాన్సర్కి గురవుతాయి. వేప, పసుపు కలిసి కణాలను వ్యాకోచింప చేసి, తద్వారా వాటిలోకి శక్తి ప్రసరణను మెరుగు చేసే పరికరాలుగా పనిచేస్తాయి.
ఉదాహరణకు, మీ కంటి వైద్యులు మీ కళ్ళలోకి చూడాలనుకుంటే, ఊరికే అలా చూడటం ద్వారా ఎక్కువ తెలుసుకోలేరు.అదే కనుపాపను వెడల్పు చేసే మందు చుక్కలు వేస్తే, మీ కనుపాప పెద్దదవుతుంది, అప్పుడు అతను లోపలికి చూడగలడు. వేప, పసుపులు శరీరంలోని ప్రతి మూలలోకి శక్తి ప్రవేశించేలా, ప్రతి మూలా దానితో నింపబడేలా శరీరాన్ని వ్యాకోచింప జేస్తాయి. ఇది ఇప్పటికే వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి చికిత్స కాకపోవచ్చు, కానీ సాంప్రదాయకంగా మీరు రోజూ వేప, పసుపు తింటే, శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా అదుపులో ఉంచవచ్చని చెప్పేవారు.
ప్రేమాశీస్సులతో,
సద్గురు