మరింత గాఢంగా ఇన్నర్ ఇంజినీరింగ్‍ని అనుభూతి చెందేందుకు, అలాగే మీ సాధనలు సరి చేసుకునేందుకు ఇది ఒక అవకాశం.
7:30 AM IST, ఫిబ్రవరి 2, 2025
(ప్రతి నెల మొదటి ఆదివారం)
ఆన్‌లైన్‌లో అలాగే స్వయంగా కూడా పాల్గొనవచ్చు
ఉచితంగా అందించబడుతుంది
"సత్సంగం అంటే సత్యంతో కలయిక. సృష్టికర్తతో అనుసంధానం అవ్వడానికి ఇదో అవకాశం."
ముఖ్యాంశాలు
శాంభవి మహాముద్ర క్రియ సాధన (ఈశాంగా సూచనలతో)
సాధనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు
సద్గురుతో శక్తివంతమైన గైడెడ్ ధ్యానాలు
సద్గురు నుండి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు
సత్సంగంలో పాల్గొనే మార్గాలు
మీ సమీపంలోని సెంటర్‌లో నెలవారీ సత్సంగంలో పాల్గొనండి.
తేదీ: ఫిబ్రవరి 2, 2025
సమయం: ఉదయం 7:30 (IST)
సూచనలు
ఈ సత్సంగం కేవలం శాంభవి మహాముద్ర క్రియలోకి దీక్ష పొందిన వారికి మాత్రమే.
పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోండి.
దయచేసి సమయానికి కనీసం 15 నిమిషాలు ముందుగా కూర్చోండి.
స్వయంగా పాల్గొనే సత్సంగంలానే, ఆన్‌లైన్ సత్సంగం కూడా కేవలం శాంభవి మహాముద్ర క్రియ లోకి దీక్ష పొందిన వారికి మాత్రమే.
దీక్ష పొందని వారు, మీ కుటుంబ సభ్యులు అయినా సరే, వారు ఈ సత్సంగంలో హాజరు కాకుండా చూసుకోండి.
పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోండి.
అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పటానికి, మీరున్న ప్రదేశంలో సద్గురు ఫోటో పెట్టి, ముందు ఒక దీపాన్ని వెలిగించి పెడితే మంచిది. నేలపై కూర్చోవడం ఉత్తమం.
ఈ సమయాన్ని ప్రత్యేకంగా సత్సంగం కోసం కేటాయించండి, మధ్యలో బాత్ రూమ్ కి వెళ్ళటం, ఫోన్‍లో మాట్లాడటం, మెసేజ్‍లు చూసుకోవటం లాంటివి చేయకండి. ఎలాంటి ఆటంకాలు, అంతరాయాలు లేకుండా చూసుకోండి.
స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి.
ల్యాప్‌టాప్ ద్వారా జాయిన్ అయ్యి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడితే మంచిది.
సెషన్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి కనీసం 15 నిమిషాలు ముందుగా లాగిన్ అవ్వడం మంచిదని సిఫార్సు చేస్తున్నాము.