కష్ట కాలంలో సద్గురు అందిస్తున్న కానుకలు
ఈ అసాధారణమైన క్లిష్ట సమయాలకు ఎదురీదే విధంగా మనకు సహకరించే రోజువారీ సాధన ఇంకా సాధన సహాయాన్ని సద్గురు అందిస్తున్నారు.
అంతర్జాతీయ మహమ్మారి కరోనా వైరస్ (COVID-19) ఇంకా ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉండడం వల్ల మనం అసాధారణమైన క్లిష్ట సమయాన్ని గడుపుతున్నాము. మనమందరం మన దైనందిన జీవితాల్లో గణనీయమైన మార్పులను అనుభవిస్తున్నాము. ఈ అనిశ్చిత పరిస్థితి కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి అవుతూ ఉండవచ్చు.
ఇలాంటి సమయాల్లో మన ఉత్సాహాన్ని, అంతరంగ సమతౌల్యాన్ని ఇంకా శ్రేయస్సును పెంపొందించుకోవడం మరింత అవసరం. దీనివల్ల మన చుట్టూ ఉన్న వారందరికీ మనం బాసటగా ఉండవచ్చు.
దీనిలో భాగంగా సద్గురు, సూచనలతో కూడిన సులభమైన ఇంకా శక్తివంతమైన సాధనను అందించారు. ఈ రోజువారీ సాధన వల్ల మనం ప్రయోజనం పొందవచ్చు. మరింత సహాయం అవసరం ఉన్న వారు రోజువారీ సాధన షెడ్యూల్ కు రిజిస్టర్ చేసుకోగలరు.
సద్గురు అందించిన రోజువారీ సాధన – అందరి కోసం
యోగ యోగ యోగేశ్వరాయ మంత్రోచ్ఛారణ (12 సార్లు) చేసిన తరువాత ఈశా క్రియా ధ్యానం చేయాలి.
సాధనను ఎలా నేర్చుకోవాలి?
మొదటి సూచన: సాధన యొక్క ప్రాధాన్యతను తెలుసుకోండి.
రెండవ సూచన: “యోగ యోగ యోగేశ్వరాయ” మంత్రోచ్ఛారణను నేర్చుకోండి.
మూడవ సూచన: ఈశా క్రియను నేర్చుకోండి.
4వ సూచన: పూర్తి సూచనలతో కూడిన రోజువారీ సాధన “యోగ యోగ యోగేశ్వరాయ” మంత్రోచ్ఛారణ. తరువాత ఈశా క్రియ.
సింహ క్రియ
రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇంకా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి ఇది ఎంతో సరళమైన యోగ ప్రక్రియ.
ఈ కష్ట సమయంలో, బలమైన రోగనిరోధక వ్యవస్థను, ఇంకా బాగా పనిచేసే శ్వాసకోశ వ్యవస్థను కలిగి ఉండటం కోసం సద్గురు సులువైన సాధనను అందించారు.
సాధన సూచనలు
మీ కడుపు నిండుగా ఉండకూడదు; కొద్దిగా ఆకలితో ఉండాలి. మీరు భోజనానికి ఇంకా సాధనకి మధ్య 2.30 గంటల వ్యవధి ఇవ్వడం ఉత్తమం.
6 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా, వారి శారీరక ఇంకా ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ అభ్యాసాన్ని చేయవచ్చు.
6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, ఇంకా 70 ఏళ్ళకు పైబడిన వారు కూడా ఈ అభ్యాసాన్ని చేయవచ్చు, కాని వారు శ్వాసను 12 సార్లు మాత్రమే చేయాలి (21 సార్లు కాదు).
మెదడులో ఏదైనా కణితి ఉన్నా, లేదా మెదడుకు ఏదైనా దెబ్బ తగిలిన వ్యక్తులు కూడా ఈ అభ్యాసాన్ని చేయవచ్చు, కాని వారు శ్వాసను 12 సార్లు మాత్రమే చేయాలి (21 సార్లు కాదు)
శాంభవి మహాముద్ర క్రియలో దీక్ష పొందిన వారి కోసం
ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు, మన మేధస్సు, ఆరోగ్యం, సమతుల్యత అత్యంత కీలకమౌతాయి. అంతరంగం వైపు మరలడానికి అది మరింత అవసరం అవుతుంది. మీరు ఈ దిగ్బంధన సమయాన్ని అంతరంగంలో మరింత ఉత్సాహం, స్థిరత్వం పొందే విధంగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మీరు 40- రోజుల నిర్మాణాత్మకమైన సాధన సహాయం కోసం రిజిస్టర్ కావచ్చు.
సద్గురు రూపొందించిన రోజువారీ ప్రాక్టీస్ షెడ్యూల్ కు నమోదు చేసుకున్న వారిని మేము సంప్రదిస్తాము.
40-రోజుల సాధన సపోర్ట్ కోసం ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.
(రోజువారీ సాధనకోసం సైన్ అప్ చేసుకున్న వారు దీనికి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు)
మరింత సమాచారం కోసం, ఈ క్రింద సంప్రదించండి
SadhanaSupport.usa@ishafoundation.org (అమెరికా మరియు కెనడాలో ఉన్నవారి కోసం)
SadhanaSupport.europe@ishafoundation.org (యూకె మరియు యూరప్ లో ఉన్న వారికోసం)
SadhanaSupport.apac@ishafoundation.org (ఆసియా మరియు ఆస్ట్రేలియా/న్యూజిలాండ్ లో ఉన్నవారి కోసం)
SadhanaSupport.russian@ishafoundation.org (రష్యాలో ఉన్నవారి కోసం)
SadhanaSupport@ishafoundation.org (భారతదేశం మరియు ఇంకా ఇతర దేశాల్లో ఉన్నవారి కోసం)